Gravel illegal move
-
కొండలు కొల్లగొడుతున్నారు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపద అయినటువంటి కొండలను తవ్వేస్తూ అక్రమంగా రాళ్లు, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవానికి మండలంలోని అధికారికంగా ఎటువంటి క్వారీలు లేవు. కానీ ఇటీవల విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గ్రావెల్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. అదును చూసి శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని కొండలను నాశనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసి కలపను కూడా తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు..? ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఒక వైపు రెవెన్యూశాఖ, మరో వైపు పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారులకు తెలిసే అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు మామూళ్లు ఇస్తుండడంతో నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నిసార్లు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంటున్న వాహనాలను కూడా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రకృతి సంపదను అక్రమార్కులు నాశనం చేస్తారని వాపోతున్నారు. పర్యావరణానికి ముప్పు కొండలు, చెట్లు వంటివి ప్రకృతి సంపద. వీటి మనుగడతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుంది. అయితే మనుషులు తమ స్వార్థం కోసం కొండలను తవ్వేస్తూ, చెట్లను నరికేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. ఫలితంగా మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మరోవైపు చెట్లను నరికేస్తుండడం వలన వాతావరణంలో మార్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రకృతి సంపదకు నష్టం కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ప్రభుత్వ భూముల్లోని కొండలను తవ్వేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఇబ్బందులు వస్తున్నాయి. కొండలపై ఉండే చెట్లను కూడా అక్రమార్కులు నరికేస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్‌లో జరిగబోయే నష్టాలు గురించి ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. – బమ్మిడి భూపతిరావు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, మఖరజోల, అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ భూములు నుంచి అక్రమంగా కంకర, మట్టి, రాళ్లను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత భూముల నుంచి కూడా గ్రావెల్ తీసుకెళ్లాలంటే రెవెన్యూ నుంచి మైన్స్ ద్వారా అనుమతి తప్పక పొందాలి. ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవు. – దల్లి కొండలరావు, తహసీల్దార్, మందస -
రెచ్చిపోతున్న పచ్చ మాఫియా
తిరుమనకొండను తవ్వి గ్రావెల్ అక్రమ తరలింపు అధికార పార్టీ అండదండలు పట్టించుకోని అధికారులు మండల కేంద్రం సంగానికి కూతవేటు దూరంలో ఉన్న తిరుమనకొండను తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. కొందరు పచ్చ కార్యకర్తలు మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమనకొండపై ఏకంగా యంత్రాలను పెట్టి భారీగా గోతులు తీసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంగం(ఆత్మకూరు): సంగం, బుచ్చి మండలాల్లో గ్రావెల్‌కు మంచి డిమాండ్ ఉండడంతో కొందరు పచ్చ కార్యకర్తలు అక్రమంగా తిరుమనకొండను తవ్వేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదంటూ సంగం తహసీల్దారు రామాంజనేయులు బోర్డులు ఏర్పాటు చేసినా మాఫియా గ్రావెల్ తరలింపులను ఆపలేదు. ఈ బోర్డులు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. సంగం సర్వే నెం.252/ఏ2లో 15 ఎకరాల తిరుమనకొండ ప్రభుత్వ భూమిగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ గ్రావెల్‌ను అక్రమంగా తరిలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు గత వారంలో ధైర్యం చేసి ఒక జేసీబీ యంత్రాన్ని, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న వీటిపై కేసులు నమోదు చేసే ధైర్యం చేయలేకపోయారు. అధికార పార్టీ స్థానిక నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు ఫోన్లు, బెదరింపులు వస్తుండడంతో వీటిని వదిలేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో తిరుమనకొండ వైపు చూడడానికి అధికారులు సాహసం చేయడం లేదు. దీంతో రెచ్చిపోతున్న పచ్చగ్రావెల్ మాఫియా భారీగా గ్రావెల్‌ను తరలిస్తుంది. యథేచ్ఛగా తరలింపు ఏకంగా తిరుమనకొండ పైకి రహదారి ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారు. పగలు, రాత్రి ఈ గ్రావెల్ తరలింపు వల్ల దుమ్ము విపరీతంగా వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికంగా నివాసమున్న దళితులు వాపోతున్నారు. ట్రాక్టర్ గ్రావెల్‌ను సంగానికి తరలించడానికి రూ.1000, బుచ్చిరెడ్డిపాళేనికి అయితే రూ.1500 వసూలు చేస్తున్నారు. రోజుకు 100 ట్రిప్పులు గ్రావెల్ తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లక్షల్లో చేతులు మారుతున్నాయి. గ్రావెల్ తరలింపును అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ మాత్రం ఇటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికే మైనింగ్ శాఖకు నెలసరి మామూళ్లు ఇచ్చేలా గ్రావెల్ మాఫియా ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ పనిచేయకుండా నెలసరి మామూళ్ల మత్తులో జోగుతూ తరలింపుదారులకు సహకరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు తిరుమనకొండ ప్రాంతం పూర్తిగా ప్రభుత్వ భూమి. దీనిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్కడ బోర్డులు ఏర్పాటు చేశాం. అయినా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – రామాంజనేయులు, తహసీల్దారు, సంగం -
హైడ్రామాకు తెర
హంస’కు 15 రోజుల రిమాండ్ నెల్లూరు రూరల్ : శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల్లో టేకుచెట్ల నరికివేత, గ్రావెల్ అక్రమ తరలింపు కేసుల్లో ప్రధాన నిందితుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా ఓ మాజీమంత్రి నడిపిన హైడ్రామాకు తెరపడింది. నాలుగు కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న హంసకుమార్‌రెడ్డి కోసం రూరల్ పోలీసులు విసృ్తతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే అధికార పార్టీ అండదండలతో టేకుచెట్ల నరికివేత, కాల్‌మనీలో మహిళ వేధింపు కేసు, టిప్పర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందారు. మిగిలిన అక్రమ గ్రావెల్ కేసులో అరెస్ట్ చేయకపోతే పోలీసుల పరువు పోతుందని భావించిన ఎస్సీ ఆధ్వర్యంలో నెల్లూరురూరల్ పోలీసు లు హంసకుమార్‌రెడ్డి కోసం గాలింపు వేగవంతం చేశారు. హైదరాబాద్‌లో సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న హంసకుమార్రెడ్డిని శుక్రవారం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. ఎలాగైనా హంసకుమార్రెడ్డిని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలని మాజీ మంత్రి విశ్వప్రయత్నం చేశాడు. హంసకుమార్రెడ్డిని విలేకర్ల సమావేశంలో ప్రవేశపెట్టకుండా జిల్లా మంత్రి సహకారంతో పోలీసులపై ఒత్తిడి చేయించారు. పోలీసులు లీగల్ సమస్యలు ఉన్నాయంటూ వేమిరెడ్డిని హడావుడిగా వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ కూడా ప్రభుత్వ వైద్యులను అధికారంతో బెదిరించి ఆరోగ్యంగా నడిచి వచ్చిన హంసకుమార్రెడ్డిని ఐసీయూలో చేర్పించారు. సుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, బీపీ కూడా అధికంగా ఉందని మెడికల్ రిపోర్టు తీసుకెళ్లి కోర్టులో జడ్జి ఎదుట పోలీసులు హాజరు పర్చారు. పూర్తి మెడికల్ రిపోర్టుతో కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశించడంతో శుక్రవారం తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మిగతా కేసుల్లో పొందినట్లుగా ముందస్తు బెయిల్ పొంది దర్జాగా బయటకు తీసుకురావాలని మాజీ మంత్రి విశ్వప్రయత్నం చేశారు. శనివారం కోర్టుకు హాజరు పరిచిన హంసకుమార్రెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో 60 రోజుల హైడ్రామాకు తెరపడింది.