great tribute
-
ప్రజాభీష్టానికి అనుగుణంగానే పాలన సాగిస్తాం
ఇంద్రవెల్లి: ప్రజలు రాచరిక పాలన నుంచి విముక్తి పొంది, ఇందిరమ్మ రాజ్యం కోరుకున్నారని, వారి అభిష్టానికి అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తామని రాష్ట్ర పంచాయతీరా జ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ప్రజా పాలనకు సంబంధించి బుధవారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశానికి వెళ్తూ, మార్గమధ్యలో ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఆగారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ఆదివాసీ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, డీపీవో శ్రీనివాస్‌తో పాటు అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్మృతి వనం ఏర్పాట్లపై ఐటీడీఏ పీవోతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. పేదల ఆశలు నెరవేర్చే దిశగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ జరిగిన దళిత, ఆదివాసీ దండోరా సభలో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగే సభకు 50 వేల మందితో బయలుదేరి వెళ్తున్నట్లు సీతక్క వెల్లడించారు. -
దివంగత నేత వైఎస్ఆర్కు సాక్షి మీడియా గ్రూప్ నివాళులు
-
ఢిల్లీకి పయనమైన నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప నాయకుడు. ఆయనతో మంత్రి మండలిలో పని చేసే అవకాశం లభించడం గొప్ప అవకాశం. ఆయన ఆధ్వర్యంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం విశేష అనుభూతి మిగిల్చిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీకి పయనం అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణ రక్షణ వ్యవస్థ ఆధారంతో ఆయనకు చికిత్స కొనసాగించినట్లు న్యూ ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తాజా ప్రకటన జారీ చేసింది. మాజీ ప్రధాన మంత్రి మృతిచెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం న్యూ ఢిల్లీ బయల్దేరారు. ఆరోగ్యం క్షీణించడంతో గత 9 వారాలుగా అటల్ బిహారీ వాజ్‌పేయి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. దేశం కోల్పోయిన ఘనమైన నాయకుడు భువనేశ్వర్ : భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి మరణంతో దేశం ఘనమైన నాయకుని కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతి ప్రాప్తించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. వాజ్‌పేయి మరణంతో దిగ్భ్రాంతి చెందినట్లు తెలిపారు. దేశ ప్రజల అభిమాన నాయకునిగా వెలుగొందిన భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకునిగా వెలుగొందారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. మాజీ ప్రధానికి ఘన నివాళి బరంపురం : మాజీ ప్రధానిమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి అనారోగ్యంతో దేశ రాజధాని ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం పరలోకం చెందారు. ఈ సందర్భంగా గంజాం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ మెయిన్ రోడ్లో గల గాంధీ విగ్రహం దగ్గర మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆత్మ శాంతి కలగాలని ప్రగాఢ సంతాపం వెలిబచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నుచరణ్ పతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, కార్యదర్శి రాజేంద్ర సాహు, సునీల్ సాహు, టామన్నా పాఢి, శరత్ సాహు తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో సంతాపం పర్లాకిమిడి : మాజీప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఆకస్మిక మృతి పట్ల గజపతి జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటరమణ, సిద్ధేశ్వర మిశ్రా, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, ప్రశాంతకుమార్ పాలో, సత్యవాది పాత్రో, గౌరంగో గౌడ, అరుణ్ పట్నాయిక్, సునీల్ మహాపాత్రో, ముల్లి గోపాలరావు, బారిక్ జెన్నా తదితరులు పాల్గొన్నారు. స్థానిక సి.టి.హైస్కూల్లో ట్రైనింగ్ పోందుతున్న టీచర్లు అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. -
ధైర్యశాలి.. దార్శనికుడు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంతో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 1968లో జనసంఘ్‌లో చేరి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తూ బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ధైర్యశాలి అంటూ ఆయనను కొనియాడారు. మంచి వక్త, దార్శనికుడైన ఆయన మరణం దేశానికి తీరని లోటని వాపోయారు. గ్రామాభివృద్ధి ఆయన చలవే శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి బీజేపీ రాష్ట్రకార్యదర్శి పైడి వేణుగోపాలం సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, తాగునీరు, మహిళాదీపం పథకం, కిసాన్‌క్రెడిట్ కార్డులు, అంత్యోదయ కార్డులకు 35 కేజీలు బియ్యం అందించిన మహనీయుడు అని ప్రశంసించారు. అసంఘటిత కార్మికుల కోసం ఎన్నో పథకాలు రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా దుప్పల రవీంద్రబాబు, బీజేపీ యువ నాయుకుడు జిల్లా అధ్యక్షుడు బత్తుల పవన్‌సాయి, నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు శవ్వాన ఉమామహేశ్వరి, సంపతిరావు నాగేశ్వరరావు, పండి యోగేశ్వరరావు, అల్లు మల్లేశ్వరరావు, ఎస్.వి రమణమూర్తి, పసుపులేటి సురేష్‌సింగ్, శవ్వాన వెంకటేశ్వరరావు, బెండి రవికాంత్, దయాసాగర్, ఎస్.వి రమణమూర్తి, పూజాకి చెల్లయ్య, కీర్తి శాంతారావు, దొంతం చంద్రశేఖరరావు పాల్గొన్నారు. జిల్లాతో అనుబంధం ఇలా 1983 జనవరిలో అçప్పటి హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో బీజేపీ తరఫున సంపతిరావు రాఘవరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కోటబొమ్మాళిలో ఏర్పాటుచేసిన సమావేశానికి వాజ్‌పేయి హాజరయ్యారు. అదే రోజు అదే నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా గాంధీ హెలికాఫ్టర్‌లో వస్తే.. ఆయన మాత్రం ఒక సాధారణ వ్యక్తిలా అంబాసిడర్ కారుతో వచ్చారు. ఈ సభలో ఆయన చేసిన హిందీ ప్రసంగాన్ని తెలుగులో ప్రధాన కృష్ణమూర్తి అనువదించారు. తర్వాత శ్రీకాకుళంలోని వంశధార అతిథి గృహానికి వెళ్లి అక్కడ కొంతసేపు విరామం తీసుకుని తిరిగి పయనమయ్యారు. కొవ్వొత్తులతో నివాళులు కాశీబుగ్గ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపంగా గురువారం పలాస–కాశీబు గ్గ పట్టణంలో పలాస యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి 8గంటలకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు. భారతీయుల హృదయంలో చిరస్మరణీయుడు! ‘‘యుక్త వయసు నుంచే గొప్ప జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన నాయకుడు వాజ్‌పేయి. నిస్వార్థమైన, మచ్చలేని జీవితం గడిపారు. ఆయన ఆర్ఎస్ఎస్ సుశిక్షితుడే అయినా హిందూయేతర మతస్థులకూ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ పదవేదో ఆయనకు ఏ ఆకస్మిక రాజకీయ పరిణామాలతో వచ్చిందికాదు. వాజ్‌పేయి ప్రధాని అవుతారని ఆయన పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టినప్పుడే భారతదేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి ప్రశంసలు పొందారు. గొప్ప వ్యక్తిత్వం వాజ్‌పేయి సొంతం. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా భారతీయుల హృదయంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు’’. – ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర మాజీ మంత్రి వాజ్‌పేయితో ఎంతో అనుబంధం వాజ్‌పేయి జిల్లాకు 1983లో వచ్చినప్పుడు మా నాన్న అట్టాడ అప్పలనాయుడితో కలిసి ఎమ్మెల్సీ పి.వి.చలపతిరావుతో పాటు నేను ఈ సభకు వెళ్లాం. అనంతరం 1996లో వెంకయ్యనాయుడు కుమార్తె వివాహ వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహిస్తే మళ్లీ కలిసి భోజనం కూడా చేశాం. నాతో పాటు ఆమదాలవలసకు చెందిన గురుగుబెల్లి వెంకటరావు మాస్టారు కూడా ఉన్నారు. అప్పట్లో బీజేపీలో చేరాను. – అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ నాయకుడు ఆయన ప్రసంగమే రాజకీయాల్లోకి మళ్లించింది వాజ్‌పేయి జిల్లాకు వచ్చిన మొదటిసారి మా నాన్న పూడి మల్లేశ్వరరావుతో కలిసి 1983లో కోటబొమ్మాళిలో ప్రచార సభకు హాజరయ్యాను. ఆ సభలో ప్రసంగం విన్నాక ఆయన అభిమానిని అయ్యాను. విద్యార్థిగా ఉన్నప్పటికీ పార్టీలో చేరాలన్న ఆశ కలిగింది. విద్యార్థి నాయకుడిగా పార్టీలో చేరా. ఆయన ప్రధానమంత్రి అయ్యాక భారతదేశంలో నేషనల్ హైవే రోడ్లు వేసేందుకు ‘వెలిగిపోతోంది భారత్’ అనే నినాదం చేపట్టారు. రహదారులు వేయడంతో ఇతర దేశాల నుంచి ప్రాంతాల నుంచి వ్యాపారాలు పుంజుకుని దేశ ఆర్ధిక అభివృద్దికి దోహదపడ్డాయి. – పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకుడు వాజ్‌పేయి మరణం తీరని లోటు స్వచ్ఛమైన రాజకీయాలతో దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం రాజకీయలోకానికి తీరని లోటు. 1983లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గంగా ఉన్నపుడు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశా. నా గెలుపు కోసం కోటబొమ్మాళిలో బహిరంగ సభ నిర్వహించారు. అప్పట్లో ఆ సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో పలు చోట్ల స్వర్ణ త్రిభుజాకార రహదారులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి వాజ్‌పేయీ ఎనలేని కృషి చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలకు చిరునామాగా ఉన్న ఆయన మరణం రాజకీయ లోకానికి తీరని లోటు. – సంపతిరావు రాఘవరావు, మాజీ ఎంపీపీ, టెక్కలి -
నందమూరి జానకిరామ్‌కు ప్రముఖుల నివాళి
-
కాళోజీకి ఘన నివాళి
తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జేసీ శర్మన్ తదితరులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన రచనలు ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుచేసుకున్నారు. మహబూబ్‌నగర్ కల్చరల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ను తెలంగాణ రాష్ట్ర తొలికవిగా గుర్తించాలని కలెక్టర్ జీడీ ప్రియద ర్శిని కోరారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కాళోజీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వ హించిన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నిరంతర పోరాటం చేసిన కాళోజీ నిత్య చైతన్యశీలి అని కొనియాడారు. ఆయన ప్రాధాన్యతను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సరసన చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళోజీ తెలంగాణ యాస, భాష, రచనలు, మాటలు ప్రభావితం చేశాయని అన్నారు. ప్రధానవక్తగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య ఎస్వీ రామారావు మాట్లాడుతూ.. కాళోజీ మాటల్లో కల్తీ ఉండదని మహాకవి దాశరథి కితాబునిచ్చారని గుర్తు చేశారు. ఆయన రాసిన మొదటి రచనను 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సమ్మేళనంలో భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆవిష్కరించడం జాతికే గర్వకారణమని అన్నారు. కాళోజీ జీవన గమనాన్ని, కవిత్వాన్ని విడదీయలేమని, ఆయన చెప్పదలుచుకున్న అంశాలను, సందేశాలను కరపత్రాలు, కవితలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరవేశారని గుర్తుచేశారు. ఆంగ్లేయులు, నైజాం నవాబుల పాలనతో పాటు ఆంధ్రాపాలకుల వివక్షను ఎండగట్టి పలుమార్లు జైలుకు వెళ్లారని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ.. నవ తెలంగాణను చూడడానికే కాళోజీ తన కళ్లను దానం చేశారని, ఆయన ఇక్కడ లేకున్నా చూడగలుగుతున్నారని అన్నారు. పీయూ వీసీ భాగ్య నారాయణ, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, మునిసిపల్ చైర్పర్సన్ రాధా అమర్ కాళోజీ సేవలను కొనియాడారు. కాగా ఈ సందర్భంగా నూతన రాష్ట్రంలో తెలుగు విశ్వ విద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అవార్డును పొందిన జిల్లా సాహితీభీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తిని నగదు పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్ రావు, జిల్లా సాంస్కృతిక మండలి ప్రతినిధులు, కవులు పాల్గొన్నారు.