Greater Corporation
-
షాపింగ్ తంటా : ప్రముఖ షోరూం మూత
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో గత ఏడు నెలలుగా ఇంటికి పరిమితమైన ప్రజలు షాపింగ్ కోసం భారీ సంఖ్యలో షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే చెన్నైలోని ఒక దిగ్గజ బట్టల దుకాణానికి షాక్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్ను మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) మూసివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) షోరూమ్ లోపల, వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్‌లు ధరించకుండా వందలాది మంది జనం గుమిగూడిన నేపథ్యంలో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించమని, వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘనలు ప్రతి దుకాణంలో జరుగుతున్నాయి... ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. Kumaran Silks in Chennai sealed after video of crowding and lack of physical distancing emerges. @chennaicorp @thenewsminute pic.twitter.com/qIM9HyUxSv — priyankathirumurthy (@priyankathiru) October 20, 2020 A shop in Tnagar has been #locked and #sealed today, since they allowed overcrowding & didn’t follow the COVID-19 safety protocols. Other such shops, which don’t follow the protocols shall be sealed too. Shop owners & public are requested to strictly follow safety protocols.#GCC pic.twitter.com/MncKIWxfIG — Greater Chennai Corporation (@chennaicorp) October 20, 2020 -
‘గ్రేటర్’ ఆశాభంగం
సాక్షి, అమరావతి: నగరాల రూపురేఖల్ని మార్చేస్తున్నాం.. పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి, మున్సిపల్‌శాఖ మంత్రి తెగ ఊదరగొట్టారు. మాటల గారడీలతో ప్రజలను మాయచేశారు. రోడ్ల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కులు, కాల్వ గట్టుల సుందరీకరణ, రివర్ ఫ్రంట్ టూరిజం.. అంటూ ఆయా నగరాలు, పట్టణాల ప్రజలను మబ్బుల్లో విహరింపజేశారు. ఇంకేముంది.. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు పచ్చ మీడియాకు లీకులిచ్చి మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోందంటూ ప్రచారం చేశారు. ఇవి కాకుండా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి, మున్సిపాల్టీల సంఖ్య పెంపు, 80 నగర పంచాయతీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. నిధులు అందుబాటులో లేకున్నా.. ఆచరణ సాధ్యంకాని ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేయించి అ«ధికారుల విలువైన కాలాన్ని హరించారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి పట్టణాలు, నగరాలు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్య పెంచినా నిధులు విడుదల చేయకపోవడంతో అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. ఉత్తుత్తి ప్రకటనలే.. విజయవాడ నగరపాలక సంస్థను గ్రేటర్‌గా రూపాంతరం చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 53 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేయించారు. కొన్ని పంచాయతీలు ఈ విలీనాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన కొంతకాలం బుట్టదాఖలైంది. ఈ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిశాక మళ్లీ గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చివరకు ఆ ప్రతిపాదనా కార్యరూపం దాల్చకుండానే సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి. మున్సిపల్ ఓటర్ల జాబితా తయారీ నేపథ్యంలో 2022 వరకు గ్రేటర్ ఆవిర్భావానికి సంబంధించి పంచాయతీల విలీనాన్ని పక్కన పెట్టాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి గ్రేటర్ విజయవాడకు మంగళం పలికింది. అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థలో చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, శ్రీకాళహస్తి మండలాల్లోని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ తిరుపతి చేస్తామని చేసిన ప్రకటనా కార్యరూపం దాల్చలేదు. అలాగే రాజధాని పరిధిలోని 29 గ్రామాలతోపాటు తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం, పెదపరిమి, వడ్డమాను గ్రామాలతో పాటు.. పరిసర మండలాలను కలిపి మెగా కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని గ్రామాల్లో లక్ష మంది జనాభానే ఉండటంతో పరిసర మండలాలు, మున్సిపాల్టీలను కలిపి కనీసం ఐదు లక్షల జనాభాకు తగ్గకుండా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. ఇక గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో పట్టణీకరణ వైపు ప్రభుత్వం పరుగులు తీస్తోందని ప్రచారం చేశారు. మేజరు పంచాయతీల పక్కనే ఉన్న రెండు మూడు గ్రామ పంచాయతీలను కలిపి ఒక నగర పంచాయతీగా మార్పు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. దాదాపు 80 నగర పంచాయతీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటి మీద రాతలా రివర్ ఫ్రంట్ టూరిజం ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ నుంచి కనకదుర్గ వారధి వరకు వరద నీటిని నిల్వ చేసి రివర్ ఫ్రంట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. కృష్ణానది కరకట్టలను ఇరువైపులా అభివృద్ధి చేసి, నదిలో బోట్ షికారు, ఇతర క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. విజయవాడ, తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు నగరాల్లో ఔటర్ రింగ్‌రోడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. రాజధానిలోని గ్రామాలను కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు, తిరుపతిలో అలిపిరి నుంచి చంద్రగిరి, వడమాలపేట, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతిలను కలుపుతూ రింగ్‌రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. నెల్లూరులో మున్సిపల్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసిన విధంగానే.. గ్రేటర్ విశాఖ పర్యవేక్షణలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. -
మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్ బదిలీ
=విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియూమకం =నూతన సబ్ కలెక్టర్‌గా నారాయణ్‌భరత్‌గుప్తా మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె సబ్ కలెక్టర్ చెవ్వూరి హరికిరణ్ బదిలీ అయ్యూరు. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాదిన్నరకుపైగా ఆయన ఇక్కడ పని చేసి మన్ననలు పొందారు. ఖమ్మం జిల్లా భద్రచలం సబ్ కలెక్టర్‌గా పని చేస్తూ 2012, ఏప్రిల్ 24వ తేదీన ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మదనపల్లె డివిజ న్ లో చురుగ్గా పనిచేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని పీలేరులో సైనిక పాఠశాల, జే ఎన్టీయూ అనుబం ధ కళాశాల, సీఆర్ఫీఎఫ్ శిక్షణ కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం మంజూరుతో పాటు పలు అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. బదిలీ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ అతిపెద్ద డివి జన్‌లో సబ్ కలెక్టర్‌గా పనిచేసినందుకు ఎంతో సంతోషకంగా ఉందన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్‌గా నారాయణభరత్‌గుప్తా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ఖమ్మం జిల్లా భద్రచలం సబ్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా నియమితులయ్యూరు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల నుంచి పలుమార్లు దీనిపై విచారణ జరిగినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో ఈ కేసును ఇటీవల సీబీసీఐడీకి అప్పగించింది. దృష్టి సారించిన సీబీసీఐడీ మూడు రోజుల క్రితమే విజిలెన్స్ అధికారులు డీఈవో కార్యాలయానికి వచ్చి ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విజిలెన్స్ అధికారులకు 42 మంది ఉపాధ్యాయులు ఇంత వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. వీటిని వెంటనే పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తాజాగా సీబీసీఐడీ అధికారులూ దీనిపై దృష్టి సారించారు. జిల్లా విద్యాశాఖ ఐదారు నెలల క్రితం పక్క రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను పరిశీలించి నివేదిక అందజేయాలని ముగ్గురు సీనియర్ ప్రధానోపాధ్యాయులను, ఒక డివిజన్ ఉప విద్యాశాఖాధికారిని విచారణ కోసం నియమిం చింది. పలుమార్లు సర్టిఫికెట్లు పరిశీలించిన వీరు ఇంత వరకు నివేదికను డీఈవోకు అందజేయలేదు. కొన్ని రోజుల క్రితం ఈ కేసు గురించి సీబీసీఐడీ అధికారులు ఆరా తీసి, నివేదికను త్వరగా పంపించాల్సిందగా విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఇలావుండగా పదోన్నతి కౌన్సిలింగ్ సమయంలో దొంగ సర్టిఫికెట్ల విషయం కొందరు విద్యాశాఖ అధికారులకు తెలుసని, అయితే వారు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఈ విషయాలు బయటపడుతాయని కొన్ని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు.