మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్ బదిలీ | MADANAPALLE sub-collector transfer harikiran | Sakshi
Sakshi News home page

మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్ బదిలీ

Published Fri, Oct 25 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

MADANAPALLE sub-collector transfer harikiran

 

=విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్  కమిషనర్‌గా నియూమకం
 =నూతన సబ్ కలెక్టర్‌గా నారాయణ్‌భరత్‌గుప్తా

 
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె సబ్ కలెక్టర్ చెవ్వూరి హరికిరణ్ బదిలీ అయ్యూరు. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాదిన్నరకుపైగా ఆయన ఇక్కడ పని చేసి మన్ననలు పొందారు. ఖమ్మం జిల్లా భద్రచలం సబ్ కలెక్టర్‌గా పని చేస్తూ 2012, ఏప్రిల్ 24వ తేదీన ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు.

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మదనపల్లె డివిజ న్ లో చురుగ్గా పనిచేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని పీలేరులో సైనిక పాఠశాల, జే ఎన్‌టీయూ అనుబం ధ కళాశాల, సీఆర్‌ఫీఎఫ్ శిక్షణ కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం మంజూరుతో పాటు పలు అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. బదిలీ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ అతిపెద్ద డివి జన్‌లో సబ్ కలెక్టర్‌గా పనిచేసినందుకు ఎంతో సంతోషకంగా ఉందన్నారు.  
 
 మదనపల్లె సబ్ కలెక్టర్‌గా నారాయణభరత్‌గుప్తా


 మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ఖమ్మం జిల్లా భద్రచలం సబ్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా నియమితులయ్యూరు.  ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల నుంచి పలుమార్లు దీనిపై విచారణ జరిగినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో ఈ కేసును ఇటీవల సీబీసీఐడీకి అప్పగించింది.

 దృష్టి సారించిన సీబీసీఐడీ

 మూడు రోజుల క్రితమే విజిలెన్స్ అధికారులు డీఈవో కార్యాలయానికి వచ్చి ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విజిలెన్స్ అధికారులకు 42 మంది ఉపాధ్యాయులు ఇంత వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. వీటిని వెంటనే పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తాజాగా సీబీసీఐడీ అధికారులూ దీనిపై దృష్టి సారించారు. జిల్లా విద్యాశాఖ ఐదారు నెలల క్రితం పక్క రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను పరిశీలించి నివేదిక అందజేయాలని ముగ్గురు సీనియర్ ప్రధానోపాధ్యాయులను, ఒక డివిజన్ ఉప విద్యాశాఖాధికారిని విచారణ కోసం నియమిం చింది.

పలుమార్లు సర్టిఫికెట్లు పరిశీలించిన వీరు ఇంత వరకు నివేదికను డీఈవోకు అందజేయలేదు. కొన్ని రోజుల క్రితం ఈ కేసు గురించి సీబీసీఐడీ అధికారులు ఆరా తీసి, నివేదికను త్వరగా పంపించాల్సిందగా విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఇలావుండగా పదోన్నతి కౌన్సిలింగ్ సమయంలో దొంగ సర్టిఫికెట్ల విషయం కొందరు విద్యాశాఖ అధికారులకు తెలుసని, అయితే వారు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఈ విషయాలు బయటపడుతాయని కొన్ని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement