Green City
-
సిటీ.. గో గ్రీన్
హరితభవనాలుగా నివాస, వాణిజ్య, కార్యాలయాలుస్వచ్ఛమైన గాలి.. ఫుల్ వెంటిలేషన్.. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఇలా ప్రకృతితో కలిసి జీవించడం అంటే కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో కష్టమే. స్థలాభావం, నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం ఇలా కారణాలనేకం. కానీ కరోనా తర్వాత నివాసితుల అభిరుచి మారింది. ఇళ్లు, ఆఫీసు, షాపింగ్‌మాల్,మెట్రోరైల్.. ఇలా ఒకటేమిటి ప్రతీది హరితంగానే ఉండాలని కోరుకుంటున్నారు. సాక్షి హైదరాబాద్హరిత భవనాల్లో ఏముంటాయంటే..సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌తో 20–30 శాతం విద్యుత్, 30–40 శాతం నీరు ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. జీవవైవిధ్యం, సహజ వనరుల పరిరక్షణతో మెరుగైన గాలి నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు. ల్యాండ్ స్కేపింగ్, వరి్టకల్ గార్డెనింగ్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, ఎస్టీపీ, రూఫ్‌టాప్ సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి.షేక్‌పేట, కోకాపేట, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శామీర్‌పేట, పటాన్చెరు ఇలా నగరం నలువైపులా ఈ హరిత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ ధరలు విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.4,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణాలు 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటున్నాయి.హైదరాబాద్‌లో 890 ప్రాజెక్టులు2001లో దేశంలో 20 వేల చదరపు అడుగుల్లో (చ.అ.)కేవలం ఒక్కటంటే ఒక్కటే హరిత భవనం ఉండగా, ప్రస్తుతం 1,175 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 13,722 భవనాలు ఉన్నాయి. ఇందులో 120కు పైగా నెట్‌జీరో బిల్డింగ్లే ఉన్నాయి. హైదరా బాద్‌లో 114 కోట్ల చ.అ.ల్లో 890 ప్రాజెక్టుల పరిధిలో హరిత భవనాలుండగా, ఇందులో నివాస, వాణిజ్య భవనాలే కాదు స్కూళ్లు, ఫ్యాక్టరీలూ ఉన్నాయి. అపర్ణాసరోవర్, రెయిన్బో విస్టాస్, మైహోమ్ అవతార్, బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్ సైబర్ కాలనీ, రహేజా విస్టాస్‌లు గ్రీన్ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి.తొలిముద్ర నగరానిదే..⇒ హరిత భవనాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేకస్థానం. గృహాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, రైలు, మెట్రోస్టేషన్లు, ఫ్యాక్టరీలు, ఐటీ టవర్లు, విద్యాసంస్థలు ఇలా 31 విభాగాలలో హరిత భవనాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రేటింగ్ ఇస్తుంది. వీటిల్లో తొలి రేటింగ్ పొందిన భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్గాగుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరితభవనంగా గచి్చ»ౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ⇒ ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెరి్మనల్గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. ⇒ తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా, కొత్తగా నిర్మించిన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం కూడా ఐజీబీసీ రేటింగ్స్ అందుకున్నాయి.రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా.. హరిత భవనాలను ప్రోత్సహించేందుకు దేశంలో 11 రాష్ట్రాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పరి్మట్ ఫీజులో 20 శాతం, స్టాంప్ డ్యూటీ సర్చార్జ్లో 20 శాతం తగ్గుదల ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. సిడ్బీ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది. ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు, ఐటీ టవర్లు, రైలు, మెట్రోస్టేషన్లు ఇలా 31 విభాగాల్లో తొలి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో హరితభవనాలకు ప్రభుత్వం నుంచి రాయితీ, ప్రోత్సాహకాలు లేవు.తెలంగాణలో ఐజీబీసీ ప్రాజెక్టులలో కొన్ని..⇒ దుర్గంచెరు, పంజగుట్ట, ఎల్బీనగర్ సహా 17 మెట్రోస్టేషన్లు ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రైల్వే నిలయం ⇒ కాచిగూడ రైల్వేస్టేషన్ ⇒ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ గ్రీన్ విలేజ్ ⇒ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ⇒ సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లు ⇒ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట) ⇒ ఇనార్బిట్ మాల్, నెక్సస్ షాపింగ్‌మాల్⇒ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జేయూఎన్టీయూహెచ్ (సుల్తాన్పూర్) ⇒ క్యాప్‌జెమినీ కార్యాలయం ⇒ హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ (తూంకూరు) ⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంగ్రీన్ బిల్డింగ్స్ ఉద్యమంలా చేపట్టాలి ఏ తరహా నిర్మాణాలైనా సరే హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ బిల్డింగ్స్‌ను బిల్డర్లు ఉద్యమంలా నిర్మించాలి. హరిత భవనాల గురించి నగరంతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలకు అవగాహన కలి్పంచేలా పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలి. - శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడుహరిత భవనాలను కోరుకుంటున్నారు హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటికి రాగానే చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుండటంతో గ్రీన్ బిల్డింగ్స్‌లను కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. - ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ఎండీ -
నెల్లూరును గ్రీన్‌సిటీగా అభివృద్ధి చేస్తా
నెల్లూరు (స్టౌన్హౌస్ పేట): సీఎం వైఎస్ జగన్ సహకారంతో వచ్చే ఐదేళ్లలో నెల్లూరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతానని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరు మాదిరిగా నెల్లూరును కూడా గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు 14వ డివిజన్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరును ఒక శాస్త్రీయ విధానంలో అభివృద్ధి చేస్తానన్నారు. నెల్లూరులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసిన తనకు ఈ గడ్డకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశవిుచ్చిన నగర ప్రజలకు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాజ్యసభ సభ్యుడిగా పదేళ్లు రాష్ట్రాభివృది్ధకి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ కృషితో 14వ డివిజన్లో బ్రాహ్మణుల కర్మకృతుల భవనం పూర్తయిందన్నారు. అలాగే పద్మావతినగర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తి కావస్తోందని తెలిపారు. నెల్లూరు నగరం, గ్రామీణం పరిధిలో అనేక పార్కులు అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. వ్యాపార వర్గాల్లో అభద్రతా భావం కలిగించే విధంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని విశ్వసించవద్దన్నారు. ఎంపీ అభ్యర్థిగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్ అహ్మద్‌కు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బాబు పాలనంతా కరువు కాటకాలే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలంతా కరువుకాటకాలతో, ఆకలితో అలమటించి పోయారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. గతం కన్నా ఎక్కువ మెజారిటీతో వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టేందుకు, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాకతో నెల్లూరు ప్రజల్లో, పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా పచ్చదనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనం పెంచుతున్నామని, భవన నిర్మాణాలకు అనుమతుల సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ తెలిపారు. లేఅవుట్లకు అనుమతిచ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్‌జోన్‌ను అభివృద్ధి చేసిన తరువాతే తుది అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో గ్రీన్ సిటీపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏఐపీహెచ్ గ్రీన్ సిటీ కమిటీ ప్రతినిధి బిల్ హార్డీ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక గ్రీన్‌సిటీ అవార్డు లభించడం వెనుక ఉన్న కృషిని అరవింద్ వివరించారు. హైదరాబాద్ నగరంలో 150 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ 16 అటవీ ప్రాంతాల్లో అర్బన్ఫారెస్టు పార్కులు అభివృద్ధి చేసి పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మహానగరం చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డులో పచ్చదనం పెంపొందించి గ్రీన్ జోన్‌గా మార్చామని తెలిపారు. ఫార్ములా ఈ ట్రాక్ నిర్మాణంలో కోల్పోతున్న చెట్లను పూర్తిగా మరో చోటుకు తరలించి ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నట్లు అరవింద్‌కుమార్ వివరించారు. ప్రతియేటా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
పట్టణాలకు పచ్చందం
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పచ్చదనం పెంపు, సుందరీకరణకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మొక్కలు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రజల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల ఎంపిక చేసిన మున్సిపల్ కమిషనర్లతో గ్రీన్ సిటీ చాలెంజ్ పేరుతో సచివాలయంలో నాలుగు రోజులపాటు వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. పట్టణాల్లో పచ్చదనం పెంపునకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. గ్రేడ్–1 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం 45 యూఎల్బీలను ఎంపిక చేశారు. ఈ వర్షాకాలంలో ఆ పట్టణాలు, నగరాల్లో సుమారు రూ.78.84 కోట్లతో కార్యక్రమాలు చేపడతారు. జూన్ 7 నాటికి అన్ని పనులకు స్థానిక సంస్థలు అనుమతులు మంజూరు చేసి, జూన్ 11 నాటికి టెండర్లు పిలవాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు ఆగస్టు 12 నాటికి ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కూడా పచ్చదనానికి అనుసరించాల్సిన ప్రణాళికలను ప్రభుత్వానికి అందించింది. వివిధ పథకాల్లో గ్రీనింగ్ ప్రోగ్రామ్ రాష్ట్రంలోని యూఎల్బీల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పార్కులు, మిషన్ కాంపోనెంట్ కింద గ్రీన్ స్పేస్‌ల అభివృద్ధితో పాటు కౌన్సిళ్ల అనుమతితో అవసరమైన మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టులను అమలు చేస్తారు. స్థానిక పట్టణ సంస్థల అభ్యర్థన మేరకు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. నిర్మాణ పనులు సైతం పర్యవేక్షిస్తుంది. పట్టణాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు, రోడ్డు మధ్యన గల మీడియేషన్ పాయింట్లలో అందాన్నిచ్చే మొక్కలను పెంచుతారు. మొదటి దశలో ఎంపిక చేసిన యూఎల్బీల్లో గ్రీనింగ్, వాల్ పెయింటింగ్ కోసం రూ.78.84 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇందులో జనరల్ ఫండ్ రూ.45,26,39,000, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.25,84,19,000, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద మరో రూ.7,73,51,000 ఖర్చు చేస్తారు. తొలి దశలో ఎంపిక చేసిన యూఎల్బీలు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, జీవీఎంసీ, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నర్సాపూర్, తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, మచిలీపట్నం, గుడివాడ, వైఎస్సార్ తాడిగడప, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నర్సారావుపేట, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు–ఎన్, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, రాయచోటి, మదనపల్లి, కదిరి, ధర్మవరం, హిందూపురం, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు తొలి దశలో ఉన్నాయి. కార్పొరేషన్ స్థాయి గల జీవీఎంసీ అత్యధికంగా రూ.8.19 కోట్లు, విజయవాడ, గుంటూరు రూ.7 కోట్లు చొప్పున, ఒంగోలు, రాజమండ్రి కార్పొరేషన్లు రూ.5.50 కోట్లు చొప్పున, కర్నూలు రూ.4 కోట్లు వెచ్చించనున్నాయి. -
కోటి వాహనాల ఐటీ సిటీ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం. ఫలితంగా రోడ్లు చాలక మొత్తం నగరవాసులు ఇబ్బందులను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.30 కోట్లుగా ఉంది. వాహనాల సంఖ్య కూడా సుమారు కోటికి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం బైకులు, కార్లు, బస్సులు, ఇతరత్రా రవాణా వాహనాల సంఖ్య 1,03,21,000గా ఉంది. కిక్కిరిసిన వాహనాల ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఎగబాకుతోంది. 68 లక్షల బైక్‌లు, 21 లక్షల కార్లు 2022, మే వరకు రాజధానిలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య చూస్తే 68,72,763 బైకులు, 21,74,830 కార్లు, 1,15,000 ట్రక్కులు, లారీలు, 3,50,000 ట్యాక్సీ, ఆటోలు, 8,08,990, ఇతర వాహనాలు ఇలా మొత్తంగా 1,03,21,583 వాహనాలు బెంగళూరు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత వాహన ఒత్తిడిని తట్టుకోలేని రోడ్లు తరచూ నాశనమవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ రద్దీ జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కిలోమీటరు దూరంలోని గమ్యం చేరడానికి పీక్ అవర్స్‌లో రెండు మూడు గంటలు పడుతోంది. చాలీచాలని రహదారులు బీబీఎంపీ పరిధిలో మొత్తం 1,1940 కిలోమీటర్ల పొడవునా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు 60 లక్షల వాహనాలను మాత్రం భరించగలవు. కానీ కోటికి పైగా వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతింటోంది. మరోవైపు నగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ను అమలు చేయాలని, పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లవారికే కారు కొనుగోలు నిబంధన ఉండాలని డిమాండ్లు ఉన్నాయి. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
రేపు ‘హరిత కడప’కు శ్రీకారం
కడప కార్పొరేషన్: కడపను హరిత నగరం (గ్రీన్‌సిటీ)గా మార్చేందుకు నగరపాలక సంస్థ ఈనెల 24నుంచి 30వ తేదీవరకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మద్దిమడుగు సోషల్ ఫారెస్ట్రీ వారు వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు నగర మేయర్ కె.సురేష్‌బాబు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలతో డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ కూడా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.‘ఈచ్ ఒన్ ప్లాంట్ ఒన్’(ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి) అనే నినాదంతో నగరంలోని 50 డివిజన్లలో ఒక్కో డివిజన్లో 2000ల మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించి అయా డివిజన్ల కార్పొరేటర్లకు, అన్ని విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో మొక్కలను విరివిగా నాటనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి జిల్లా కలెక్టర్ కేవీ రమణ, మేయర్ సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా పాల్గొననున్నారు. నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు కార్పొరేషన్‌ను సంప్రదిస్తే వారికి ఉచితంగా మొక్కలు అందిస్తామని తెలిపారు. -
గ్రీన్ సిటికి ట్రాఫిక్ సమస్యలు