green snake
-
వైరల్: చావోరేవో అన్నట్లు.. గట్టిగా అరుస్తూ హంగామా
బుల్లి హమ్మింగ్ బర్డ్ పాముకు సమఉజ్జీ కానేకాదు.. కానీ.. గుండె ధైర్యం ఎక్కువలాగుంది.. అందుకే తన గూటి జోలికి.. అందులో ఉన్న పిల్లల జోలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ గ్రీన్ పిట్ వైపర్‌కు ఎదురెళ్లింది.. చావోరేవో అన్నట్లు తెగించింది.. గట్టిగా అరుస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ హంగామా చేసింది.. ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది.. ఏమనుకుందో ఏమో.. చివరికి ఈ పాము వెనక్కి తగ్గింది. పిట్టదే పైచేయి అయింది.. ఈ చిత్రాన్ని బెన్స్మేట్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇది మనకు తెలిసిందేగా.. అయితే.. ఇక్కడ విడవలేదు.. అలాగని కరవనూలేదు.. ఇదో చాలా చిత్రమైన పరిస్థితి. ఫొటో చూస్తున్నారుగా.. తనను కరవడానికి వచ్చిన పాము గొంతును ఈ కప్ప ఎలా పట్టుకుందో.. ఈ ట్రీ స్నేక్ కప్పను అమాంతం మింగేద్దామని వచ్చినా.. అది తెలివిగా పక్కకు తప్పుకోవడంతో ఈ మాత్రమే నోటికి చిక్కింది. దీంతో కప్ప విజృంభించేసింది.. పట్టు బిగించింది.. ఇలా ఇవి కొన్ని గంటలపాటు ఉండిపోయాయట. అలా ఉండిఉండి నీరసించి.. చివరికి దేనిదారిన అవి వెళ్లిపోయాయట. ఈ చిత్రాన్ని బెలీజ్ దేశ అడవుల్లో డేవిడ్ మైట్‌ల్యాండ్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చదవండి: ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి! -
షటప్..కొంగ బావా..
అమెరికాలోని ఫ్లోరిడా.. ఎవర్గ్లేడ్స్ జాతీయ పార్కు..మధ్యాహ్నం సమయం.. కొంగ బావ కడుపు మాడిపోతోంది.. ఒంటికాలిపై జపం చేసినా.. చేపలేమో చిక్కలేదాయో..మరేం చేయాలి అని ఆలోచనలో పడింది.. ఇంతలో అటుగా పోతున్న పచ్చ పాము కంటపడింది. ఎలాగూ నాన్వెజ్జే కదా.. ఏదైతే ఏమిటి అనుకుంది.. పామును అమాంతం మింగేద్దామని ప్లానేసింది.. ప్రయత్నమూ చేసింది. దీంతో పాముకేమో చిర్రెత్తుకొచ్చింది.. ఇద్దరి మధ్యా ఓ 20 నిమిషాలు భీకరమైన యుద్ధం నడిచింది. సడన్‌గా పాముకు లైటు వెలిగింది.. తనను మింగేద్దామనుకున్న కొంగ బావ మూతికే తాళమేసేస్తే.. అని అనుకుంది. వెంటనే.. మూతినిలా చుట్టుకుని.. సర్పబంధనం చేసేసింది.. అంతే.. కొంగ బావకు పరిస్థితి అర్థమైంది. తెల్ల జెండా ఎగరేసింది.. నోటికి బదులు కాళ్లకు పనిచెప్పింది.. ► ఈ ఆసక్తికర దృశ్యాన్ని అమెరికాకు చెందిన జోస్ గార్షియా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. 2017 బర్డ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీకి వచ్చిన ఎంట్రీల్లో మెచ్చదగిన చిత్రాలను తాజాగా విడుదల చేశారు. అందులో ఈ ఫొటోకూడా ఒకటి. -
పార్సిల్లో పామొచ్చింది
నగరంలోని శివానంద సర్కిలో ఉన్న బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలో పునీత్ రాజ్‌కుమార్ (పేరు మార్చాం) ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఆయన తన ఆఫీసులోనే పని చేస్తున్న ప్రియమణి (పేరు మార్చాం)తో కలిసి ఒకే ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నారు. ప్రియమణితో రాజ్‌కుమార్ మరీ సన్నిహితంగా ఉంటున్నారని ఆకాశరామన్నకు తెలిసింది. ఆ ఆకాశరామన్న నుంచి వారం క్రితం రాజ్‌కుమార్‌కు ఓ అందమైన పార్సిల్ వచ్చింది. డబ్బాలాగా ఉన్న ఆ పార్సిల్‌ను అందుకున్న రాజ్‌కుమార్ కచ్చితంగా అది తన శ్రేయోభిలాషుల నుంచే వచ్చి ఉంటుందని, అందులో ఏవో స్వీట్లు లేదా తినుబండారాలు ఉండొచ్చని భావించారు. మధ్యాహ్నం లంచ్ సమయం వరకు ఆ పార్సిల్‌ను తెరవకుండా అలాగే భద్రంగా దాచారు. లంచ్‌కు క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు దాన్ని తన టేబుల్ ముందు పెట్టుకొని తెరిచారు. అంతే... ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీలయ్యారు. తిను బండారాల మాట దేవుడెరుగు ఆ బాక్సులో అత్యంత విషపూరితమైన ఆకుపచ్చ పాము కనిపించింది. వెంటనే దాన్ని మూసివేశారు. రాజ్‌కుమార్ ఈ విషయాన్ని తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు ఆ పామును తీసుకెళ్లి దూరంగా చెట్లలో వదిలేశారు. అప్పుడు అందులో నుంచి ఓ లేఖ కూడా బయట పడింది. అందులో 'నీవు ప్రియమణితో అతి చనువుగా ఉంటున్నావు. అది నీకు, నాకు మంచిది కాదు. ఆమెకు దూరంగా ఉండకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అనే హెచ్చరిక ఉంది. రాజ్‌కుమార్ సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పార్సిల్ డెలివరీ చేసిన కొరియర్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా పార్సిల్ పంపిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ నకిలీదని తేలింది. మళ్లీ రాజ్‌కుమార్‌ను పిలిపించి విచారించగా, తనకు ఎవరూ శత్రువులు లేరని, పైగా తాను ప్రియమణితో చనువుగా ఉండడం లేదని తెలిపారు. ప్రియమణిని విచారించినా వారికి ఇదే సమాధానం వచ్చింది. దాంతో పోలీసుల అనుమానం ప్రియమణి భర్త అనంతనాగ్ (పేరు మార్చాం) మీదకు మళ్లింది. ఆయన్ని విచారించగా, తనకు అసలు సదరు రాజ్‌కుమార్ గురించే తెలియదని సమాధానం వచ్చింది. కచ్చితంగా ఇదంతా రాజ్‌కుమార్ పట్ల ఈర్ష్యతో ఆఫీసులోపలి సిబ్బందే చేసి ఉండాలని, ఆ ఆకాశరామన్న ఎవరో కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నామని బెంగళూరు సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అంత్యంత విషపూరితమైన ఆ ఆకుపచ్చ పాము కాటుకు గురికాకపోవడం రాజ్‌కుమార్ అదృష్టమని, ఈ కేసులో సంతృప్తినిచ్చే విషయం ప్రస్తుతానికి ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.