షటప్‌..కొంగ బావా.. | Snake locked the heron's mouth | Sakshi
Sakshi News home page

షటప్‌..కొంగ బావా..

Published Tue, Aug 22 2017 2:43 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

షటప్‌..కొంగ బావా.. - Sakshi

షటప్‌..కొంగ బావా..

అమెరికాలోని ఫ్లోరిడా.. ఎవర్‌గ్లేడ్స్‌ జాతీయ పార్కు..మధ్యాహ్నం సమయం.. కొంగ బావ కడుపు మాడిపోతోంది.. ఒంటికాలిపై జపం చేసినా.. చేపలేమో చిక్కలేదాయో..మరేం చేయాలి అని ఆలోచనలో పడింది.. ఇంతలో అటుగా పోతున్న పచ్చ పాము కంటపడింది.  ఎలాగూ నాన్‌వెజ్జే కదా.. ఏదైతే ఏమిటి అనుకుంది.. పామును అమాంతం మింగేద్దామని ప్లానేసింది.. ప్రయత్నమూ చేసింది. దీంతో పాముకేమో చిర్రెత్తుకొచ్చింది.. ఇద్దరి మధ్యా ఓ 20 నిమిషాలు భీకరమైన యుద్ధం నడిచింది. సడన్‌గా పాముకు లైటు వెలిగింది.. తనను మింగేద్దామనుకున్న కొంగ బావ మూతికే తాళమేసేస్తే.. అని అనుకుంది. వెంటనే.. మూతినిలా చుట్టుకుని.. సర్పబంధనం చేసేసింది.. అంతే.. కొంగ బావకు పరిస్థితి అర్థమైంది. తెల్ల జెండా ఎగరేసింది.. నోటికి బదులు కాళ్లకు పనిచెప్పింది..
 
► ఈ ఆసక్తికర దృశ్యాన్ని అమెరికాకు చెందిన జోస్‌ గార్షియా అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. 2017 బర్డ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పోటీకి వచ్చిన ఎంట్రీల్లో మెచ్చదగిన చిత్రాలను తాజాగా విడుదల చేశారు. అందులో ఈ ఫొటోకూడా ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement