పెసర రైతును ముంచిన వాన
న్యాల్కల్: ఆరు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పెసర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రతిఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. అతివృష్టి, అనావృష్టి ఫలితాలతో పంటలు దెబ్బతింటున్నాయి. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు జాడ లేకపోవడం, తీరా పంట చేతి వచ్చే సమయంలో ఏకధాటిగా వానలు కురవడం వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం పెట్టుబడులకు కూడా సరిపోవడం లేదు.
మండలంలో ప్రస్తుతం పెసర పంట చేతి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా కురవరడంతో రైతులు విత్తనాలను కూడా ఆలస్యంగా వేశారు. పం టలు వేసుకునే సమయం మించి పోవడంతో పంటలు అవుతాయో లేదోననే సందేహంతో రైతులు కొన్ని రకాల పంటలను తక్కువ విస్తీర్ణంలో విత్తుకున్నారు. మండలంలో ఖరీఫ్‌లో 13వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అధికంగా పత్తి పంటను సాగు చేసుకోగా మిగతాది పెసర, మినుము, సోయా, జొన్న తదితర పంటలను సాగు చేసుకున్నారు.
పెరస పంట సాధారణ సాగు విస్తీర్ణం 4వే ల హెక్టార్లు కాగా వర్షాభావ పరిస్థితుల కా రణంగా మండలంలో ఈ సారి 1,850 హెక్టార్లలో మాత్రమే సాగు చేసుకున్నారు. ప్రస్తుతం చేతికి వచ్చిన పెసర పంటను రాసులు చేసుకుం దామనుకుంటే ఆరు రోజులుగా నిత్యం వర్షం పడుతుండడంతో పంట దెబ్బతిం టోంది. ఎంతో కొంత ఏరిన పంట కూడా వర్షానికి తడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెసర పంటకు మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.6వేల పైచిలుకు ఉండడంతో రైతులు పంటపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీడని వ ర్షం రైతుల పాలిట శాపంగా మారింది. వరు ణుడు శాంతించాలని వీరు కోరుతున్నారు.