greetings to people
-
రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం... రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
-
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటున్నామని సీఎం జగన్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయం తిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి.. తెలంగాణ సాం స్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు తెలంగాణ సాహితీవేత్తలు కృషిని కొనసాగించాలని కోరారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటోందని కేసీఆర్ చెప్పారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి, రచయిత పెన్నా శివరామకృష్ణకు సీఎం అభినందనలు తెలిపారు. -
తెలుగువారికి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, చిత్తూరు : మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కుచెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని ఆయన అన్నారు. సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావడం సహజమని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా, ప్రతి ఒక్కరి ఇల్లు ఆనందంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటల, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితేనే అందరికీ గుర్తుకు వస్తాయని అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తులవారు సుఖ, సంతోషాలతో తులతూగాలని వైఎస్ జగన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. -
తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం దీపావళి శుభాకాక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా వేడుకగా పండుగ చేసుకోవాలని, వారి జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని ఆశించారు. అలాగే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ తదితరులు కూడా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీపావళి సందర్భంగా శనివారం బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను కలవడానికి, అలాగే చిత్తూరులో ఉన్న తన తల్లిని పలకరించడానికి కూడా ఆయన వెళ్తున్నట్లు తెలిసింది.