రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా వేడుకగా పండుగ చేసుకోవాలని, వారి జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని ఆశించారు. అలాగే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ తదితరులు కూడా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీపావళి సందర్భంగా శనివారం బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను కలవడానికి, అలాగే చిత్తూరులో ఉన్న తన తల్లిని పలకరించడానికి కూడా ఆయన వెళ్తున్నట్లు తెలిసింది.