grew
-
చైనాకు ఎదురుదెబ్బ: భారత్‌లో జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రకటనల రంగం 2023లో 16.8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని గ్రూప్-ఎం నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే 15.8 శాతం వృద్ధితో భారత విపణి ప్రస్తుత సంవత్సరం రూ.1,21,882 కోట్లకు చేరుతుంది. డిజిటల్ అడ్వైర్టైజ్మెంట్లే ఈ రంగాన్ని ముందుండి నడిపిస్తాయి. 2022లో ఈ విభాగం వాటా మొత్తం పరిశ్రమలో ఏకంగా 48.8 శాతం ఉండనుంది. మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే మరింత జోరు కొనసాగనుంది. ఈ ఏడాది రిటైల్ మీడియా పరిశ్రమ విలువ రూ.4,507 కోట్లు నమోదు కానుంది. 2027 నాటికి ఇది రెండింతలు అవుతుంది. 36 శాతం వాటా కలిగిన టీవీ ప్రకటనల వ్యాపారం 10.8 శాతం అధికం కానుంది. సంప్రదాయ, కనెక్టెడ్ టీవీల జోరుతో టీవీ అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ రెండంకెల వృద్ధి కొనసాగిస్తుంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ విస్తృత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య అనిశ్చితిని ఎదుర్కొంటోంది. బలహీన కరెన్సీ, అధిక నిరుద్యోగం, అధిక వడ్డీ రేట్ల నుండి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకుంటోంది. (చదవండి: సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) చైనాతో పోలిస్తే భారత్‌కే.. కోవిడ్-సంబంధిత లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2022లో రూ.11,27,204 కోట్ల చైనా ప్రకటనల ఆదాయంతో పోల్చినప్పుడు, భారత పరిశ్రమ పరిమాణం చాలా చిన్నది. అయితే చైనా ఈ ఏడాది 0.6 శాతం తిరోగమన వృద్ధిని చవిచూడబోతోంది. 2023లో డ్రాగన్ కంట్రీలో పరిశ్రమ 6.3 శాతం పెరుగుతుందని అంచనా. చైనాతో పోలిస్తే భారత్‌కు అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకటనల రంగం 2022లో 6.5 శాతం, 2023లో 5.9 శాతం నమోదయ్యే చాన్స్ ఉంది’ అని నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్నెస్, వినోదం, ఆభరణాల సంస్థలు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 20 శాతం వరకు పెంచాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె గుర్తుచేశారు. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
వింతగా కాసిన మిరప
సాక్షి, మహబూబ్‌నగర్ : ధారణంగా ఏ చెట్టుకైనా పండ్లు గాని, కూరగాయలు గాని కొమ్మ కిందకు వేలాడుతూ కాస్తాయి. కానీ ఇక్కడ కన్పించే మిరప చెట్టుకు మాత్రం మిరపకాయలు వింతగా ఆకాశం వైపు చూస్తూ పైకి కాశాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలోని కుర్వ చంద్రశేఖర్ ఇంట్లోని చెట్టుకు వింతగా మిరప కాయలు కాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
రోజుకు రూ. 2,200 కోట్లు పెరిగింది!
సమాజంలో పేద-ధనిక మధ్య వ్యత్యాసం పెరుగుతూ పోతోందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ నివేదించింది. భారతీయ కోటీశ్వరుల సంపద గత ఏడాది భారీగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ స్టడీ తేల్చింది. సోమవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2018లో భారతీయ కుబేరుల సంపద రోజుకు 2వేల,200 కోట్ల రూపాయల మేర పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద12శాతం పుంజుకుని రోజుకు దాదాపు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 1 శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా, పేదవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగిందని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో తేలింది. భారత్ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం 9 మంది బిలియనీర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గత ఏడాది 26 మంది బిలియనీర్లు మరింత ధనికులై కోట్లకు పడగలెత్తితే.. సుమారు 3.8 బిలియన్ల మంది పేదలు ఇంకా దారిద్యంలోనే మగ్గుతున్నారని రిపోర్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు చేరిందని ఆక్స్ ఫామ్ తెలిపింది. 2008 తర్వాత ఇదే భారీ పెరుగుదల. 2018-2022 మధ్య భారత్ నుంచి కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లుగా కొత్తగా ఈ జాబితాలో చేరతారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో సగం పేద జనాభా వద్ద సొమ్ము 11 శాతం తగ్గిపోయింది అని ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో మొత్తం సంపదలో 77.4శాతం కేవలం జనాభాలోని కేవలం 10శాతం మంది చేతుల్లో వుంది. అంతేకాదు 51.53శాతం సంపద 1 శాతం ధనవంతుల వద్ద ఉంది. 60 శాతం మంది జాతీయాదాయంలో 4.8 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. భారత్‌లో 10 శాతం జనాభా 13.6 కోట్ల మంది ప్రజలు కడుపేదవారుగా మారిపోతున్నారనీ, 2004 నుంచి అప్పుల్లోనే మగ్గిపోతున్నారు. వైద్య, ప్రజా ఆరోగ్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం రెవెన్యూ, ఖర్చులు రూ. 2,08,166 కోట్లుగా ఉన్నాయనీ, ఇది భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ రూ. 2.8 లక్షల కోట్ల సంపద కంటే తక్కువని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 112 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 115 మిలియన్ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్ బెజోస్ ఆదాయంలో 1 శాతం ఆదాయం సమానమని ఆక్స్‌ఫామ్ స్టడీ వ్యాఖ్యానించింది. 2008లో పలు ప్రపంచదేశాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని ఆక్స్‌ఫామ్ స్టడీలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆరోగ్య, విద్య వంటి ప్రజా సేవలపై అతి తక్కువ నిధులతో అసమానతలను పెంచుతోంటే...మరోవైపు సూపర్ సంపన్నులు, కార్పొరేట్స్ దశాబ్దాల కాలంగా తక్కువ పన్నులు చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ అమెరికా శాఖ వైస్ ప్రెసిడెంట్ పాల్ ఓబ్సీన్ తెలిపారు. కోట్లాది పేదలు, బడుగువర్గాలు రోజుకు అయిదున్నర డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తూ దుర్భరంగా బతుకులీడుస్తున్నారన్నారు. ఇది పేద మహిళల, బాలికల విషయంలో మరీ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఆర్ధిక వ్యవస్థ చాలా ‘అమానుషం‘ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధనికులు మరింత ధనికులు కావడాన్ని తాము వ్యతిరేకించకపోయినప్పటికీ..అదే సమయంలో పేదల సంపద కూడా పెరగాలి.. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అని పాల్ వ్యాఖ్యానించారు. తమ తాజా నివేదికను అన్ని దేశాలకూ పంపుతామని చెప్పారు. BREAKING: Billionaire fortunes grew by $2.5 billion a day last year as the poorest people saw their wealth fall – our latest inequality report is out today: https://t.co/aVgdwB6i07 #wef19 #FightInequality #BeatPoverty pic.twitter.com/mc2HW1dDSp — Oxfam International (@Oxfam) January 21, 2019 -
భారతీయుల వేతనాలు ఎంత పెరిగాయో తెలుసా?
ఎనిమిదేళ్ల క్రితం నెలకొన్న ఆర్థిక సంక్షోభం కాలం నుంచి ఇప్పటివరకు భారతీయులు వేతనాలు ఎంత పెరిగాయో వింటే షాకవుతారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 0.2 శాతం మాత్రమే భారతీయుల వేతనాలు పెరిగాయట. ప్రపంచ రెండో ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనా, ఓ వైపు తయారీరంగంలో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్పప్పటికీ వేతనాలను మాత్రం భారీగానే పెంచిందట. ఆ దేశ శాలరీ గ్రోత్ రికార్డు స్థాయిలో 10.6 శాతంగా నమోదైందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కార్న్ ఫెర్రీ హే గ్రూపు డివిజన్ జరిపిన తాజా విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవంగా వేతన వృద్ధి భారత్‌లో కేవలం 0.2 శాతం నమోదైనప్పటికీ, అదేకాలంలో జీడీపీ 63.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. 2008 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే శాలరీ గ్రోత్‌లో చైనా తర్వాత ఇండోనేషియా(9.3శాతం), మెక్సికో(8.9శాతం) ఎగిసినట్టు ఈ అధ్యయనం తెలిపింది. అదేవిధంగా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల వేతన వృద్ధి చాలా చెత్తగా ఉందని పేర్కొంది. టర్కీ వేతన వృద్ధి -34.4 శాతం, అర్జెంటీనాది -18.6శాతం, రష్యాది -17.1శాతం, బ్రెజిల్ ది -15.3శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. భారత్‌లో వేతన వృద్ధి ముందునుంచి చాలా అసమానంగా ఉంటుందని, 30 శాతం మంది చాలా తక్కువగా, 30 శాతం మంది కొంచెం ఎక్కువగా వేతనాలు పొందుతున్నారని కార్న్ ఫెర్రీ హే గ్రూపు గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ బెంజమిన్ ఫ్రాస్ట్ తెలిపారు. కేవలం సీనియర్ లెవల్ ఉద్యోగాలకు మాత్రమే వేతన వృద్ధి ఉందని,అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల వృద్ధి తక్కువగానే ఉందని ఫ్రాస్ట్ వివరించారు. భారత్‌లో నైపుణ్యాలు లేమి, మితిమిత జ్క్షానంతో వచ్చే ఉద్యోగుల శాతం పెరుగుతుండటంతో, వేతన వృద్ధి కూడా అంతతమాత్రంగానే ఉందని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ముందస్తు కాలంలో ఉన్న ధరల పెరుగుదల, కరెన్సీ విలువలో మార్పులు వేతన వృద్ధిని అంతలా పెంచలేకపోయాయని కార్న్ ఫెర్రీ హే గ్రూపు విశ్లేషణ తెలిపింది.