Grey Group
-
FATF: పాక్‌కు ఊరటపై భారత్ స్పందన
ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన ‘గ్రే లిస్ట్’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. ఫ్రాన్స్ పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్ అధ్యక్షుడు రాజ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నాలుగేళ్ల తర్వాత పాక్‌కు దక్కిన ఊరట పరిణామంపై పొరుగు దేశం భారత్ స్పందించింది. మనీల్యాండరింగ్ అంశంలో ఆసియా ఫసిఫిక్ గ్రూప్‌నకు పాక్ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు. ► ఇక.. జూన్ 2018 మరియు జూన్ 2021లో FATF గుర్తించిన వ్యూహాత్మక లోపాలకు సంబంధించి పాక్ ఇచ్చిన వివరణ పట్ల ఫాట్ఫ్ సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యాచరణ ప్రణాళికల కట్టుబాట్లను నెరవేర్చడానికి సాంకేతిక లోపాలను కారణంగా చూపించింది పాక్. ఈ కారణంతో.. పాక్‌కు ఊరట ఇస్తూ ఫాట్ఫ్ నిర్ణయం తీసుకుంది. ► FATF బ్లాక్‌లిస్ట్‌లో ఒక దేశం చేరిందంటే.. ఆ దేశం మనీల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌లో ప్రపంచ పోరాటానికి సహకారం అందించడం లేదనే అర్థమన్నమాట. ► ఒకవేళ ఫాట్ఫ్ బ్లాక్ లిస్ట్‌లో ఏదైనా దేశానికి స్థానం దక్కితే.. ఆ దేశానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ నుంచి సహకారం అందడం తగ్గిపోతుంది. ► FATF(Financial Action Task Force)లో సభ్య దేశాలు 39. అమెరికా, యూకేతో పాటు భారత్ కూడా కూడా సభ్య దేశంగా ఉంది. ► పాకిస్తాన్‌ను ఫాట్ఫ్ గ్రే లిస్ట్ నుంచి తొలగించడంపై.. అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య అంతా? -
ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లోనే పాక్
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్)కు సంబంధించి గ్రే లిస్ట్‌లోనే పాక్ కొనసాగనుంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, నగదు అక్రమ రవాణా నివారణలకు ఆయా దేశాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. గతంలో అంగీకరించిన 6 కీలక షరతుల అమలు విషయంలో పాకిస్తాన్ విఫలం కావడంతో గ్రే జాబితాలోనే ఆ దేశం కొనసాగే పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్(జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్), హఫీజ్ సయీద్(లష్కరే తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు), జకీఉర్ రహమాన్ లఖ్వీ(లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్)లపై చర్యలు తీసుకోవడం ఆ ఆరు కీలక షరతుల్లో ఒకటి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ బుధ, గురు, శుక్రవారాల్లో వర్చువల్ విధానంలో జరిగింది. ‘సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితా(గ్రే లిస్ట్)లోనే పాకిస్తాన్‌ను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం అందే విషయంలో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న దేశాలపై అనేక ఆంక్షలుంటాయి. -
ఆరోగ్యానికి బొట్టు బిళ్ల
నుదుటన దిద్దుకునే బొట్టు సింగారానికి మాత్రమే కాదు, ఇక పై ఎంతోమంది స్త్రీలకు ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదించబోతోంది. రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న అయోడిన్ లోపం వలన స్త్రీలు, వారికి పుట్టబోయే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను సింగపూర్‌కు చెందిన గ్రే గ్రూప్, నాసిక్‌లోని నీల్‌వసంత్ మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కలిసి ఈ బిందీ రూపకల్పన చేశారు. దాదాపు ఏడు కోట్లమందికి పైగా భారతీయులు అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్లు జాతీయ స్థాయి లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, ఫైబ్రాయిడ్స్‌కి దారితీసే అవకాశం ఉండగా, పుట్టబోయే పిల్లలు మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగకపోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అయోడిన్ లోపంతో బాధపడుతున్న గ్రామీణ మహిళల కోసం ‘లైఫ్ సేవింగ్ డాట్’ పేరుతో సింగపూర్‌కి చెందిన గ్రే గ్రూప్ పైన పేర్కొన్న బిందీని రూపొందించింది. అయోడిన్ లోపాన్ని అధిగమించడానికి పోషకాహార ఔషధాలను కొనుగోలు చేయలేని గ్రామీణ స్త్రీలకు ఈ బిందీలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించనున్నాయి. అయోడిన్ మందులకు అయ్యే ఖర్చు భరించలేని మహిళలకు ఈ బిందీలను త్వరలోనే దేశవ్యాప్తంగా అందచేస్తారు. 100-150 మైక్రో గ్రాముల అయోడిన్‌తో తయారు చేసిన ఈ బిందీ ప్యాచ్‌లను రోజులో 8 గంటలు పెట్టుకుంటే చాలు, ఒక రోజుకు కావలసిన అయోడిన్‌ను స్త్రీలు పొందగలుగుతారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలోని మూడు ఆదివాసీ ప్రాంతాలలో ఈ బిందీలను ఆరోగ్య శిబిరాల ద్వారా సప్లై చేశారు. - ఓ మధు