grievance redressal service
-
ఈ– కామర్స్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మెరుగుపడాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు. కీలక చర్యలకు శ్రీకారం.. వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. -
జీఎస్టీ ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీకి సంబంధించి, అలాగే, పన్ను చెల్లింపుదారుల సాధారణ ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ భావించినట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది. రాష్ట్రాల స్థాయిలో, జోనల్ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు కమిటీలో చోటు కల్పిస్తారు. రెండేళ్ల కాలానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, సభ్యుల పదవీ కాలం కూడా అదే విధంగా ఉంటుందని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలకు పరిష్కారం చూపించడం ఈ కమిటీ విధుల్లో భాగం. ప్రతీ త్రైమాసికానికి ఒక సారి, అవసరానికి అనుగుణంగాను కమిటీ సమావేశం అవుతుంది. ఫిర్యాదుల నమోదు, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరించే విధంగా జీఎస్టీఎన్ ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. -
ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన..
లక్నోః ఉత్తరప్రదేశ్ లో మొదటిసారి ప్రారంభించిన పోలీస్ ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన లభించినట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలతో మమేకమై.. ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రారంభించిన మైక్రోబ్లాగింగ్ వేదికను దేశంలోనే మొట్ట మొదటిసారి తమ రాష్ట్రం ప్రారంభించినట్లు చెప్పారు. ట్విట్టర్ సర్వీస్ ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 19 తేదీల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే 1,710 ట్వీట్లు వచ్చాయని, వాటిలో 1,280 కేసులను ఇప్పటికే పరిష్కరించినట్లు రాష్ట్ర డీజీపీ జావేద్ అహ్మద్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ ట్విట్టర్ లో సేవలందించేందుకు సెప్టెంబర్ 8న ముందుకు వచ్చింది. ప్రజలు ఆన్లైన్ లో ఇచ్చే ఫిర్యాదులకు డిపార్ట్ మెంట్ వెంటనే స్పందింస్తుందని, ఇందుకోసం ట్విట్లర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర డీజీపీ పేర్కొన్నారు.