grievence
-
వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా?
ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలను పాటిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో గ్రీవియన్స్ & నోడల్ అధికారిగా న్యాయవాది పరేష్ బి లాల్‌ను వాట్సాప్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రీవియన్స్ & నోడల్ అధికారి న్యాయవాది పరేష్ బి లాల్ తన పదివికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన పదవి నుంచి తప్పుకోవడంతో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు బిజినెస్ ఇన్ సైడర్ కథనం తెలిపింది. ప్రస్తుతం, అతని స్థానంలో వరుణ్ లాంబాను వాట్సప్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొత్త ఐటి నియమాల ప్రకారం.. భారతదేశానికి చెందిన ముగ్గురిని చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ వ్యక్తి, గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించాల్సి ఉంటుంది. పరేష్ బి లాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను మే నుంచి అక్టోబర్ 2021 మధ్య 'అటార్నీ-గ్రీవియెన్స్ ఆఫీసర్ & నోడల్ ఆఫీసర్'గా వాట్సప్‌లో పనిచేశారు. అయితే, అతని నిష్క్రమణకు కారణం ఇంకా తెలియదు. ఇంతకు ముందు చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌గా మే 2021లో ఒకరిని నియమించినట్లు సమాచారం. అయితే, దీని గురుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు షాక్.. జనవరి 1 నుంచి?) -
న్యాయవాదినంటూ మోసం చేశాడు
గుంటూరు: నకిలీ న్యాయవాది మాటలు నమ్మి మోసపోయామంటూ ఓ బాధితురాలు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీ సిహెచ్.వెంకటప్పలనాయుడు వద్ద కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం ప్రకారం... నరసరావుపేట కూరగాయల మార్కెట్ సెంటర్లో నలుమోలు లక్ష్మీప్రసన్న టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తున్నారు. 2016లో ఆమె భర్త స్నేహితుడు గిరికి అతని అవసరాల నిమిత్తం విడతలవారీగా రూ. లక్ష అప్పుగా ఇచ్చారు. అదేవిధంగా ఆమె భర్త సోదరుడు సుధీర్ కూడా విడతల వారీగా రూ. 2.50 లక్షలు గిరికి అప్పుగా ఇచ్చారు. ఏడాది గడిచినా డబ్బు ఇవ్వకపోవడంతో గిరి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధితులు న్యాయవాదినంటూ చెప్పుకొని తిరిగే అట్లూరి విజయకుమార్‌ను ఆశ్రయించారు. మీ డబ్బు వీలైనంత త్వరలో తిరిగి ఇప్పిస్తానని విజయకుమార్ నమ్మబలికి న్యాయవాది ఫీజు రూ. 30 వేలు తీసుకోవడంతోపాటు, గిరి రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటును బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం గిరితో మాట్లాడి బాధితులకు రూ. 50వేలు ఇప్పించాడు. గిరి కొంత సమయం కోరవడంతో అందుకు విజయకుమార్ సలహా మేరకు అంగీకరించారు. చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వకపోవడంతో గిరిని నిలదీస్తే అసలు విషయం బయటపడింది. తాను ఇవ్వాల్సిన రూ. 3 లక్షలను విజయకుమార్ తీసుకెళ్లాడని చెప్పాడు. బాధితులకు విజయకుమార్ తీరుపై అనుమానం కలిగి విచారిస్తే అసలు అతను న్యాయవాది కాదని తేలింది. దీంతో తాము మోసపోయామని భావించి గిరి వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని విజయకుమార్‌ను పలు మార్లు కోరినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఎస్పీని ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే నరసరావుపేట –2 టౌన్ సీఐకు ఫోన్ చేసి విచారించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
సర్వం కోల్పోయాం.. ఆదుకోండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత ఏడాది జనవరి 7న జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు కోల్పోయామని, ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఇళ్లు మంజూరు చేయలేదని గార మండలంలోని కొర్ని గ్రామానికి చెందిన బాధితులు ముంత స్వప్న, మల్లేశు, రాజప్పడు, సూరయ్య, నాగమణి, రాము, తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ ధనంజయరెడ్డికి తెలిపారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. సోమవారం గ్రీవెన్సుకి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఇందులో కలెక్టర్‌తో పాటు జేసీ–2 పి.రజనీకాంతరావు, డీఆర్డీఏ పీడీ జి.సి.కిషోర్ కుమార్, డ్వామా పీడీ హెచ్. కూర్మారావు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ వారం వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా.. ♦ స్వీట్ దుకాణాలకు సంబంధించి తయారీ కేంద్రాలను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం నగరం కాకివీధి స్థానికులు జి. మోహన్, జి.సురేష్, బాబా శ్రీధర్, తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో సిలెండర్లు ఉపయోగిస్తున్నారని, కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ప్రమాదం జరిగిందని, వీటి తయారీని అడ్డుకోవాలని కోరారు. ♦ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది శ్రీముఖలింగం ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు వసతి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ కోరారు. ♦ హిరమండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబాలు 66 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా స్థలం అప్పగించలేదని వీరు కోరారు. ♦ కొన్నేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బధిరుల పోస్టులను భర్తీ చేయాలని బధిరుల సంఘం ప్రతినిధులు సి.హెచ్.సరీమ్, ఎస్.భీమాస్వరాజ్, జి.విద్యాసాగర్, తదితరులు గ్రీవెన్సులో కోరారు. ఏటా నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నామని, ఈ ఏడాది మొత్తం పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు. రక్షణ కల్పించండి తన పొలంలో బోరుబావికి విద్యుత్ సర్వీసు ఇవ్వకపోవడంతో గత ఏడాది కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన రైతు టంకాల మోహనరంగ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చారు. ఆ సమయంలో రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి హామీ ఇచ్చారు. అయితే వారం రోజులయినా సమస్య పరిష్కారం కాలేదని కలెక్టర్‌కు తెలిపారు. అంతేగాక తనను బెదిరించడంతో పాటు విద్యుత్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. తనకు రక్షణతోపాటు, విద్యుత్ సర్వీసు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఆయనతో పాటు ఏపీ రైతు సంఘం కార్యదర్శి కె.నారాయణరావు, వి.రమణ, టి.మోహనరావు ఉన్నారు. ఎస్పీ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 20 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ స్వీకరించారు. త్వరతిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సివిల్ తగాదాలు– 4, కుటుంబ తగాదాలు– 2, పాతకేసులు–1, ఇతర సమస్యలకు సంబంధించి 13 ఫిర్యాదులు వచ్చాయి. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శ్యామలరావు నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మహిళా ఎస్ఐ వాణిశ్రీ, విశ్రాంత ఎస్ఐ పి.రాజేశ్వరరావు, టి వరప్రసాద్, నిర్మల, విజయకుమారి పాల్గొన్నారు. -
పాపం.. పండుటాకులు
కొవ్వూరు : వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న పండుటాకులను కష్టాలు వెంటాడుతున్నాయి. పింఛను సొమ్ముల కోసం మూడు రోజుల నుంచి సహాయకులను వెంటబెట్టకుని.. చేతికర్ర సాయంతో కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూలో నిలబడి కౌంటర్ వద్దకు వెళితే.. మీ అకౌంట్లో సొమ్ము రాలేదనే సమాధానం వస్తోంది. వికలాంగులు, వితంతువుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జిల్లా వ్యాప్తంగా 3,38,153 మందికి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో సుమారు 2లవేల మంది ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. కొందరికి బ్యాం క్ ఖాతాలు లేకపోవడం.. ఖాతాలున్నా వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి కొన్ని ఖాతాలను సరిచేసినప్పటికీ ఇంకా 15,251 మందికి పింఛను సొమ్ము ఖాతాల్లో చేరలేదు. ప్రాంతాల వారీగా ఇలా.. ఉంగుటూరు మండలంలో గరిష్టంగా 784 మందికి, లింగపాలెం మండలంలో 674, పెదవేగి మండలంలో 599, పోడూరు మండలంలో 538, దేవరపల్లి మండలంలో 534 మందికి పింఛను సొమ్ములు వారి ఖాతాల్లో వేయలేదు. నరసాపురం, యలమంచిలి, ఇరగవరం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో ఒక్కోచోట 400 మందికి పైగా పింఛను సొమ్ము రాలేదు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో 1,909 మందికి సొమ్ము జమ కాలేదు. గరిష్టంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 771 మందికి, భీమవరం పట్టణంలో 244 మందికి, తణుకులో 246 మందికి పింఛన్లు జమ కాలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లో 654 మంది నేటికీ పింఛను సొమ్ముకు నోచుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 2,300 రేష¯ŒS డీలర్లు, 350 మంది బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఈనెల 6వ తేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని నిర్ణయించారు. లేవలేని స్థితిలో ఉన్న పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మూడు రోజులుగా తిరుగుతున్నా.. పింఛను డబ్బు కోసం మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. అయినా సొమ్ము అందలేదు. బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసినట్టు చెప్పారు. బ్యాంకుకు వెళితే.. ఖాతాలో సొమ్ము పడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – సంపతి అమ్మన్న, తాళ్లపూడి చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో ప్రతినెలా 1వ తేదీన పింఛను సొమ్ము చేతికి ఇచ్చేవారు. ఈ నెల డబ్బులు ఎక్కడ ఇస్తారో తెలియక అయోమయంలో పడ్డాను. బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకుకు వెళితే అక్కడ ఖాళీ లేదు. నాకు ఏటీఎం కార్డు లేదు. పింఛను డబ్బు ఖాతాలో పడిందో లేదో తెలియడం లేదు. – అంకోలు శేషయ్య, వేగేశ్వరపురం