Grocery goods
-
చిటికెలో చాయ్.. బిస్కెట్!
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి. ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్స్టాకేఫ్ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం... తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం... ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం. ‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్ల కోసం ఇన్స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.అధిక మార్జిన్లు... క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కంప్యూటర్ సైన్స్ వదిలేసి 'జెప్టో' స్టార్టప్.. యంగెస్ట్ మిలీయనీర్స్గా
బెంగళూరుకు చెందిన కైవల్య వోహ్ర, ముంబైకి చెందిన అదిత్ పలీచా స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీని మధ్యలోనే వదిలేసి ‘ఏదైనా సాధించాలి’ అనే లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు. ‘జెప్టో’ స్టార్టప్‌తో తిరుగులేని విజయాన్ని సాధించారు. తాజాగా లింక్డిన్ ‘టాప్ 25 స్టార్టప్’ల జాబితాలో ఇ–కామర్స్ గ్రాసరీ ΄ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న వయసులోనే తమ స్టార్టప్ ‘జెప్టో’ను యూనికార్న్ స్టేటస్‌కు తీసుకెళ్లిన కైవల్య వోహ్రా, అదిత్ పలీచాలు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు... లాక్డౌన్ సమయంలో తమకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటే బహుశా ‘జెప్టో’ స్టార్టప్ పుట్టేది కాదేమో. ఆ సమయంలో ముంబైలోని అద్దె ఇంట్లో ఉంటున్న కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు నిత్యావసర వస్తువులకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో నుంచే ‘కిరాణామార్ట్’ స్టార్టప్ పుట్టింది. ఇదే ఆ తరువాత ‘జెప్టో’ రూపంలో విశ్వరూపాన్ని చూపించింది. తిరుగు లేని విజయాలు సాధించడానికి వయసు అడ్డు కాదని, అనుభవం అత్యవసరం కానక్కర్లేదని, కృషి పట్టుదల ఉంటే సరిపోతుందని ‘జెప్టో’ అసాధారణ విజయం నిరూపించింది. ఆరోజుల్లోకి వెళితే...‘మాకు సవాలు విసిరిన టైమ్ అది. నిజానికి కిరాణాషాప్‌ల గురించి మాకు అంతగా తెలియదు. క్రాష్ కోర్సులు కాలేజీల్లోనే కాదు వాటికి అవతల కూడా ఉంటాయి! రోజూ పొద్దున్నే పది నుంచి ఇరవై కిరాణాషాప్లకు వెళ్లి యజమానులతో వివరంగా మాట్లాడి మా కాన్సెప్ట్ చెప్పేవాళ్లం. పిల్లలేదో చెబుతున్నారు...విందాం...అన్నట్లుగా వినేవారు తప్ప మాపై వారికి అంతగా నమ్మకం ఉన్నట్లుగా అనిపించేది కాదు. మా యాప్‌ను కొద్దిమంది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అంగీకరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు కైవల్య వోహ్ర.పరిస్థితులను చూస్తుంటే...‘అబ్బే ఇదేదో మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు. మిత్రమా...రథం వెనుక్కు మళ్లించు’ అనుకునే పరిస్థితి. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ‘సక్సెస్ మంత్రా’లో ఒక రూల్....యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించకు. రణస్థలి వరకు మాత్రమే వెళ్లారు. ఇంకా యుద్ధం మొదలే కాలేదు.వారి కృషి ఫలితంగా మెల్లగా యాప్ ఊపందుకుంది. ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబ్బై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణాదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరీ చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి.ఇప్పుడు...‘జెప్టో’ మన దేశంలోని ప్రధాన నగరాలలో మూడు వేలకు పైగా గ్రాసరీ ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేస్తుంది. గంటలు దాటని, కస్టమర్ ఓపికను పరీక్షించని అతి తక్కువ సమయ డెలివరీ టైమ్‌ను నిర్దేశించుకుంది. ఇద్దరితో మొదలైన ‘జెప్టో’లో ఇప్పుడు వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారు. ‘జెప్టో’ సక్సెస్‌లో ‘యూజర్ ఎక్స్‌పీరియెన్స్’ కీలక భూమిక పోషించింది, ‘విజయానికి త్యాగానికి సంబంధం ఉందా?’ అని అడిగితే ‘కచ్చితంగా ఉంది’ అంటాడు కైవల్య వోహ్ర. ‘ఏ వయసు ముచ్చట ఆ వయసులో’ అంటారు. ఆడి పాడాల్సిన రోజుల్లో, సినిమాలు, షికార్లు, స్నేహితులే ప్రధానమనిపించే రోజుల్లో అన్నీ విడిచిపెట్టి ‘మా స్టార్టపే మా ప్రపంచం’ అన్నట్లుగా పగలు,రాత్రి కష్టపడ్డారు.‘మనం ఒక రంగంలో విజయం సాధించాలంటే మన ఇష్టాలకు దూరంగా ఉండక తప్పదు. దీన్ని త్యాగం అనుకోవచ్చు’ అంటాడు కైవల్య వోహ్ర. మన దేశ గ్రాసరీ సెగ్మెంట్లో తమదైన ముద్ర వేసిన కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు ‘యంగెస్ట్ సెల్ఫ్–మేడ్ మిలీయనీర్స్’గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు. ∙ ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరి చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి. -
మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ
ముంబై: గ్రోసరీ వ్యాపారంలో మరింతగా విస్తరించే ప్రణాళికలతో అమెజాన్ ఇండియా ఉంది. నాన్ మెట్రో, ఇతర పట్టణాల్లోని మొదటి సారి కస్టమర్లను పెద్ద ఎత్తున సొంతం చేసుకోవాలనుకుంటోంది. గడిచిన ఏడాది కాలంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు ఇతర పట్టణాల నుంచి అమెజాన్‌లో షాపింగ్ చేసిన కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త కస్టమర్లలో 85 శాతం.. అలాగే, ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాల నుంచే ఉన్నాయి. అమెజాన్ గ్రోసరీ వ్యాపారమైన అమెజాన్ ప్యాంట్రీలనూ కొనుగోలు చేసే మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగింది. అమెజాన్ ప్యాంట్రీలో కొనుగోలుదారులు రెట్టింపుయ్యారు. కరోనా తర్వాత అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ ఫ్రెష్‌పై ఆర్డర్లలో 60 శాతానికి పైగా నూతన కస్టమర్ల నుంచే, అది కూడా నాన్ మెట్రోల నుంచే ఉంటున్నాయి. వేగంగా డెలివరీ.. ఆర్డర్ చేసిన వెంటనే వేగంగా గ్రోసరీ డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్.. 10 పట్టణాల్లో ప్యాంట్రీ (డ్రై గ్రోసరీ/కిరాణా సరుకులు), ఫ్రెష్ (కిరాణా, పండ్లు, కూరగాయలు) సేవలను ఏకీకృతం చేసింది. మరింత వేగంగా డెలివరీ చేసేందుకు సమగ్ర ఆన్లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఆర్డర్లను ఇక్కడి నుంచే వేగంగా డెలివరీ చేయనుంది. ఇక మిగిలిన 290 పట్టణాల్లో ఫ్రెష్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్యాంట్రీ ద్వారా ఆయా పట్టణాల్లో గ్రోసరీ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ‘‘గ్రోసరీ విభాగం రెండు రెట్లు పెరిగి అమెజాన్ డాట్ ఇన్‌లో నూతన కస్టమర్లకు ఒక గేట్వేగా మారింది. ఆన్లైన్ గ్రోసరీ విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఇది ఇప్పటికీ చాలా చిన్న మార్కెట్‌గానే ఉంది. భారత్‌లో ప్రజల గ్రోసరీ కొనుగోళ్ల తీరు పూర్తిగా పరిణామం చెందనుంది. రానున్న కొన్నేళ్లలో ఈ విభాగం ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. కొత్తగా వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుంచే ఉంటారని అంచనా వేస్తున్నాము. డ్రై గ్రోసరీ పరిధిని విస్తరించనున్నాము. టాప్-50 పట్టణాల్లో ఫ్రెష్, డ్రై గ్రోసరీలో పూర్తి శ్రేణిలో ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. టాటాలు సైతం.. టాటా గ్రూపు సైతం ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారంపై భారీ అంచనాలతోనే ఉంది. టాటా డిజిటల్ లిమిటెడ్ ఇప్పటికే బిగ్ బాస్కెట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, కాంపిటిషన్ కమిషన్ ఆమోదం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. రిలయన్స్ జియో సైతం జియోమార్ట్ పేరుతో పట్టణాల్లో గ్రోసరీ డెలివరీ చేస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ కూడా విస్తరణ ప్రణాళికలతో ఉంది. ఈ ఏడాది ఈ విభాగంలో మంచి వృద్ధి నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాయి. గతేడాది లాక్డౌన్లు విధించడం ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ విస్తరణకు మద్దతునిచ్చిన అంశంగా చెప్పుకోవాలి. 2019లో 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్లైన్ గ్రోసరీ వ్యాపారం 2020లో 3.3 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు రెడ్‌సీర్ సంస్థ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2025 నాటికి ఈ మార్కెట్ 24 బిలియన్ డాలర్లకు (రూ.1.75లక్షల కోట్లు) విస్తరిస్తుందని అంచనా వేస్తోంది. స్థానిక కిరాణా వర్తకుల భాగస్వామ్యంతో కూడిన అమెజాన్ ‘లోకల్ షాప్స్’ ఈ ఏడాది మార్చి నాటికి 450 పట్టణాల్లో 50,000 ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలకు విస్తరించగా.. ఈ ఏడాది చివరికి రెట్టింపు సంఖ్యకు చేరుకుంటామని అమెజాన్ ఇండియా అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ ఈ కామర్స్ వేదికగా స్థానిక కిరాణా వర్తకులు రిజిస్టర్ చేసుకుని విక్రయాలు చేపట్టవచ్చు. చదవండి: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే! -
కత్తులతో పొడిచి.. గొంతుకోసి..
నల్గొండ జిల్లాలో బెల్లంపల్లి వ్యక్తి హత్య పోలీసుల అదుపులో అనుమానితులు కట్టంగూర్ (నల్లగొండ) : దుండగులు కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కట్టంగూరు మండలం నారెగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది. శాలిగౌరారం రూరల్ సీఐ ప్రమీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన కొండబత్తుల కృష్ణ (32) తన భార్య రమ్యతో కలిసి నాలుగు నెలల క్రితం గ్రామంలోని శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికి చెందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు జీతం కుదిరి జీవనం సాగిస్తున్నాయి. కిరాణ సామగ్రి కోసం వెళ్లి.. గురువారం సాయంత్రం కృష్ణ తన భార్య రమ్యతో చెప్పి సుమారు 6 గంటల ప్రాంతంలో కిరాణ సామగ్రి తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేంత వరకు భర్త ఇంటికి రాకపోవటంతో రమ్య విషయాన్ని తోటలోని తోటి కూలీలకు తెలియజేసింది. దీంతో కూలీలంతా కలిసి బాట వెంట వెతుకుతుండగా చెట్లపొదల్లో మృతదేహం కనిపించింది. తలపై తీవ్ర గాయాలతోపాటు, శరీరంలో నాలుగు కత్తిపోట్లు, గొంతు కోసి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యోదంతం విషయం తె లుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి ఎస్ఐలు సత్యనారాయణ, మోతీరాం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అదే రాత్రి నకి రేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి పరిశోధించారు. మృతుడి భార్య, తోట సూపర్వైజర్తో కూలీలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఉప్పు.. పప్పు.. బియ్యం...నెట్ నుంచి నట్టింటికి..
- క్లిక్ కొడితే కిరాణా సరుకులు సిద్ధం - నగరంలో నయా వ్యాపారం - అందుబాటులోకి ‘ఆన్లైన్ గ్రాసరీస్’ ‘ఆన్లైన్’లో దొరకని వస్తువు లేదు.. అందని సేవలు లేవు.. ఒక్క క్లిక్ కొడితే ఎలాంటి వస్తువైనా ముంగిట్లోకి వచ్చేస్తుంది. ఇలాంటి వాటిలో ఇప్పుడు గృహిణికి కావాల్సిన ‘కిరాణా సరుకులు’ కూడా చేరిపోయాయి. ఇందుకు ‘ఆన్లైన్ గ్రాసరీస్’ వేదికగా నిలుస్తోంది. సిటీకి చెందిన విక్రమ్ చక్రవర్తి ఈ ఆన్లైన్ సేవలను హైదరాబాద్ వాసులకు పరిచయం చేశారు. కూర్చున్న చోటుకే సకల వస్తువులు తెచ్చుకునే ట్రెండ్ పెరుగుతుండడంతో అన్నింటికీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే అలవాటు వచ్చేసింది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మాదిరి సీన్.. ఇప్పుడు మన సిటీలోనూ విస్తరిస్తోంది. ‘అమెరికాలో ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే అక్కడివారు ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తే ఇంటికి అవసరమయ్యే ప్రతి సామాను డెలివరీ చేస్తారు. కస్టమర్ల టైమ్‌ను సేవ్ చేస్తుంటాయి వందలసంఖ్యలో సంస్థలు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ ట్రెండ్‌ను గమనించిన విక్రమ్ http://www.callgroceries.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇంటికి అవసరమయ్యే క్వాలిటీ కిరాణా సామాను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తాజా కూరగాయాలను సైతం ఆర్డర్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. గృహిణుల కోసం కాల్‌సెంటర్ మన సిటీలో దాదాపు 70 శాతం మంది గృహిణులు ఇంటి పనులను చూసుకుంటున్నారు. నెలకు సరిపడా ఇంటి సామాను తీసుకొద్దామన్నా ఈ భాగ్యనగరంలో వారికి వీలులేకుండా పోతుంది. సమీపంలో కిరాణా దుకాణాలున్నా అనుకున్న బ్రాండ్ సామాను దొరకదు. ఒకచోట ఒక వస్తువు.. ఇంకోచోట ఇతర వస్తువులు కొనాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వారికి షాపింగ్ చేయడం గగనమవుతుంది. అవసరమయ్యే ప్రతి వస్తువు చీటీపై రాసి భర్తకు ఇచ్చినా.. ఉద్యోగ బిజీలో ఉండటం వల్ల షాపింగ్ విషయాన్ని వాళ్లు వాయిదా వేస్తుంటారు. ఒకవేళ వెళ్లినా ట్రాఫిక్ తిప్పలు.. పార్కింగ్ సమస్య తప్పవు. ఇలాంటి సమస్యలు లేకుండా కావాల్సిన అన్ని సరుకులను ఇంటికి అందిస్తోంది కాల్‌గ్రాసరీస్ వెబ్సైట్. అయితే, గృహిణులందరికీ ఆన్‌లైన్‌పై అంతగా నాలెడ్జ్ లేకపోవడంతో ‘కాల్ సెంటర్’ (7893939393) ను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పుడు కాల్ చేసినా 24 గంటల్లోపు వారి ఇంటికి కిరాణా సామాను చేరుస్తామంటున్నారు విక్రమ్ చక్రవర్తి. నాగోల్‌లో తమ సంస్థ కార్యకలాపాలున్నా సిటీ నలువైపుల నుంచి ఆన్లైన్ ఆర్డర్లతో పాటు కాల్స్ భారీగానే వస్తున్నాయని తెలిపారు. లింగంపల్లి, పటాన్చెరువు, జీడిమెట్ల, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఆర్డర్ రాగానే తమ సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. అందుబాటులో నెలవారీ ప్యాకేజీ నెలకు సరిపడా సరుకులను రూ. 1,499 కే అందిస్తోంది ఈ కాల్ గ్రాసర్సీ వెబ్సైట్. ఇందులో పప్పు, చక్కెర, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమ, జీరా, ఆవాలు, పుట్నాలు, పల్లీలు, ఆయిల్, చింతపండు, సబ్బులు, పేస్టులు.. ఇలా 30 ఐటమ్స్‌తో ఆఫర్ ఇస్తున్నట్టు విక్రమ్ తెలిపారు. దీంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు సైతం ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజా కూరగాయలతో పాటు స్వీట్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నామని, ప్రతి కస్టమర్‌కు బెస్ట్ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు.