Group -2 examinations
-
గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియలో మార్పులు
- అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన ఏపీపీఎస్సీ - మెయిన్స్ లోనే పోస్టుల ప్రాధాన్యత సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళంపై ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ నెల 8న ప్రకటించిన 982 గ్రూప్-2 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న అవస్థలను పరి ష్కరించే దిశగా కమిషన్ చర్యలు చేపట్టింది. మొత్తం 7 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తే, సోమవారం 11వ రోజు నాటికి కేవలం 60 వేలు మాత్రమే వచ్చారుు. ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న కొన్ని అంశాలు కూడా అస్పష్టంగా ఉండటంతో అభ్యర్థులు తికమకకు గురవుతున్నా రు. డిసెంబర్ 10వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తున్న ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు కొన్ని సడలింపులు కూడా ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్టీ సారుు సోమవారం రాత్రి పేర్కొన్నారు. ఓటీపీఆర్‌లో సాధారణ సమాచారం చాలు వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)లో అభ్యర్థి సమాచారాన్నంతటినీ నింపితేగాని ప్రస్తుతం ఐడీ నంబర్ రావ డం లేదు. ఓటీపీఆర్ అనేక రకాల సమాచారాన్ని నింపేలా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అంతా నింపినా ఫారం అప్లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అవసరమైన సాధారణ సమాచారం మాత్రమే ఓటీపీఆర్ ద్వారా సమర్పిస్తే చాలు, ఐడీ నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోన్నుట్లు కమిషన్ పేర్కొంది. తప్పులు సరి చేసుకోవచ్చు గ్రూప్-2 ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని నింపి సబ్మిట్ చేశాక అందులో ఏవైనా తప్పులుంటే ప్రస్తుతం సరిచేయడానికి ఆస్కారం ఉండట్లేదు. ఇక నుంచి దరఖాస్తులోని సమాచారాన్ని మార్పులు చేర్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. బుధవారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. చివరి తేదీ వరకు కూడా ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు మాత్రం ఈ అవకాశం ఉండదు. మెయిన్స్ లోనే ఉద్యోగ ప్రాధాన్యత మొత్తం 34 విభాగాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టుకు ముందే అభ్యర్థులు తమ ప్రాధాన్యతను తెలియచేసేలా అప్లికేషన్లో కాలమ్‌లను పెట్టారు.దీంతో ఈ ఆప్షన్‌ను ఎత్తేసి, మెరుున్సకు ఎంపికై న వారి నుంచి మాత్రమే ప్రాధాన్యతలను తీసుకోనున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసిన 60 వేల మందికి మెరుున్సకు ఎంపికై తే వారు ఆప్షన్లు మార్పు చేసుకొనే అవకాశం ఇస్తారు. ముందే సేవ్.. తర్వాతే ఫీజు పేమెంట్ అప్లికేషన్ పూర్తిగా నింపి ఫీజు పేమెంట్ అయ్యాకనే ‘సేవ్’చేసేలా ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చారు. ఇకపై ఫీజు పేమెంట్‌కు ముందే దరఖాస్తు నింపిన వారు ‘సేవ్’చేసి తర్వాత ఫీజు చెల్లించేలా మార్పులు చేస్తున్నారు. అలాగే ఫీజు పేమెంట్‌కు ప్రస్తుతం ఉన్న బ్యాంకులతో పాటు ఎస్బీఐ గేట్ వేను కూడా అనుసంధానం చేయనున్నారు. ‘అకౌంటెంట్’పోస్టుల్లో గందరగోళం గ్రూప్-2లోని పోస్టు కోడ్ 14, 15, 16 లోని వాటికి అర్హతగా ఆఫీస్ అకౌంటెన్సీతో ఏ డిగ్రీ ఉన్నా అర్హులేనని నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. కానీ ఆఫీస్ అకౌంటెన్సీతో బీఎస్సీ పూర్తిచేసిన వారికి, ఇతర డిగ్రీలు చేసిన వారికి ఆన్లైన్ దరఖాస్తులో ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తును సబ్మిట్ చేయగానే అనర్హులుగా చూపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఎకనామిక్స్, కామర్స్, మేథ్స్ సబ్జెక్టులతో ఆఫీస్ అకౌంటెన్సీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా 14, 15, 16 కోడ్ల పోస్టులకు ఆప్షన్లు చూపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 540 ఉంటే అందులో 279 పోస్టులు సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్లకు సంబంధించినవే కావడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తున్న చే యాలని ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదు. దీనిపై ఏపీపీఎస్సీ వెంటనే స్పందిం చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రూప్-2 కోసం పక్కా ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనన్ని ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్తుపరంగా అంతరాయం లేకుండా చూడటంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అరుుంది. జిల్లా కలెక్టర్లతోనూ ఏర్పాట్లపై సమీక్షించింది. నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకు 12న సెలవు ఈ నెల 11, 13వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 12వ తేదీన సెలవు దినమేనని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి 12వ తేదీ రెండో శనివారం సెలవు దినమే. కానీ వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబరు 15వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దానికి ప్రత్యా మ్నాయంగా ఈ నెల 12న పాఠశాలలు నిర్వహించాలని పేర్కొంది. అరుుతే గ్రూప్-2 రాత పరీక్ష 11వ తేదీన, 13వ తేదీన ఉంది. 12వ తేదీన కనుక జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యాసంస్థలు కొనసాగితే ఆ పరీక్ష కేంద్రాల్లో 11వ తేదీన పరీక్ష కోసం వేసిన హాల్‌టికెట్ల నంబర్లను 12వ తేదీన విద్యార్థులు తుడిచివేసే అవకాశముంది. మళ్లీ 13వ తేదీన పరీక్ష ఉన్నందున 12న మళ్లీ హాల్‌టికెట్ నంబరు వేయాలంటే కష్టంగా మారనుంది. దీంతో 12న సెలవు దినంగా ప్రకటించింది. విద్యాశాఖతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకే ఇది వర్తిస్తుంది. మిగతా విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయి. -
గ్రూప్-2 వాయిదా వేయాలి
హైదరాబాద్: నిరుద్యోగులు కదంతొక్కారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్త్తున్న తీరును నిరసిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందల మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఉదయం అశోక్‌నగర్‌లోని కేంద్ర గ్రంథాలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీని చేపట్టారు. అది ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు చేరుకునే సరికి ఉద్రిక్తతకు దారితీసింది. ‘గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్, ఆర్ఆర్బీ పరీక్షలను వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తూ వచ్చిన నిరుద్యోగులను చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య నేతృత్వంలోని పోలీసు బృందం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి నిరుద్యోగులను ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. వీరికి మద్దతుగా వచ్చిన ప్రొఫెసర్ ఐలయ్యను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు అజయ్, గోపాల్‌లు మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్షలు మూడు నెలల పాటు వాయిదా వేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ తీసుకుని లక్ష ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థులు పల్లెల నుంచి నగరానికి వచ్చి రూ.వేలల్లో వెచ్చించి కోచింగులు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్ఆర్బీ, కానిస్టేబుల్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటంతో ఆ పరీక్షలు ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు కావల్సిన సిలబస్, తెలుగు అకాడమీ, గ్రూప్-2 బుక్స్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో నిరుద్యోగ విద్యార్థుల సంఘ నేతలు క్రాంతి, భీమ్రావునాయక్, గణేష్, రవితేజ, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.