
గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియలో మార్పులు
- అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన ఏపీపీఎస్సీ
- మెయిన్స్ లోనే పోస్టుల ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళంపై ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ నెల 8న ప్రకటించిన 982 గ్రూప్-2 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు చేయడంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న అవస్థలను పరి ష్కరించే దిశగా కమిషన్ చర్యలు చేపట్టింది. మొత్తం 7 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తే, సోమవారం 11వ రోజు నాటికి కేవలం 60 వేలు మాత్రమే వచ్చారుు. ఆన్‌లైన్ దరఖాస్తులో పేర్కొన్న కొన్ని అంశాలు కూడా అస్పష్టంగా ఉండటంతో అభ్యర్థులు తికమకకు గురవుతున్నా రు. డిసెంబర్ 10వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తున్న ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు కొన్ని సడలింపులు కూడా ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్‌టీ సారుు సోమవారం రాత్రి పేర్కొన్నారు.
ఓటీపీఆర్‌లో సాధారణ సమాచారం చాలు
వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)లో అభ్యర్థి సమాచారాన్నంతటినీ నింపితేగాని ప్రస్తుతం ఐడీ నంబర్ రావ డం లేదు. ఓటీపీఆర్ అనేక రకాల సమాచారాన్ని నింపేలా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అంతా నింపినా ఫారం అప్‌లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అవసరమైన సాధారణ సమాచారం మాత్రమే ఓటీపీఆర్ ద్వారా సమర్పిస్తే చాలు, ఐడీ నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోన్నుట్లు కమిషన్ పేర్కొంది.
తప్పులు సరి చేసుకోవచ్చు
గ్రూప్-2 ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని నింపి సబ్మిట్ చేశాక అందులో ఏవైనా తప్పులుంటే ప్రస్తుతం సరిచేయడానికి ఆస్కారం ఉండట్లేదు. ఇక నుంచి దరఖాస్తులోని సమాచారాన్ని మార్పులు చేర్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. బుధవారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. చివరి తేదీ వరకు కూడా ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు మాత్రం ఈ అవకాశం ఉండదు.
మెయిన్స్ లోనే ఉద్యోగ ప్రాధాన్యత
మొత్తం 34 విభాగాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టుకు ముందే అభ్యర్థులు తమ ప్రాధాన్యతను తెలియచేసేలా అప్లికేషన్లో కాలమ్‌లను పెట్టారు.దీంతో ఈ ఆప్షన్‌ను ఎత్తేసి, మెరుున్‌సకు ఎంపికై న వారి నుంచి మాత్రమే ప్రాధాన్యతలను తీసుకోనున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసిన 60 వేల మందికి మెరుున్‌సకు ఎంపికై తే వారు ఆప్షన్లు మార్పు చేసుకొనే అవకాశం ఇస్తారు.
ముందే సేవ్.. తర్వాతే ఫీజు పేమెంట్
అప్లికేషన్ పూర్తిగా నింపి ఫీజు పేమెంట్ అయ్యాకనే ‘సేవ్’చేసేలా ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చారు. ఇకపై ఫీజు పేమెంట్‌కు ముందే దరఖాస్తు నింపిన వారు ‘సేవ్’చేసి తర్వాత ఫీజు చెల్లించేలా మార్పులు చేస్తున్నారు. అలాగే ఫీజు పేమెంట్‌కు ప్రస్తుతం ఉన్న బ్యాంకులతో పాటు ఎస్‌బీఐ గేట్ వేను కూడా అనుసంధానం చేయనున్నారు.
‘అకౌంటెంట్’పోస్టుల్లో గందరగోళం
గ్రూప్-2లోని పోస్టు కోడ్ 14, 15, 16 లోని వాటికి అర్హతగా ఆఫీస్ అకౌంటెన్సీతో ఏ డిగ్రీ ఉన్నా అర్హులేనని నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. కానీ ఆఫీస్ అకౌంటెన్సీతో బీఎస్సీ పూర్తిచేసిన వారికి, ఇతర డిగ్రీలు చేసిన వారికి ఆన్‌లైన్ దరఖాస్తులో ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తును సబ్మిట్ చేయగానే అనర్హులుగా చూపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఎకనామిక్స్, కామర్స్, మేథ్స్ సబ్జెక్టులతో ఆఫీస్ అకౌంటెన్సీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా 14, 15, 16 కోడ్‌ల పోస్టులకు ఆప్షన్లు చూపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 540 ఉంటే అందులో 279 పోస్టులు సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్‌లకు సంబంధించినవే కావడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తున్న చే యాలని ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదు. దీనిపై ఏపీపీఎస్సీ వెంటనే స్పందిం చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.