group photo
-
పార్లమెంట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
వాలంటీర్ల మధ్యలో కూర్చున్న సీఎం జగన్
-
వెంకీ కుమార్తె వివాహ వేడుక : చక్కర్లు కొడుతున్నపిక్
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం ఘనంగా ముగిశాయి. అయితే ఈ వేడుకకు సంబంధించి కొన్ని రేర్ ఫోటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో గోప్యంగా జరిగిన వీరి వివాహ వేడుకకి అత్యంత సన్నిహితులు, టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకి రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ అంతా వివాహ వేడుకలో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెంకటేష్, రానా, అక్కినేని నాగ చైతన్య, సమంత, సురేష్ బాబు ఇలా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారంతా ఒకే ఫ్రేములో ఇమిడి వున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు వెంకటేష్ ఇంట జరిగిన పెళ్లిసందడికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రావడం ఒక విశేషమైతే ఇద్దరూ కలిసి కాలు కదపడం మరింత ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ సినిమాలోని పాట మ్యూజిక్‌కి అనుగుణంగా ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. అంతేకాదు వీరికి బల్లాలదేవుడు (రానా) కూడా వీరికి జతకలిపిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా హైదరాబాద్ రేస్‌క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీత వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనుందని తెలుస్తోంది. (చదవండి : ఘనంగా వెంకటేష్ కూతురి వివాహం) -
కేసీఆర్‌తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు..
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుసుకున్నారు. ఆరుగురు కొత్త మంత్రుల చేరికతో కేసీఆర్ కేబినెట్ సంఖ్య 18కి చేరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 18మంది మంత్రులు కేసీఆర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మరోవైపు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. శాఖల కేటాయింపులపై చర్చ జరిగింది. -
మీ సేవలు మరువలేం
జీహెచ్ఎంసీ పాలకమండలికి వీడ్కోలు నేటితో పదవీ కాలం పూర్తి గ్రూప్ ఫొటో దిగిన కార్పొరేటర్లు మేయర్, సభ్యులకు అధికారుల ప్రశంసలు జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మేయర్ సహా పాలక మండలి సభ్యులకు అధికారులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. విందు ఏర్పాటు చేశారు. సభ్యులంతా కలసి గ్రూప్ ఫొటో దిగారు. పార్టీలు, విభేదాలు పక్కన పెట్టి... కాసేపు కులాసా కబుర్లతో గడిపారు. పాలనా కాలంలో తాము అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళా కార్పొరేటర్లు మేయర్, కమిషనర్లతో కలసి ప్రత్యేకంగా ఫొటో దిగారు. కార్పొరేటర్ల సేవలను అధికారులు కొనియాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి గడువు బుధవారంతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులకు అధికారులు మంగళవారం వీడ్కోలు సమావేశం, గ్రూప్ ఫొటో, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదేళ్ల పాటు కార్పొరేటర్లు అందించిన సేవలను కొనియాడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. జీహెచ్ఎంసీ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధికారులకు కార్పొరేటర్లు ఎంతగానో సహకరించార ని గుర్తు చేసుకున్నారు. పాలకమండలి సమన్వయం, సహకారంతోనే ఎన్నో పనులు చేయగలిగామని చెప్పారు. మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కమార్, వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు వాజిద్‌హుస్సేన్(కాంగ్రెస్), నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ)లు మాట్లాడుతూ అధికారులు, కార్పొరేటర్ల సమష్టి కృషితోనే లోటు బడ్జెట్‌తో ఉన్న కార్పొరేషన్ ఆర్థికంగా బలపడిందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సకల జనుల సమ్మె, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు వంటివి జరిగినప్పటికీ, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లామన్నారు. జలమండలి ఎమ్డీ జగదీశ్వర్, ట్రాఫిక్ చీఫ్ జితేందర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు బాబు అహ్మద్, పీఎస్ ప్రద్యుమ్న, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇద్దరు మేయర్ల పాలన 2009 డిసెంబర్4న జీహెచ్ఎంసీ పాలకమండలి కొలువుదీరింది. ఐదేళ్ల కాలాన్ని ఇద్దరు మేయర్లు పంచుకున్నారు.కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం మేరకు ఇద్దరు మేయర్లుగా, ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. బండ కార్తీకరెడ్డి(కాంగ్రెస్), మాజిద్ హుస్సేన్(ఎంఐఎం)లు మేయర్లుగా వ్యవహరించగా.. జాఫర్‌హుస్సేన్(ఎంఐఎం), జి.రాజ్‌కుమార్(కాంగ్రెస్)లు డిప్యూటీ మేయర్లుగా పనిచేశారు. వీరిలో జాఫర్ హుస్సేన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి మూడేళ్లు, ఎంఐఎం అభ్యర్థి రెండేళ్లు మేయర్ పదవిలో ఉండాల్సి ఉంది. మారిన పరిణామాల నేపథ్యంలో ఎంఐఎంకు మూడేళ్లు అవకాశం లభించగా... కాంగ్రెస్‌కు రెండేళ్లు అధికారంలో ఉండే అవకాశం లభించింది. మాజిద్‌హుస్సేన్ నగరానికి 24వ మేయర్ గా వ్యవహరించారు. -
భలే ఆప్స్
చేయి తడితే క్లిక్ క్లిక్ క్లిక్! ఈ రోజుల్లో సెల్ఫీలదే హవా. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీలే సెల్ఫీలు. కానీ గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే? అందంగా పోజిచ్చిన తరువాత క్లిక్ మనిపించాలంటే? ఇంకొకరి సాయం కావాలా? ఊహూ అవసరం లేదంటోంది స్నాప్ క్లాప్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మీ కెమెరాతో ఎన్నో ట్రిక్కులు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టడమే. సెల్ఫీల్లా ఫ్రంట్ కెమెరాతో మాత్రమే కాకుండా ఎక్కువ రెజల్యూషన్ ఉండే ప్రధాన కెమెరాతోనూ ఫొటోలు తీసుకోవచ్చు. ఫొటోకు అవసరమైన లైటింగ్ సరిగా లేకపోతే ఈ అప్లికేషన్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫొటోల ఎడిటింగ్, మిత్రులతో షేరింగ్ వంటివి అదనపు ఫీచర్లు! ఇన్‌స్టాబ్రిడ్జ్‌తో ఫ్రీ వైఫై వీధి వెంబడి వెళుతూంటే ‘‘వైఫై నెట్వర్క్ అవైలబుల్’ అన్న నోటిఫికేషన్లు తరచూ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతూంటాయి. ఈ నెట్‌వర్క్‌లలో కొన్ని ఉచితంగానూ లభించవచ్చు. కానీ ఆ నెట్‌వర్క్‌లేవో తెలియకపోవడం వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేము. ఇన్‌స్టా బ్రిడ్జ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ కొరత తీరిపోతుంది. ఉచిత వైఫై హాట్స్పాట్లను గుర్తించడంతోపాటు ఆయా నెట్‌వర్క్‌ల స్పీడ్‌ను లెక్కకట్టేందుకు, డేటా యూసేజ్‌ను తెలుసుకునేందుకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పాస్వర్డ్ పంచుకోకుండానే వైఫై నెట్‌వర్క్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని కనెక్షన్లకూ క్లౌడ్ బ్యాకప్ ఉండటం మరో విశేషం. ఉచిత వైఫై హాట్స్పాట్లలో సక్రమంగా పనిచేయని వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వదిలించుకోవచ్చు కూడా. బుడతల ఐడియాలకు రూపమిచ్చే ‘మై ఇండియా’ దేశంలోని అనేక సమస్యలపై పిల్లల్లోనూ అవగాహన పెంపొందించేందుకు, వాటిపై తమతమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేందుకు బోధ్‌గురు అనే సంస్థ వినూత్నమైన మొబైల్ అప్లికేషన్లను విడుదల చేసింది. భారత 68వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ అప్లికేషన్లతో చిన్నారులు తమ ఆలోచనలను ఆడియో, వీడియోలతో ఒక పుస్తక రూపంలోకి తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మైగవ్ వెబ్సైట్ స్ఫూర్తితో తాము ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేశామని నాలుగేళ్లు మొదలుకొని 18 ఏళ్ల యువకుల వరకూ ఎవరైనా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. పారిశుద్ధ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై పిల్లలు చిన్న చిన్న కథలు, ఐడియా బుక్‌ల రూపంలో తమ ఆలోచనలను పొందుపరచవచ్చు. ఈ డిజిటల్ ఐడియా బుక్‌ల రూపకల్పనకు కావాల్సిన అంశాలన్నింటినీ అప్లికేషన్లో పొందుపరిచామని కంపెనీ డెరైక్టర్ సమీర్ జైన్ తెలిపారు.