
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం ఘనంగా ముగిశాయి. అయితే ఈ వేడుకకు సంబంధించి కొన్ని రేర్ ఫోటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో గోప్యంగా జరిగిన వీరి వివాహ వేడుకకి అత్యంత సన్నిహితులు, టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకి రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ అంతా వివాహ వేడుకలో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెంకటేష్, రానా, అక్కినేని నాగ చైతన్య, సమంత, సురేష్ బాబు ఇలా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారంతా ఒకే ఫ్రేములో ఇమిడి వున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరోవైపు వెంకటేష్ ఇంట జరిగిన పెళ్లిసందడికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రావడం ఒక విశేషమైతే ఇద్దరూ కలిసి కాలు కదపడం మరింత ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ సినిమాలోని పాట మ్యూజిక్కి అనుగుణంగా ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. అంతేకాదు వీరికి బల్లాలదేవుడు (రానా) కూడా వీరికి జతకలిపిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక‍్కర్లు కొట్టింది.
కాగా హైదరాబాద్ రేస్‌క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీత వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప‍్షన్ ఇవ్వనుందని తెలుస్తోంది. (చదవండి : ఘనంగా వెంకటేష్ కూతురి వివాహం)
Comments
Please login to add a commentAdd a comment