Gudepuvalasa
-
గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలసలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం కోసం సర్వే నిర్వహిస్తున్న అధికారులను గ్రామానికి చెందిన రైతులు అడ్డుకుని... అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని... 30 రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
గూడెపువలసలో ఉద్రిక్తత
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస గ్రామంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం సర్వేయర్లు గ్రామంలో ప్రవేశించారు. ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో సర్వేయర్లతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని... గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులతోపాటు నలుగురు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
విమానం అక్కడ ఎగరదా ...
గూడెపువలస (విజయనగరం జిల్లా) : ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చేది లేదని భోగాపురం మండలం రైతులు స్పష్టం చేశారు. తమ దగ్గరికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎయిర్ పోర్టుకు భూమి ఇస్తే రైతులుగా ఉన్న తాము కూలీలుగా మారిపోతున్నామని కె. బుజ్జి అనే మహిళ వాపోయింది. ఆమె ఇంకా ఏమందంటే.... 'మాకు ఇక్కడ రెండు ఎకారాల భూమి ఉంది. మా ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు రైతుగా ఉన్నాం. మా భూమి ఇచ్చేస్తే ఏం చేయాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములే లాక్కుంటారా.... మీ పార్టీ నాయకుల భూములు మీకు కనబడటం లేదా... విమానాలు మా భూములమీదే ఎగురుతాయా, వేరే చోట విమానాలు ఎగరవా. గంజినీళ్లలో ఏముంటుంది. భూములు లాక్కోవడానికి చంద్రబాబు కంటే పెద్ద నాయకులే వెనుకంజ వేస్తున్నారు. మా భూములు లాక్కుంటే ఏమొస్తుంది? అయ్యా చంద్రబాబూ... మీ ఆలోచనలతో చాలా మంది నష్టపోతున్నారు. మా భూములు లాక్కుని... మీరు వేసే ముష్టి మాకెందుకు. భూములు విషయంలో గత నెలరోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా... మా ప్రాంత వాసులు నిరాహార దీక్ష చేస్తుంటే పలకరించిన నాయకుడు ఒక్కడూ లేడు' అని బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు. -
విమానం అక్కడ ఎగరదా ...
-
ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?
విజయనగరం : మా ఊరుకు ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది. సోమవారం విజయనగరం జిల్లా ఎ రావివలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం గూడెపువలస గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మాట్లాడే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ క్రమంలో నర్సాయమ్మ మాట్లాడుతూ....తాము ఇద్దరం అక్కాచెల్లిళ్లమని... తనకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తామకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని తెలిపారు. ఆ భూమే తమకు జీవనాధారమన్నారు. ఈ భూమిని కూడా తీసుకుంటే తమకు జీవనోపాధి కోల్పోతామని ఆమె కన్నీటిపర్యంతమైయ్యారు. మాకు ఎయిర్పోర్ట్ వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది. కావాలంటే ప్రాణాలైన ఇస్తాం కానీ... భూములు మాత్రం ఇవ్వమని నర్సాయమ్మ తెలిపింది. -
ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే
గూడెపువలస (భోగాపురం): మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం పరిశీలించింది. బృంద సభ్యు లు గ్రామంలోని ప్రభుత్వ భూమి వివరాలను రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 2560 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించా రు. ఈ మేరకు సదరు భూమి ప్లాన్ను గూగుల్ మ్యాపు ద్వారా పరిశీలించారు. ఆ ప్రాంతంలో గాలి దిశ ఏవిధంగా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించా రు. స్థలం సమీపంలో భారీ విద్యుత్ లైన్లు, కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు ఉన్నాయూ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బృం దానికి కలెక్టరు ఎం.ఎం నాయక్ పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులతో పాటు ఆర్డీఓ వెంకటరావు, తహశీల్దార్ జనార్ధనరావు, సర్వేయరు పాల్దాస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.