ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ? | Narsayyamma takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

Published Mon, Oct 5 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

ఎర్ర బస్సే రాదు ... ఎయిర్ పోర్ట్ ఎందుకు ?

విజయనగరం : మా ఊరుకు ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది. సోమవారం విజయనగరం జిల్లా ఎ రావివలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు.

అనంతరం గూడెపువలస గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మాట్లాడే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ క్రమంలో నర్సాయమ్మ మాట్లాడుతూ....తాము ఇద్దరం అక్కాచెల్లిళ్లమని... తనకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తామకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని తెలిపారు.

ఆ భూమే తమకు జీవనాధారమన్నారు. ఈ భూమిని కూడా తీసుకుంటే తమకు జీవనోపాధి కోల్పోతామని ఆమె కన్నీటిపర్యంతమైయ్యారు. మాకు ఎయిర్పోర్ట్ వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది.  కావాలంటే ప్రాణాలైన ఇస్తాం కానీ... భూములు మాత్రం ఇవ్వమని నర్సాయమ్మ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement