
గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలసలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం కోసం సర్వే నిర్వహిస్తున్న అధికారులను గ్రామానికి చెందిన రైతులు అడ్డుకుని... అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని... 30 రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.