నేడు ఒబామా ‘యూనియన్’ ప్రసంగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ఎనిమిదేళ్ల అధ్యక్ష పదవీ కాలంలో ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’లో మంగళవారం చివరి ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సతీమణి మిషెల్ ఒబామా భారతీయ అమెరికన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఆహ్వానించారు. అమెరికా మొదటి పౌరురాలికి చెందిన గెస్ట్ బాక్స్‌లో తుపాకీ హింస బాధితుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. భయానక తుపాకీ హింసకు జీవితాలు తారుమారై వికలాంగులుగా జీవిస్తున్న అమెరికన్లకు మద్దతుగా ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొంది.
48 ఏళ్ల సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ సంస్థ కే-12 క్లాస్రూంలు, ‘టీచ్.ఓఆర్జీ’ ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ప్రోత్సాహాన్నిస్తూ కంప్యూటర్ సైన్స్‌ను ఎక్కువ మందికి అందేలా పనిచేస్తూ లీడర్‌గా అవతరించిందని వైట్‌హౌజ్ తెలిపింది.