గూగూడు బ్రహ్సోత్సవాలకు ప్రత్యేక బస్సులు
అనంతపురం న్యూసిటీ : గూగూడు బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భట్టు చిట్టిబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాలకు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం నుంచి 260 బస్సులు తిప్పుతామన్నారు. ఈ నెల 10న చిన్న సరిగెత్తు సందర్భంగా అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. 11వ తేదీ 42 సర్వీసులు, 12న 90 సర్వీసులు, 13న 90 సర్వీసులు వివిధ ప్రాంతాల నుంచి గూగూడు నడుపుతున్నామన్నారు.
గూగూడులోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామనీ, అక్కడ డివిజినల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు డీఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గూగూడు దేవస్థానం పరిసర ప్రాంతంలో టెంట్లు వేస్తామన్నారు. అనంతపురం నుంచి గూగూడుకు రూ. 47, తాడిపత్రి నుంచి గూగూడుకు రూ.66, ధర్మవరం నుంచి గూగుడుకు రూ.66 టికెట్ ధర ఉంటుందన్నారు.