GUNADALA Mata celebrations
-
గుణదల మేరీ మాత ఆలయంలో వందేళ్ల సంబరాలు
-
రేపటి నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు
సాక్షి, ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్ జనరల్ మోన్సిన్యోర్ మువ్వల ప్రసాద్ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. -
గుణదల మేరీ మాత ఉత్సవాలు
గుణదల(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికుల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, రైల్వే అధికారులు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో పలు రైళ్లు నిలిచేందుకు అనుమతి ఇచ్చారు. పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్ గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా.. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే మేరీ మాత ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. గుణదల స్టేషన్లో నిలిచే రైళ్లు.. ► రైలు నంబర్ 17289 తిరుపతి–కాకినాడ టౌన్ ►రైలు నంబర్ 17250 కాకినాడ టౌన్–తిరుపతి ►రైలు నంబర్17257 విజయవాడ–కాకినాడ పోర్టు ►రైలు నంబర్ 17258 కాకినాడ పోర్టు–విజయవాడ ►రైలు నంబర్ 07768 విజయవాడ–రాజమండ్రి ►రైలు నంబర్ 07767 రాజమండ్రి–విజయవాడ రామవరప్పాడు స్టేషన్లో నిలిచే రైళ్లు.. ►రైలు నంబర్ 07867 మచిలీపట్నం–విజయవాడ ►రైలు నంబర్ 07861 విజయవాడ–మచిలీపట్నం. -
మరియమాత స్మరణలో గుణదల కొండ
గుణదల (విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండు రోజులుగా జరుగుతున్న మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజైన బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. లక్షలాదిగా వచ్చిన యాత్రికులు మరియమాత దర్శనం కోసం బారులు తీరారు. మరియమ్మ నామ స్మరణతో గుణదల కొండ మార్మోగింది. భక్తులు కొండ పైన కొలువుదీరిన మరియతల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో డయాసిస్ గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు కథోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవ.మోజెస్ దొరబోయిన ప్రకాశం మాట్లాడుతూ.. లోకమాతగా నీరాజనాలందుకుంటున్న మరియమాతను ఆశ్రయించి ఆమె దీవెనలు పొందాలని కోరారు. అనంతరం సమష్టి దివ్యబలిపూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ డయాసిస్ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన దివ్యబలి పూజలో విశాఖపట్నం బిషప్ మల్లవరపు ప్రకాష్ హాజరై దేవుని వాక్య సందేశం అందించారు. -
మరియమాతా.. వందనం
ఘనంగా ప్రారంభమైన గుణదల మాత మహోత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు గుణదల : గుణదల మాత మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసీ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా పీఠంపై ఏలూరు పీఠం మోన్సిజ్ఞోర్ తోట గాబ్రియేల్, విజయవాడ కతోలిక పీఠం మోన్సిజ్ఞోర్ పుణ్యక్షేత్రం రెక్టర్ ఎం. చిన్నప్ప, చాన్సలర్ ఫాదర్ జె. జాన్‌రాజు, సోసల్ సర్వీస్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, కేథలిక్ డయోసిస్ కోశాధికారి ఎం. గాబ్రియేల్ తదితర గురువులు దివ్యబలిపూజ సమర్పణ చేసి మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. పదిగంటలకు ఫాదర్లు లాము జయరాజ్, పసల థామస్లచే దివ్యసత్ప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థనలు జరిగాయి. 11గంటలకు భక్తుల కోసం ఫాదర్ జోజిబాబు దివ్యపూజాబలిని సమర్పించారు. సాయంత్రం 6గంటలకు ఏలూరు కతోలిక పీఠం మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర సమష్టి దివ్యపూజాబలిని సమర్పించారు. ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేరతో పాటు విజయవాడ పీఠం ఇన్చార్జి బిషప్ గోవిందు జోజి పాల్గొన్నారు. తొలిరోజు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరియమాత స్వరూపం వద్ద, కొండ శిఖరాన క్రీస్తు శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుణదల ప్రేయర్ టీమ్ వారి భక్తి కీర్తనలు ఆహూతులను భక్తి తన్మయత్వంలో ముంచాయి. భారీగా అన్నదానం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫుణ్యక్షేత్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రసాదం స్వీకరించారు. బనిగండ్లపాడు బృందం చేసిన కోలాట ప్రదర్శనను ఫాదర్ టీ అగస్టీన్ పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను పరవశింపచేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా నిర్వహించిన కార్యక్రమాలను చిన్నా పెద్ద ఉత్సాహంగా తిలకించారు.భక్తులు భారీగా రావడంతో కొబ్బరికాయ ధరలు సైజును బట్టి 15 నుంచి 30 వరకు పలికాయి. అలాగే క్యాండిల్స్ పది నుంచి 50 రూపాయల వరకు అమ్మారు. మాస్క్‌లతో విధులు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తదితర సిబ్బంది మాస్క్‌లను ధరించి విధులను నిర్వహించారు. అలాగే దర్శనానికి వచ్చిన భక్తులు సైతం కొంతమంది మాస్క్‌లతోనే పూజలు చేశారు. కనులపండువగా తేరు ప్రదక్షిణ గుణదలమాత తేరు ప్రదక్షిణ ఘనంగా సాగింది. పూలతో అలంకరించిన పల్లకీలో మరియమాతను ఉంచి పురవీధుల్లో మేళతాళాలు, డప్పువాయిద్యాలు, కోలాట నృత్యాలు, భక్తి ప్రార్థనల నడుమ ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, కార్పొరేటర్ బొప్పన భవకుమార్ పల్లకీ మోశారు. కార్యక్రమంలో రెక్టర్ ఎం. చిన్నప్ప, పెద్ద సంఖ్యలో గురువులు పాల్గొన్నారు.