Guntakal railway junction
-
దయచేసి వినండి.. ఈ రైలు ఎప్పుడూ లేటే !
సాక్షి, గుంతకల్లు: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. తిరుపతి ప్యాసింజర్ రైలును కదిరిదేవరపల్లి వరకు పొడిగించడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. కదిరిదేవరపల్లి – తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైలు (నం–57477/78)కు అత్యంత చౌక ధరతో తిరుపతి వెళ్లేవారికి ఎంతో అనుకూలం. దీంతో ఈ రైలు ప్రయాణం పట్ల వెంకన్న భక్తులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఈ ప్యాసింజర్ రైలు గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 5.45 వచ్చి 6.00 గంటలకు వెళ్లాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ రైలు ఏ రోజూ కూడా సరైన సమయానికి రాలేదు. గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 7.00లకు పైగా చేరుకుంటుంది. దీంతో నిత్యం వందల మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులతో పాటు విధులు ముగించుకొని అనంతపురం వెళ్లే రైల్వే ఉద్యోగులు కూడా ఈ రైలు సమయానికి రాకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. గడిచిన మంగళవారం, బుధ, గురు, శుక్రవారల్లో ఈ రైలు గుంతకల్లు జంక్షన్‌కు రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటలకు చేరుకొని అనంతపురానికి రాత్రి 10.30 గంటలపైనే చేరుతోంది. దీంతో నిత్యం వందలాది మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులు, విధులు ముగించుకొని అనంతపు రం వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ప్రతి రోజూ ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నామని రైల్వే ఉద్యోగులు వాపోతున్నారు. అలాగే గుంటూరు – విజయవాడ రైలు పరిస్థితి కూడా ఇలాగే మారింది. గుంతకల్లుకు సాయంత్రం 5.00 గంటలకు చేరుకోవాల్సి ఉండగా ఏరోజూ సమయానికి రావడం లేదు. ఇలా గుంతకల్లు మీదుగా నడిచే ప్రతి ప్యాసింజర్ రైలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రైల్వే అధికారులు కూడా ప్యాసింజర్ రైళ్ల పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్యాసింజర్ రైలులో ప్రయాణించి ఆలస్యంగా గమ్యస్థానాలను చేరుతుంటే ప్రత్యామ్నయంగా బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణమంటేనే బేజారు ! మాది డోన్ . తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్ రైలు ఎంతో అనుకూలమాని ఎప్పడూ ఈ రైలులోనే వెళ్తుంటా. అయితే ఎప్పుడు తిరుపతికి వెళ్తినా ఈ రైలు మాత్రం సమయానికి రావడం లేదు. దీంతో ఈ రైలులో ప్రయాణించాలంటేనే బేజారొస్తోంది. ఎప్పుడూ ఇది ఆలస్యంగానే వస్తుంది. – అనంతరాములు, ప్రయాణికుడు,డోన్ ఆలస్యంగా ఇంటికి చేరుతున్నా నేను డీఆర్ఎం కార్యాలయంలో పని చేస్తున్నా. ప్రతిరోజూ అనంతపురం నుండి గుంతకల్లుకు వస్తుంటా. సాయంత్రం పని ముగించుకొని అనంతపురం వెళ్లేందుకు కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్‌కు వెళ్తా. అయితే ఈ మధ్య కాలంలో రైలు సమయానికి రావడం లేదు. దీంతో రోజూ రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరాల్సి వస్తోంది. – వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగి -
రైలుబండి.. జగమొండి
గుంతకల్లు: ఆ రైలుకు అర్ధరాత్రి అంటే ఎంతో ఇష్టమున్నట్లుంది. అందుకే సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకోవాల్సిన ఈ రైలు... తన జీవిత కాలంలో ఏనాడూ సమయానికి గమ్యం చేరిన దాఖలాలు లేవు. విసిగి వేసారిన ప్రయాణీకులు అసహనంతో ఆ రైలుకు ఓ ముద్దు పేరు పెట్టారు. అదే దెయ్యాల బండి. ఈ బండిని ఎక్కాలంటే ప్రయాణీకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఉదయం 10.00 గంటలకు బయలుదేరే ఈ ప్యాసింజర్ రైలు... అనేక స్టేషన్లు దాటుకొని సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు చేరాల్సి ఉంది. అయితే స్టేషన్లో ప్లాట్‌ఫాంల కొరత, క్రాసింగ్‌లు, చైను లాగడాలు తదితర కారణాల వల్ల ఏనాడూ ఈ రైలు అనుకున్న సమయానికి గుంతకల్లుకు చేరలేదు. ఎటు తిరిగి సరిగ్గా అర్ధరాత్రి సమయానికి గుంతకల్లు రైల్వే జంక్షన్ చేరి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంది. దీంతో ముఖ్యంగా మహిళలు ఈ రైలు ఎక్కాలంటేనే భయపడిపోతారు. సిగ్నల్స్ అందక స్టేషన్ బయట పొలాల్లో గంటల తరబడి నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఊరి బయట చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలే భద్రత కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైలులో ప్రయాణించే అరకొర ప్రయాణికులు రాత్రివేళ ఒకే పెట్టెలోకి చేరుకొని పరస్పర దైర్యం చెప్పుకునే ఘటనలు సర్వసాధారణంగా మారాయి. } గుంతకల్లు రైల్వే జంక్షన్ ఔటర్లో నిలిచిపోయిన కాచిగూడ ప్యాసింజర్ ఔటర్‌లోనే ఆగిపోతుంది కాచిగూడ నుంచి ఇప్పుడా..అప్పుడా అన్నట్లు పరిగెత్తుకు వచ్చే ఈ ప్యాసింజర్...గుంతకల్లు సమీపించే కొద్ది మారాం చేస్తుంది. సిగ్నల్స్ అందక గంటల కొద్దీ (డీఆర్ఎం కార్యాలయ సమీపంలో) ఔటర్‌లోనే నిలిచిపోతుంది. నిరీక్షించే ఓపిక నశించిన ప్రయాణికులు రైలు దిగి ముళ్లకంపల మధ్య నడుచుకుంటూ ఇళ్లకు వెళుతుంటారు. ట్రాక్‌పై కంకర మధ్య నడుచుకుంటూ జారిపడిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా 9.00 గంటలకు గుంతకల్లు సమీపానికి చేరుకున్న ఈ రైలు ఔటర్ నుంచి జంక్షన్లోకి 11.00 గంటలకు చేరింది. సుమారు 2 గంటలపాటు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ చిమ్మచీకట్లోనే గడిపారు. నరకం అనుభవించాం డోన్ నుంచి గుంతకల్లుకు ఈ రైలులో ప్రయాణం చేశా. సాయంత్రం 7.00 గంటలకు డోన్‌లో కదిలితే గుంతకల్లు ఔటర్‌కు 9.15 గంటలకు చేరుకుంది. మరో 10 నిమిషాల్లో ఇంటికెళ్లొచ్చు అని అనుకున్నా..కానీ గంటల కొద్దీ రైలును నిలిపి వేశారు. – రాజు, ప్రయాణికుడు ముళ్లపొదల్లో నడిచా కాచిగూడ ప్యాసింజర్ రైలును గుంతకల్లు పట్టణ సమీపాన నిలిపి వేశారు. గంటల కొద్దీ కదలకపోవడంతో రైలు దిగి మొనతేలిన కంకర రాళ్ల మధ్య నడుచుకుంటూ ముళ్ల కంపలను దాటుకుంటూ రోడ్డున పడ్డాను. –లక్ష్మీదేవి, ప్రయాణికురాలు -
సైకో.. దెబ్బకు రైల్ రోకో
గుంతకల్లు: ఓ సైకో తన విపరీత చేష్టలతో రైల్వే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని చేష్టల కారణంగా గుంతకల్లు రైల్వే జంక్షన్ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సికింద్రాబాద్ నుం చి బయల్దేరిన ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరింది.ఈ రైలును యార్డులో క్లీనింగ్ నిమిత్తం నిలిపారు. బోగీలు, బాత్రూంలను శుభ్రపరచడానికి వెళ్లిన క్లీనింగ్ బాయ్స్ ఓబోగీలోని బాత్రూం లోపలివైపున గడియ వేసుకొని ఓ వ్యక్తి కేకలు పెడుతుండటాన్ని గుర్తించారు. అతని చేతిలో ఇనుపరాడ్, కత్తి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచా రమిచ్చారు. వారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సైకో ఉన్న లావెట్రీ తలుపులు తీయడానికి ప్రయత్నించారు. స్పందన రాలేదు. దీంతో పోలీసులు కిటికీ వద్దకు చేరుకొని అతని వివరాలు ఆరా తీశారు. తన పేరు నరసింహ అని, సికింద్రాబాద్‌లోని కొత్తపేట అని చెప్పాడు. బుధవారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండడంతో చివరకు ఓ పోలీసును బోగీ వద్ద కాపలా ఉంచి వెళ్లిపోయారు. అతనికి ఆకలిగా ఉందని చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చి కిటికీలో నుంచి సైకోకు అందించాడు. టిఫిన్ తిన్నాక... కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నారని గుర్తించిన సైకో బాత్రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. అప్పటికే బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఉడాయించాడు.