gunthakallu
-
ఆక్సిజన్ వచ్చేసింది.. తాడిపత్రికి చేరిన స్పెషల్ రైలు
సాక్షి, తాడిపత్రి: ఆక్సిజన్ స్పెషల్ రైలు డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్ చేరినట్లు డీఆర్ఎం అలోక్‌తీవారి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ అత్యవసరమైందన్నారు. దీంతో 32 స్పెషల్ ఆక్సిజన్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు తరలించారన్నారు. టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ స్పెషల్ రైలు మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు చేరిందన్నారు. మొత్తం 10 గూడ్స్ వ్యాగన్లలో(బూస్ట్ వ్యాగన్)లో 100 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ కంటైనర్ల ద్వారా అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆక్సిజన్ తరలించామన్నారు. చదవండి: గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు గుంతకల్లు : వ్యాగిన్ల నుంచి ఆక్సిజన్‌ను ట్యాంకర్లలోకి నింపుతున్న దృశ్యం -
క్రేన్‌పై నుంచి పడి పెయింటర్..
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : క్రేన్‌పై నుంచి పడి ఓ పెయింటర్ దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని మోదీనాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మోదీనాబాద్లోని హంపయ్యబాబు కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రాజశేఖర్, ప్రమీల దంపతులకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిచంద్(20) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్ సమీపంలో రైల్వే అధికారులు నిర్మిస్తున్న గోల్ఫ్ కోర్టు (క్రీడా మైదానం)లో పనికి వెళ్లాడు. ఈ క్రీడా మైదానం ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన స్తంభానికి సాయిచంద్, తన సన్నిహితుడు హుసేనప్పతో కలిసి క్రేన్‌కు లింకప్ చేసిన బక్కెట్లో నిలబడి పెయింటింగ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి పెయింటర్స్ నిలబడిన బకెట్ హుక్ తెగిపోయింది. ఈ ఘటనలో 15 అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ కాలువపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ బండపై పడ్డారు. ప్రమాదంలో సాయిచంద్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. హుసేనప్ప కుడి చేయి విరిగి బలమైన రక్తగాయాలయ్యాయి. సాయిచంద్ మృతదేహాన్ని, గాయపడిన హుసేనప్పను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మిన్నంటిన రోదనలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మృతుడు సాయిచంద్ కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న కొడుకు మృతి చెందడంతో సాయిచంద్ తల్లి ప్రమీళమ్మ స్పృహ కోల్పోయింది. -
అమ్మంటే.. పెన్షన్ డబ్బు కాదు!
‘అమ్మ’ంటే ఆట బొమ్మకాదు..అవసరాలు తీర్చే ‘ఆయా’ కానేకాదు..ప్రేమకు ప్రతి‘రూపం’.. సృష్టిలో అపురూపంతరాలు మారినా ఆధునికత పెరిగినా మనిషిలోనైనా మట్టి ముద్దలోనైనా.. ఏ వయసులోనైనా అమ్మ దేవత.ఆకలేస్తే ఉగ్గు పాలలో అమ్మ.. నిద్దరొస్తే జోలపాట అమ్మ..దయాగుణంలో ధరిత్రిలా.. ప్రేమానురాగాల పవిత్రమూర్తి..అమ్మ శాశ్వతం.. ఆమె ప్రేమ శాశ్వతం..అమ్మ అనాథ కాదు..అద్దంలో రూపం కాదు.. మాంసం ముద్ద అసలే కాదు..‘అమ్మ’ను విస్మరిస్తే శాపం..లోకం క్షమించదు ఈ పాపం. గుంతకల్లు: కుమారుడి ఆదరణ లేక ఓ తల్లి తనువు చాలించిన ఘటన పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రిటైర్డు ఆర్పీఎఫ్ సూర్యనారాయణ, పార్వతీబాయి(72) దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మోహన్‌రావు బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకోబ మతిస్థిమితం లేక ఊరూరు తిరిగేవాడు. ఐదేళ్ల క్రితం సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతీబాయి భర్త పెన్షన్‌తో జీవిస్తుండేది. పెళ్లి అయిన మోహన్ భార్యాపిల్లలతో వేరు కాపురం పెట్టాడు. నెల నెలా మొదటి వారంలో తల్లి పార్వతీబాయిని బ్యాంకుకు పిలుచుకువెళ్లి పెన్షన్ సొమ్ము డ్రా చేసుకొని తల్లిని ఇంటి వద్ద వదిలివెళ్లేవాడు. ఆమె బాగోగులు పట్టించుకునే వాడు కాదు. మూడు రోజులుగా చలితీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గురువారం ఉదయం మృతి చెందింది. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుమారుడు మోహన్‌ను పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. -
అభివృద్ధి కూతపెట్టేనా?
గుంతకల్లు రైల్వే జోన్ ఈ ప్రాంత వాసుల కల. రాష్ట్ర విభజన తర్వాత గుంతకల్లు జోన్ కోసం ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న (శుక్రవారం) ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ‘అనంత’ వాసులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రైల్వే అధికారులు కూడా డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. అయితే కేంద్రం ఎన్నింటిని పరిగణలోకి తీసుకుంటుంది...ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అనంతపురం, గుంతకల్లు : రానున్న రోజుల్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాల పెంపు, ట్రాక్ భద్రత, రైల్వే ఉద్యోగులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై గుంతకల్లు డివిజన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే రూ. వందల కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. అయితే రైల్వే శాఖ మాత్రం అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1.19 ఎకరాల్లో రైల్వే వాణిజ్య సముదాయం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే వాణిజ్య సముదాయం ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానం ఆనుకొని ఉన్న 1.19 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఎల్సీ గేట్ల మూసివేతకు శ్రీకారం ఇప్పటికే దాదాపు 116 కాపలా లేని ఎల్సీ గేట్లు ఎత్తివేసి భారతీయ రైల్వేలో గుంతకల్లు డివిజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే తరహాలో ప్రమాదరహిత రైల్వే డివిజన్‌గా గుంతకల్లును తీర్చిదిద్దడంలో భాగంగా కాపలా ఎల్సీ గేట్లు (మ్యాన్డ్ ఎల్సీ గేట్లు) మూసివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. డివిజన్ పరిధిలోని 30 ప్రాంతాల్లో మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయనీ, ఇందుకు గాను రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. అదే విధంగా ట్రాక్భద్రతకు రూ. 157 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో డివిజన్ వ్యాప్తంగా అవసరమైన 31 ప్రదేశాల్లో స్లీపర్స్, రెయిల్స్ ఏర్పాటు పనులు చేపట్టాలని భావించారు. డివిజన్ పరిధిలో 1,438 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లున్నాయి. రైల్ ప్లైఓవర్‌కు ప్రతిపాదనలు గుంతకల్లు జంక్షన్ సమీపంలోని మల్లప్పగేటు నుంచి నంచర్ల వరకు రైల్ ఫ్లై ఓవర్ ఏర్పాటుకు డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్లై ఓవర్ మధ్య దూరం ఎంత? ఎంతమేర నిధులు అవసరమువుతాయి? ఈ ప్లై ఓవర్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే బోర్డుకు వివరించారు. అదేవిధంగా గుంతకల్లు జంక్షన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలను, 3, 4 ప్లాట్ఫారాలతో కలిపేందుకు కూడా ప్రతిపాదనలు పంపారు. ఉద్యోగులకు సౌకర్యాల కల్పనకు వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు కనీస సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసే చర్యలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పది ప్రాంతాల్లో నూతనంగా స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటు, పాత క్వార్టర్ల మరమ్మతులకు రూ.54 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. గుంతకల్లు, తిరుపతి, రేణిగుంట, ధర్మవరం, డోన్, ముద్దనూరు, కడపలో టీటీఈ విశ్రాంత గదుల ఏర్పాటుకు, రాయచూరులో 60 పడకలతో రన్నింగ్ రూం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. భద్రతా చర్యల్లో భాగంగా రాయచూరులోని గూడ్స్ షెడ్‌ను యర్మరస్ తరలించేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గుత్తి, అనంతపురం రైల్వేస్టేషన్లరూపురేఖలు మారేనా? ♦ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైల్వేకు సంబంధించి గుత్తి, అనంతపురం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ముఖ్యంగా.. రూ.15 కోట్లతో అనంతపురం రైల్వేస్టేషన్ పశ్చిమ భాగాన నూతన భవనం ఏర్పాటుకు అనుమతులు కోరారు. ♦ ప్లాట్ఫారం–1 ఆధునికీకరణకు రూ. 8.65 కోట్లలు కేటాయించాలని కోరారు. ♦ గుత్తి రైల్వే జంక్షన్లో ఉన్న 2 ప్లాట్‌ఫారాలకు అదనంగా మరికొన్ని నిర్మించేందుకు, ♦ గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం, స్టేషన్ ప్రాంగణం అభివృద్ధికి రూ.2.37 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ♦ ప్రయాణికుల సౌకర్యార్థం గుత్తి జంక్షన్లో రూ.66 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చారు. ♦ తాడిపత్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోటి రూపాయలతో అంచనాలు. ♦ డివిజన్ పరిధిలోని చిత్తూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ 2.35 కోట్లు కేటాయించాలని కోరారు. ♦ రేణిగుంటకు రూ 1.60 కోట్లు, శ్రీకాళహస్తికి రూ 2.47 కోట్లు, రాయచూరు స్టేషన్ అభివృద్ధికి రూ 1.26 కోట్లతో ప్రతిపాదనలు. ♦ ధర్మవరం, డోన్, ఆదోని, మంత్రాలయంరోడ్డు రైల్వేస్టేషన్లలో ట్రైన్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటుకు రూ 3.75 కోట్లతో ప్రతిపాదనలు. ♦ తిరుపతి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్‌ఫారాల కోసం రూ.76 కోట్లతో ప్రతిపాదనలు. ♦ తిరుపతి – వెస్ట్ తిరుపతి మధ్య ప్రత్యేక రైల్వే లైన్ కోసం రూ 19కోట్లు. ఈ పనుల్లో భాగంగా భూ సేకరణకు రూ.43 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రత, మౌలిక వసతులకు పెద్దపీట ప్రయాణికుల భద్రత, మౌలిక వసతుల కల్పన, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సిబ్బంది వసతి సదుపాయాలకు ప్రతిపాదనలు పంపాం. ఎంపీ, డీఆర్‌యూసీసీ సూచనలు, స్థానికుల వినతుల మేరకు కొత్త రైళ్లకూ ప్రతిపాదనలు పంపాం. డివిజన్లోని మేజర్ ప్రాజెక్టులంటికీ జోనల్ స్థాయి అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించాం. – విజయప్రతాప్‌సింగ్, డీఆర్ఎం -
రైల్వే ఉద్యోగులూ తస్మాత్ జాగ్రత్త!
‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీకు నెల జీతం బ్యాంకుకు పంపించడంలో సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ వివరాలు చెబుతారా..?’’ – గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులకు వారం రోజుల్లో తరచూ వస్తున్న ఫోన్ కాల్ సారాంశమిది. అనంతపురం, గుంతకల్లు: ఆన్లైన్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిన్నటి వరకు బ్యాంకు ఉద్యోగుల పేరుతో వినియోగాదారులకు ఫోన్ చేసి వారి అంకౌట్ నంబర్లు, ఏటీఎం వివరాలు తెలుసుకొని ఖాతాలోని సొమ్మును కాజేసేవారు. దీనిపై జనం చైతన్యవంతులు కావడంతో... ఇపుడు కొత్తగా రైల్వో ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. రైల్వే సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ పేరుతో గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు తిరుపతి, రేణిగుంట, రాయాచూర్ తదితర ప్రాంతల్లోని రైల్వే ఉద్యోగుల మొబైల్ నంబర్లుకు ఫోన్లు చేస్తున్నారు... ‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీ జీతం బ్యాంకులో వేసేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ బ్యాంకు అకౌంట్ నంబర్...ఏటీఎం కార్డుపై ఉన్న 16 సంఖ్యల నంబర్, పేరు, సీవీవీ నంబర్ చెప్పండి’’ అని ఆన్లైన్ మోసగాళ్లు ఉద్యోగులపై వల వేస్తున్నారు. గత వారం రోజులు నుంచి పదులు సంఖ్యలో ఉద్యోగులకు ఈ తరహా కాల్స్ వచ్చాయి. అయితే ఉద్యోగులు కొందరు అప్రమత్తంగా ఉండడంతో ప్రస్తుతానికి ఎవరికీ ఇబ్బంది తలెత్తలేదు. మరోవైపు సీనియర్ డీఎఫ్ఎం చంద్రశేఖర్‌బాబుకు ఈ సమాచారం అందడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అకౌంట్స్ విభాగం ఉద్యోగుల నుంచి గానీ, బ్యాంకుల నుంచి గానీ ఎవరూ బ్యాంకు ఖ>తాల వివరాలు అడగరని ఉద్యోగులు గుర్తించాలన్నారు. ఉద్యోగులు తమ బ్యాంకు ఖ>తా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పకూడదుని ఆయన సూచించారు. -
గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి
గుంతకల్లు: గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి హోదానిస్తూ రూ.25 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ స్టేషన్‌కు మహర్దశేనని రైల్వేవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం ఆరు రైల్వేస్టేషన్లకు, రాయలసీమలో గుంతకల్లు, కర్నూలు స్టేషన్లకు అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్లో రూ.6 కోట్లతో మోడల్ స్టేషన్ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో మార్పులు చేర్పులు చేసి అంతర్జాతీయ స్థాయిలో భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులు పంపిన నమూనాలు పరిశీలిస్తే అవి విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. మోడల్ స్టేషన్ బిల్డింగ్ దక్షిణం వైపున నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాలపైగా స్థలం ఉంది. అందులో పార్కులు, పౌంటెయిన్లు, ఇతరత్రా అందమైన కళాకృతులు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఊహాత్మక నమూనాలను బోర్డు అనుమతికి పంపారు. అదేవిధంగా స్టేషన్లో ఎస్కలేటర్లు, వైఫై సదుపాయం, ఆధునిక ఎలక్ట్రికల్ డిస్ప్లే తదితర హంగులతో గుంతకల్లు రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. -
1400 ఏళ్లనాటి ప్రవక్త వస్తువుల ప్రదర్శన
-
గుంతకల్లులో దుండగడి వీరంగం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆదివారం ఓ దుండగుడు వీరంగం సృష్టంచాడు. రెండు ఇళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇసుక ధర తగ్గించాలని ధర్నా
అనంతపురం: ఇసుక ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ సంఘం, పెయింటర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంతకల్లులో గురువారం భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీరప్ప గుడి సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు దాదాపు మూడు కిలో మీటర్లు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. ధర్నాలో వైఎస్సార్ సీపీ నాయకులు వై.సుధాకర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు ఉమారెడ్డి పాల్గొన్నారు. (గుంతకల్లు) -
వార్ వన్‌సైడేనా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనా..? అధిక శాతం డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు టీడీపీ, కాంగ్రెస్‌లు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేవా? అనంతపురం నగర పాలక సంస్థసహా సింహ భాగం మున్సిపాల్టీలు, నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంటెలిజెన్స్ నివేదికలూ అదే సూచిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌లు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల ఫలితాలు సైతం రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తింటే.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాలను ప్రకటించనున్న విషయం విదితమే. టీడీపీ ఆవిర్భావం నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటూ వస్తోంది. 1985, 1990, 1995, 2000, 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బ తినడమే అందుకు తార్కాణం. జిల్లాలో 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోకపోవడమే అందుకు తార్కాణం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నగరాల్లోనూ పట్టణాల్లోనూ టీడీపీ అత్యంత బలహీనంగా ఉందన్నది విస్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో టీడీపీ మరింత బలహీనపడింది. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీడీపీ.. పదేళ్లుగా అధికారానికి దూరమైన టీడీపీ ఏనాడూ ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం చేసి నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషించిన దాఖలాలు లేవు. పైగా రాష్ట్ర విభజనలో ప్రజల మనోభిప్రాయాలను దెబ్బతీసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆధారంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలిచింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యవాదులు టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను ఉద్యమంలో పాల్గొననివ్వకుండా తరిమికొట్టారు. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమబావుటా ఎగుర వేశారు. జైల్లో ఉన్నప్పుడు ఒకసారి.. హైదరాబాద్‌లో మరోసారి సమైక్యాంధ్ర నినాదంతో ఆమరణ దీక్ష చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో నేతల మద్దతు కూడగట్టారు. తమ మనోభిప్రాయాలను గౌరవించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజానీకం బాసటగా నిలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీ రామారావు టీడీపీని స్థాపిస్తే.. ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగు ప్రజలను వంచించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అభివృద్ధికి బాటలు వేసిన వైఎస్.. అనంతపురం నగర పాలక సంస్థతోపాటు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి, ధర్మవరం, హిందూపురం మున్సిపాల్టీల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. వేసవిలో పానీపట్టు యుద్ధాలు తప్పేవి కాదు. కానీ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,075 కోట్ల వ్యయంతో తాగునీటి పథకాలు చేపట్టి నగర, పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి, మడకశిర నగర పంచాయతీ ప్రజల దాహార్తిని కూడా వైఎస్ తీర్చారు. అనంతపురం కార్పొరేషన్ సహా 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇళ్లులేని నిరుపేదలకు 4.15 లక్షల పక్కా గృహాలను నిర్మించి, సొంతింటి కలను సాకారం చేశారు. 2.50 లక్షల మంది వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు పెన్షన్లను మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వందలాది కోట్లను రుణాల రూపంలో పంపిణీ చేశారు. పట్టణాల్లో అధికంగా నివాసం ఉంటోన్న మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌తో అధిక శాతం లబ్ధి పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చే శక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఏకపక్షం కావడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలకు నగరాలు, పట్టణాల్లో పోటెత్తిన జనసంద్రమే అందుకు తార్కాణం.