తాడిపత్రి : రైల్వేస్టేషన్‌కు చేరిన ఆక్సిజన్ వ్యాగిన్లు
సాక్షి, తాడిపత్రి: ఆక్సిజన్ స్పెషల్ రైలు డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్ చేరినట్లు డీఆర్‌ఎం అలోక్‌తీవారి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ అత్యవసరమైందన్నారు.
దీంతో 32 స్పెషల్ ఆక్సిజన్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు తరలించారన్నారు. టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ స్పెషల్ రైలు మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు చేరిందన్నారు. మొత్తం 10 గూడ్స్ వ్యాగన్లలో(బూస్ట్ వ్యాగన్)లో 100 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ కంటైనర్ల ద్వారా అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆక్సిజన్ తరలించామన్నారు.
చదవండి: గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు
గుంతకల్లు : వ్యాగిన్ల నుంచి ఆక్సిజన్‌ను ట్యాంకర్లలోకి నింపుతున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment