Gur gaon constituency
-
టీనేజర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7 ఏళ్ల బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పంజాబ్- హర్యానా హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ‘పిటిషనర్ తరుపు వాదనలు అన్ని మేం విన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలగజేసుకోవడానికి మాకు ఏ కారణం కనిపించడంలేదు. అందుకే ఈ కేసును కొట్టి వేస్తున్నాం’ అని పేర్కొన్నారు. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను జూన్‌లో పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ను పెద్దవాడిగా పరిగణిస్తూ కోర్టు అతనికి ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. 2019 ఫిబ్రవరి 28 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 12 కింద పిటిషనర్‌కు ఉపశమనం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి కోర్టుకు తక్కువ అవకాశం ఉంది అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 2017 సెప్టెంబర్ 8 న పరీక్షలను వాయిదా వేయించాలని ఒక టీనేజర్ 7 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. ఈ విషయాలను సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. కేసు విచారిస్తున్న సీబీఐ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. నిందితుడు ఎటువంటి సానుభూతికి అర్హుడు కాదని పేర్కొంది. చదవండి: రేప్ కేసు: అతడే ప్రధాన నిందితుడు! -
జూలై చివరి వరకూ అదే మంచిది!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారికి ఇంకా అడ్డు కట్ట పడని నేపథ్యంలో గుర్గావ్ పరిపాలనా విభాగం అక్కడి కొర్పారేట్, టెక్ కంపెనీలకు కీలక సూచన చేసింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ కంపెనీలోని ఉద్యోగులు మరో రెండు నెలలపాటు ఇంటినుంచే పనిచేయాల్సి వుంటుందట. ఈ మేరకు గుర్గావ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో, హర్యానా అదనపు చీఫ్ సెక్రటరీ వీఎస్ కుందు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విస్తరణను నిరోధించేందుకు వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసేలా కంపెనీలు చూసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కరోనావైరస్ మహమ్మారి స్వభావం అలాంటిది, మునుపటి సాధారణ స్థితికి తిరిగి ఎప్పటికి చేరతామో ఎవరికీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కేంద్రం గుర్గావ్లోనిఎంఎన్సీలు, బీపీఓలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్లు, పరిశ్రమలు తమ ఉద్యోగులను జూలై చివరి వరకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్, వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రం హోం) చేయించుకునే విధానాన్ని కొనసాగించాలన్నారు. (కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు) ఇంటినుంచే పనిచేయడం ఉత్పాదక రంగంలో సాధ్యం కాదు కాబట్టి, సాధ్యమైన ఇతర రంగాలన్నీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని సూచించారు. భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటిస్తూ డిఎల్ఎఫ్ సహా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతినిస్తున్నట్టు కుందు తెలిపారు. ఇంటినుంచి పని సాధ్యం కాని కార్మికులు ఇప్పటికే సైట్లో ఉంటున్న నిర్మాణరంగ కార్మికులు, ప్రాజెక్టుకు అతి సమీపంలో (నడక దూరంలో) ఉన్నవారు సామాజిక దూర నిబంధనలకు కట్టుబడి పని తిరిగి ప్రారంభించడానికి అనుమతివుంటుందని ఆయన చెప్పారు. గుర్గావ్లోని పరిస్థితి చాలా నియంత్రణలో ఉందని, కమ్యూనిటీ ట్రాన్సమిషన్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. ప్రాణాలను కాపాడటం, జీవనోపాధి కల్పించడం అనే రెండు లక్ష్యాలపై తాము పనిచేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం సర్వేలు నిర్వహిస్తోందనీ, రేషన్ కార్డులు లేని పేద కుటుంబాలకు ఆహార కూపన్లు అందించడం ప్రారంభించి, మూడు నెలల పాటు రేషన్ అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే దుస్తులు సంస్థలకు రెండింటికీ తమ ప్లాంట్లలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) తయారీకి అనుమతి ఇచ్చామనీ, తయారీ కూడా ప్రారంభించామని కుందు చెప్పారు. కాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భాగమైన గుర్గావ్ను మిలీనియం సిటీగా పిలుస్తారు. ఇది ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ దిగ్గజాలు సహా అనేక బీపీఓలు, ఎంఎన్సీలకు నిలయం. అంతేకాదు ఆటోమొబైల్ పరిశ్రమకు గుర్గావ్ ప్రధాన కేంద్రంగా ఉంది. -
మారిన రాజకీయ సమీకరణాలు
న్యూఢిల్లీ: ఆకాశహర్మ్యాలతో కూడిన పట్టణ ప్రాం తాలతోపాటు పాడుబడిన పెంకుటిళ్లు, గుడిసెలు కలిగిన గ్రామీణ ప్రాంతాలున్న గుర్గావ్ నియోజకవర్గంలో ఈసారి లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడ నుంచి పోటీపడుతున్న అభ్యర్థులే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి యోగేంద్ర యాదవ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ఎన్నికల బరిలో దిగడంతో గుర్గావ్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. రావ్ ఇంద్రజీత్ సింగ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాతో విభేదాల వల్ల ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రావ్ ఇంద్రజీత్ సింగ్ పార్టీ మారడం వల్ల గుర్గావ్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఇక్కడ నుంచి రావ్ ధర్మపాల్‌ను నిలబెట్టింది. ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జాకీర్ హుస్సేన్ కూడా పార్టీ మారారు. ఆయన బీఎస్పీని వీడి ఐఎన్ఎల్డీలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. రివాడీ రాజకుటుంబానికి చెందిన రావ్ ఇంద్రజీత్ సింగ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు మహేంద్ర గఢ్, రివాడీ, గుర్గావ్, జజ్జర్, మేవాత్ ప్రాంతాలపై గట్టి పట్టు ఉండేది. సాధారణంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తూ వస్తోన్న ఈ ప్రాంతాల ఓటర్లు ఆయన పార్టీ మారడంతో అయోమయంలో పడ్డారు. సింగ్ కాం గ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఇక ముస్లిం ఓట్లపై ఆయన ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా ఫలితాలను శాసించే స్థాయిలో ఉండడంతో గెలుపుకోసం సింగ్ చెమటోడ్చక తప్పదని చెబుతున్నారు. దీనిని అవకాశంగా మలచుకునేందుకు యోగేంద్ర యాదవ్ వేగంగా పావులు కదుపుతున్నారు. ముస్లిం ఓటర్లను ఆయన ఆకట్టుకోవడం చాలా తేలికైన అంశమని రాజకీయ పండితులు చెబుతున్నారు. యాదవ్‌ల ఓట్లు కూడా బాగా నే ఉన్నందున వారి ఓట్లను కూడా కొల్లగొట్టడం లో యోగేంద్ర యాదవ్ సఫలీకృతుడవుతాడని జోస్యం చెబుతున్నారు. ఇదే జరిగితే ఆప్ పార్టీ విజయం ఇక్కడ నల్లేరు మీద నడకే. బీజేపీకి ఓటు వేయడానికి వెనుకాడే ముస్లిం ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిజాయితీపరుడైన, చిత్తశుద్ధి కలిగిన నేత అన్న పేరు ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. గుర్గావ్ వంటి అంతర్జాతీయ హంగులున్న ప్రాంతాలతో పాటు నూహ్ వంటి గ్రామీణ ప్రాంతాలున్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో కూడా హస్తిమశకాంతరం కనబడుతుంది. గుర్గావ్లోని పట్టణ ప్రాంతాలను పక్కనబెడితే గ్రామీణ ప్రాంతా ప్రజలు కులమత సమీకరణాల ఆధారంగానే ఓట్లు వేస్తారు. ఇక్కడి ఓటర్లలో దళితులు, జాట్లు, వైశ్యులు, గుజ్జర్లు, రాజపుత్రులు, పంజాబీలు, బ్రాహ్మణులు తమ తమ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఓట్లు వేసే అవకాశముంది. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 17, 80,000.