guru pournami
-
హైదరాబాద్‌లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు (ఫోటోలు)
-
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు అభిషేకాలు. అర్చనలు నిర్వహించారు. భజనలు చేశారు. హరతీ కార్యక్రమం నిర్వహించారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్న ఆలయాలు సాయినామస్మరణంతో మారుమ్రోగాయి. పల్నాడు జిల్లా : అమరావతి శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. విశాఖలో వైభవంగా గురు పౌర్ణమి పూజలు విశాఖ జిల్లాలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. షిరిడి సాయి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి షిరిడి సాయినాథునికి పవిత్ర జలాలతో అభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా: గురు పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 1500 కిలోలు వివిద రకాల పూలు పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. -
దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు
-
150 ఏళ్ల తర్వాత ఒకే రోజున..
సాక్షి: ఈ నెల 16న గురు పౌర్ణిమ. ప్రతి సంవత్సరం హిందువులు ఆషాడ పౌర్ణమిని వేద వ్యాసుని జయంతికి గుర్తుగా గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అయితే ఆ తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్ర గ్రహణం జరగబోతోంది. ఇలా కొన్ని గంటల తేడాతో రెండు సందర్బాలు రావడం అరుదుగా జరుగుతుంది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చి, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకున్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని తెలిసిందే. చంద్ర గ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడే జరుగుతుంది. ఇంతకు ముందు జులై 12, 1870న ఒకే సమయంలో చంద్ర గ్రహణం, గురుపౌర్ణిమ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు దాదాపు 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం రాబోతోంది. గురు పౌర్ణిమ వేళలు: 16వ తేదీ తెల్లవారు జామున 1.30 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. చంద్ర గ్రహణం వేళలు: 17వ తేదీ తెల్లవారు జాము 12.13 గంటలకు మొదలై, మూడు గంటలకు గరిష్ట స్థాయికి చేరుకొని 5.47కు ముగుస్తుంది. రెండింటి మధ్య కేవలం ఎనిమిది గంటల సమయమే తేడా. ఇంకో విశేషమేంటంటే తదుపరి చంద్ర గ్రహణం చూడాలంటే మే 26, 2021 వరకు ఆగాల్సిందే. అంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాతనే మరో చంద్ర గ్రహణం వస్తుందన్నమాట. -
అందుకే అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి!
సాక్షి, విశాఖపట్టణం : ఆషాఢమాసం ప్రారంభమైంది. కొత్తగా వివాహమైన కోడలు అత్తారింటిలో ఈ మాసంలో ఉండకూడదన్న విశ్వాసం ఉంది. ఈ మాసమంతా ఎలాంటి శుభ కార్యాలు కూడా చేయరు. ఏటా చిన్నా, పెద్ద ముహుర్తాలు తొమ్మిది నెలల పాటు ఉంటాయి. కేవలం ఆషాఢం, పుష్యం, భాద్రపదం మాసాలలో మాత్రమే శుభముహూర్తాలు ఉండవు. మిగతా తొమ్మిది మాసాలు ముహూర్తాలు వరసగా ఉంటాయి. ఈసారి ఆషాఢం, భాద్రపదానికి తోడు శుక్రమౌఢ్యంతో శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తాలకు విరామం ఏర్పడింది. శుక్రమౌఢ్యం ఉన్న రోజుల్లో పెద్ద శుభ కార్యాలు చేయరు. కేవలం నామకరణాలు, జన్మదినోత్సవాల లాంటివి మాత్రమే చేసుకోవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మౌఢ్యం నియమం పాటించని వారు మాత్రం శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆషాఢం ఆఫర్ల వరద ఈ మాసం వస్తుందంటే వ్యాపారులు ఆఫర్లతో ఊదరగొట్టేస్తారు. వస్త్రాల నుంచి నగల వరకు మార్కెట్లో ప్రత్యేక బహుమతులతో, ధరలతో అలంకార ప్రియు లను ఆకర్షిస్తారు. తూకాల్లో వస్త్రాల విక్రయాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు తదితర ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులను వ్యాపారులు ‘రారండి’అంటూ ఆహ్వానించేలా ఆఫర్లు ఇస్తారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి కొత్తగా పెళ్లయిన జంట ఒకరిని విడిచి ఒకరు ఉండి తీరాలన్న కఠిన నిబంధనను ఆషాఢ మాసమంతా అనుసరిస్తారు. ఎందుకంటే సాగు పనులు పుష్కలంగా ఉండే ఈ సీజన్లో కొత్త అల్లుడికి మర్యాదలు సరిగా చేయలేమనే భావన, సాగు పనులు స్తంభించిపోతాయనే ఆలోచన ఈ నిబంధనకు కారణంగా చెప్తారు. పైగా ఈ సమయంలో గర్భధారణ అంత ఆరోగ్యకరం కాదు. పరిసరాల్లోని నీళ్లు కలుషితం అయి ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధులు విస్తరించే కాలంలో అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు ఈ కాలంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. తీవ్ర మైన ఎండలు కాచే సమయం ఉదయించే శిశువుకు మంచిది కాదు. ఈ నెల వియోగం పాటిస్తే జూలై, ఆగస్టుల్లో ప్రసవం జరుగుతుంది. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి ఎడబాటు మంచిదే. మూడు నెలలు ఖాళీనే.. శుభ ముహూర్తాలు లేకపోవడంతో ముఖ్యంగా వివాహాలకు అనువైన రోజులు లేకపోవడంతో.. ఫంక్షన్ హాళ్లు, సంబంధిత వ్యాపారాలు కళ తప్పనున్నాయి. శూన్యమాసాలాకు తోడు మౌడ్యమి రావడంతో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు తక్కువ. శుభ కార్యాలపై ఆధారపడి జీవించే వేలాదిమందికి ఈ విరామం కాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. టైలర్లు, బాణాసంచా, భాజాభజంత్రీలు, వంట మాస్టర్లు, కూలీలు, పారిశుద్ధ్య ›పనులు చేసేవారికి రోజు వారీ కూలీ లభించే అవకాశం ఉండదు. పందిళ్లు, షామియానాలకు కూడా గిరాకీ తగ్గనుంది. ఫంక్షన్ హాళ్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు, పురోహితులకు కూడా చేతినిండా పని ఉండదు. అక్టోబర్ నుంచి మంచి రోజులు ‘అక్టోబరు 2 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ముహూర్తాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 14 నుంచి గురు మౌఢ్యమి కారణంగా మార్గశిర మాసంలో శుభ కార్యాలకు కాస్త విరామం ఏర్పడుతుంది. గురుమౌఢ్యమి జనవరి 10తో ముగియనున్నప్పటికీ పుష్య మాసం ఉండడంతో వివాహాలు, తదితర శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు లేవు. శుభ ముహూర్తాలు తిరిగి మాఘమాసం అంటే జనవరి 26 నుంచి మాత్రమే ప్రారంభం కానున్నాయి’ అని వేద పండితులు చెబుతున్నారు. శుభకార్యాలకు విరామం మనదేశం వ్యవసాయ ప్రధానమైంది. ప్రతీ పల్లెలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఉంటాయి. చినుకులు కురిసి ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉండేది ఇదే నెలలో. సాగు పనులు, దుక్కి దున్నడం, నాట్లు వేయడం తదితర కార్యక్రమాలన్నీ చేస్తారు. సేద్యపు పనులకు ఆటంకాలు ఉండకూడదు కాబట్టి శుభకార్యాలు జరిపే వీలు ఉండదు. భానుసప్తమి ఆషాఢమాసంలో వచ్చే ఏడో రోజు అనగా సప్తమి తిథిని భాను సప్తమి,రథ సప్తమిగా భావిస్తారు. ప్రకృతికంతటికీ వెలుగు ప్రసాదించి సూర్యున్ని దైవంగా భావించడం ఈ తిథి ప్రత్యేకం. ఏడు గుర్రాల రేడు అనగా ఏడు వర్ణాల మేళవింపు అయిన సూర్యకాంతి కారణంగానే ప్రకృతి పచ్చటి శోభను సంతరించుకుంటుంది కాబట్టి సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు సైతం దైవ సమానుడయ్యాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనిస్తున్న సూర్యుడు మూడునెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున రాత్రి, పగలు, క్షణం కూడా తేడా లేకుండా సమానంగా ఉంటాయి. తొలిపండుగ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అంటారు. త్రిలోక పరిపాలకుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్న రోజిది కాబట్టి ఇది శయన ఏకాదశి. తిరిగి నాలుగు నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి రోజున మేలుకుని ఉత్తరద్వార దర్శనం ఇస్తాడు. అందుకే ఈ నాలుగునెలల పాటు ఆధ్యాత్మిక సంప్రదాయ వాదులు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. క్రిమి కీటకాదులు అతిగా సంచరించే అవకాశం ఉన్నందును ముని దీక్షలు ఆచరించే వారు బయట తిరగకుండా ఆశ్రమాల్లోనే ఈ దీక్షలను ఆచరించేవారు. వ్యాస పూర్ణిమ తల్లిదండ్రుల తర్వాత దైవ సమానంగా భావించే గురు పౌర్ణమి ఇదే మాసంలో వస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ. వేదాలను సృష్టించిన వ్యాస మహర్షినే ఆదిగురువుగా భావించి వ్యాస పౌర్ణమిని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. పంచమ వేదం మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి పరమోన్నత సంపద అందించిన వేద వ్యాసుడుని తొలి గురు వుగా భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. మగువలు ఇష్టపడే గోరింటాకు ఆషాఢం వచ్చేసింది. అర చేతిలో గోరింటాకు పండుతోంది. మగువల అలంకరణలో గోరింటాకు అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా మెహిందీలు, కోన్లు దొరుకుతున్నా గోరింటకున్న ప్రాధాన్యం దానిదే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పట్టణ ప్రాంతాల్లో గోరింట మొక్కలు దాదాపు కనుమరుగయ్యాయి. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు సంప్రదాయంగా వస్తోంది. ఈ మాసంలోనే లేతాకు లభ్యం వాస్తవానికి ఆషాఢ మాసంలోనే లేత గోరింటాకు దొరుకుతుంది. లేతాకైతేనే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తరువాత చిగురించిన లేత గోరింటాకును నూరి చేతులు, కాళ్లకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయాక పడుకునే ముందు కుటుంబమంతా ఓ చోట చేరి గోరింటాకు ముద్దను మహిళల చేతులు, కాళ్లకు నచ్చిన డిజైన్లతో అలంకరించి రాత్రంతా ఉంచుకుంటారు. తెల్లవారు జామున పండిన గోరింటాకును చూసుకుంటూ మురిసిపోతారు. నీదెలా పండిందో.. నాదెలా పండిందో చూపించంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా మురిసి పోతుంటారు. కమ్మరేకుకు కూడా ప్రాధాన్యమే.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోరింటాకు నూరేటప్పుడు కమ్మరేకులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చేవారు. సిద్ధం చేసుకున్న గోరింట మిశ్రమాన్ని బట్టి మూడిళ్లు లేదా ఆరిళ్ల తాలూకా కమ్మ రేకుల ముక్కలను సేకరించి గోరింటాకులో కలిపి మెత్తగా నూరేవారు. ఇలా చేస్తే బాగా పండటమే కాకుండా ఎక్కువ రోజులు చేతులు, కాళ్లకు పట్టి ఉంటుందని ఉంటుందని మహిళల నమ్మకం. మారుతున్న పరిస్థితుల బట్టి గ్రామాల్లో గోరింటాకును నూరడానికి ఉపయోగించే రోళ్లు కూడా కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో మిక్సీలు వచ్చి పడ్డాయి. శ్రమతో కూడుకున్న పని కావడంతో కాస్తా ఓపికున్న వారు గోరింటాకును మిక్సీలో తయారు చేసుకుంటుంటే, మరికొందరు మెహిందీ, కోన్లను ఉపయోగిస్తూ ఆధునిక పోకడలకు పోతున్నారు. సైన్స్ ఇలా చెబుతుంది గోరింటాకు మంచి యాంటీ బయాటిక్‌గా పని చేస్తుందని సైన్స్ చెబుతుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తి వ్యవసాయాధారితం. మృగశిరలో నారుమళ్లు వేయడం, ఆషాఢంలో నాట్లు వేయడమనేది సంప్రదాయంగా వస్తోంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీనివల్ల మట్టి, మురుగునీరు కాళ్లు చేతులు ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడటం జరిగేది. ఇప్పటికీ అదే సమస్యను చూస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకుంటే యాంటీ బయాటిక్‌గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకుకు ప్రముఖ స్థానముంది. రాన్రానూ దానిస్థానంలో కోన్లు రావడం, మెహిందీలంటూ కొత్త కొత్త డిజైన్లు రావడంతో గోరింటాకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. రసాయనాలు కలిగి ఉండే కోన్ల వల్ల చర్మవ్యాధులు వస్తుండటం గమనర్హం. -
అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్‌లో జలాభిషేకం
సాక్షి, విజయవాడ : గురుపౌర్ణమి పండుగ రోజు ముత్యాలం పాడు సాయిబాబా ఆలయం ఓ రికార్డుని నెలకొల్పింది. శుక్రవారం సాయిబాబా ఆలయంలో నిర్వహించిన లక్ష నారికేళ జలాభిషేకం ‘‘ అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్’’లో చోటుసంపాదించుకుంది. ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమానకి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు సైతం ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుపౌర్ణమి పండుగ రోజు బాబాను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులతో కిటకిటలాడుతున్న సాయిబాబా ఆలయాలు హైదరాబాద్ : గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నగరంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాయిబాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ
పుట్టపర్తి టౌన్ : గురుపౌర్ణమి వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో ప్రముఖ వాయిద్యకారులు చారుమతి రఘురామన్, అనంద్ ఆర్.క్రిష్ణలు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన వాయిద్య కచేరి ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో డిప్లమో పూర్తి చేసుకుని మంచి ఫలితాలు సాధించిన వారికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు జస్టిస్.ఏపి మిశ్రా, ఆర్జె.రత్నాకర్రాజులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సంగీత కచేరి నిర్వహించిన కళాకారులను ఘనంగా సన్మానించారు. -
పోటాపోటీగా రాతిదూలం పోటీలు
గార్లదిన్నె (శింగనమల) : గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం మండల కేంద్రం గార్లదిన్నెలోని ఇందిరమ్మ కాలనీ షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద ముంటిమడుగు యల్లారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. పోటీల్లో 20 జతల వృషభాలు పాల్గొన్నాయి. అనంతపురానికి చెందిన ఓబుళపతి ఆచారి వృషభాలు 5,500 అడుగులు రాతిదూలం లాగి విజేతగా నిలిచాయి. కర్నూలు జిల్లా సంకలాపురం గంగుల బ్రహ్మయ్య వృషభాలు ద్వితీయ, వైఎస్సార్ జిల్లా తంపెట్ల రవీంద్రారెడ్డి వృషభాలు తృతీయ, గుత్తి మండలం నేమతాబాద్ సూర్యనారాయణరెడ్డి వృషభాలు నాలుగో స్థానం, పెద్దవడగూరు మండలం చాగల్లు ఆదినారాయణ వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2500 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి, ముంటిమడుగు కేశవరెడ్డి, గేట్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రామక్రిష్ణ, మహేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
పుట్టపర్తి(అనంతపురం): అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల గురు వందనంతో వేడుకలు మొదలయ్యాయి. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ వేడుకలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. -
బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి. వ్యాస పౌర్ణమినే గురుపౌర్ణమిగా పాటిస్తారు. దిల్సుఖ్నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. ఆలయాలు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో ఉదయం 9గంటలకు గురుపూజోత్సవం నిర్వహించనున్నారు. అలాగే, బాసరలో సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించనున్నారు.