gurukul notification
-
భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే! ఇకపై ఐదు అంచెల్లో
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో సాగనుంది. ఇందుకోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (బీటీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఒక అభ్యర్థి తన అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థి ఆన్లైన్లో ప్రతిసారి దరఖాస్తు సమయంలో వివరాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియను తీసుకొచ్చింది. గతంలో కేవలం ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉండేది. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మోడల్‌ను అనుసరిస్తూ ప్రతి అభ్యర్థికీ ఓటీఆర్‌ను తప్పనిసరి చేసింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తాయనే అంచనాతో.. సుదీర్ఘ కాలం తర్వాత గురుకుల బోర్డు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడంతో, దరఖాస్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ సులభతరంగా ఉండేందుకు బీటీఆర్‌ఈఐఆర్‌బీ ఐదు అంచెల పద్ధతి అనుసరిస్తోంది. దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థి ముందుగా బోర్డు వైబ్‌సైట్‌ను తెరిచి ఆన్లైన్ అప్లై అనే ఆప్షన్ ద్వారా పేజీ తెరిచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. తొలుత ఓటీఆర్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తయారవుతుంది. అనంతరం ఆ వివరాలతో లాగిన్ అయ్యాక పరీక్ష ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో పూరించి సబ్మిట్ చేయాలి. చివరగా వెబ్సైట్లో అప్లోడ్ అయిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు పత్రం అత్యంత కీలకం. ఉద్యోగానికి ఎంపికైన సమయంలో ఈ దరఖాస్తు పత్రం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం బీటీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఓటీఆర్ ప్రక్రియ బుధవారం నుంచి అందుబాటులోకి వచి్చంది. ఈ నెల 17వ తేదీ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు నంబర్ ద్వారా ఓటీఆర్ ఫారాన్ని తెరిచి, వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా బుధవారం తొలిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున వెబ్‌సైట్‌ను తెరిచారు. దీంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి పేజీ తెరుచుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. దీంతో బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం అధికారులు చర్యలు చేపట్టడంతో సాయంత్రానికి వెబ్సైట్ కాస్త స్పీడందుకుంది. -
పట్టుదలే ఆయుధం
కొత్తగూడెం: కృషి, పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, పిల్లలు ఇతరత్రా విజయానికి ఆటంకాలు కావని జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూ పించింది. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పగడాలకవిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పదోతరగతి తర్వాత దూరవిద్యలోనే ఉన్నత విద్యను ఆమె అభ్యసించారు. ఇటీవల గురుకుల నోటిఫికేషన్లో పీజీటీ విభాగంలో జోనల్ స్థాయిలో మహిళల ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. అంతేకాకుండా టీజీటీ విభాగంలోనూ 1:2 ఇంటర్వూ్యకు అర్హతను సాధించారు. దూర విద్యతో ఉన్నత విద్య... జిల్లాలోని అశ్వాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన పగడాల కవితకు పదో తరగతి పూర్తి చేయగానే వివాహమైంది. కవితకు చదువుపై ఉన్న ఆసక్తిని ఆమె భర్త తుక్కాని శ్రీనివాసరెడ్డి గుర్తించి ప్రోత్సహించారు. అతని సలహా లు, సూచనలతో దూర విద్యా విధానంలో బీఏ, ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. ఆ తర్వాత 2015 లో పాల్వంచలోని మదర్‌థెరిస్సా కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమె కష్టపడ్డారు. కోచింగ్ లేకుండానే... గరుకులాల్లో ఉద్యోగాన్ని సాధించేందుకు ఎలాంటి కోచింగ్‌ను కవిత తీసుకోలేదు. కేవ లం తన ఇంటి వద్దనే ఆమె సాధన చేసే వారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండగానే గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ విడుదల కావడంతో టీజీటీ, పీజీటీ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 102 మార్కులతో ప్రిలిమ్స్‌లో మెయిన్స్‌కు క్వాలీఫై అయ్యారు. అనంతరం మెయిన్స్‌లోనూ ఉత్తమ మార్కులను సాధించి పీజీటీ విభాగంలో మహిళల ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంకు, జనరల్‌లో 9వ ర్యాంకును సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. టీజీటీ విభాగంలోను 1:2 తో అర్హత సాధించారు. భర్త మార్గదర్శకంలో.. నా భర్త శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో డిగ్రీ, పీజీ, బీఈడీను పూర్తి చేశాను. ఆయన మార్గదర్శకత్వంలోనే ఉద్యోగానికి అర్హత సాధించా ను. ఉద్యోగం సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే మిగతావేమీ అడ్డుకావు. ప్రణాళిక, తగిన మెటీరియల్స్ తో సాధన చేయాలి. నా లక్ష్య సాధనలో భర్త, కుమారుడి సహాయ సహకారాలు మరువలేనివి. విద్యార్థుల్లో తెలుగుపై మమకారం, పట్టును పెంచేలా భోదన చేసేందుకు నా వంతు కృషి చేస్తా. –పగడాల కవిత -
గురుకుల నోటిఫికేషన్ విడుదల
ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తీపి కబురు అందించింది. గురుకుల పాఠశాలల్లో ఏడువేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందుకోసం ఈ నెల 10 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. మొత్తం 7,306 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. గురుకుల నోటిఫికేషన్ గురించి గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో పొందుపరచాల్సిన నిబంధనలపై టీఎస్పీఎస్సీ, సంక్షేమశాఖలు ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం. విద్యార్హతల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గురుకులాలు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు అయినందున ఆంగ్ల మాధ్యమంలోనే చదివి ఉండాలన్న నిబంధన ఉంటుందా అనే ఆందోళన అనేక మంది అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మీడియం విషయంలో ఆంక్షల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్మీడియెట్ డిగ్రీ, పీజీ, బీఎడ్ వంటి కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో చదివినా, తెలుగు మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. (చదవండి: మీడియం ఏదైనా అర్హులే!)