Gurusayidat
-
గురుసాయిదత్ శుభారంభం
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు గురుసాయిదత్, ప్రతుల్ జోషి, హర్షీల్ డాని శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ 21-7, 21-6తో రిడిగెర్ జెనెడ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. కేవలం 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గురుసాయిదత్‌కు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండో గేమ్ చివర్లో గురుసాయిదత్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రతుల్ జోషి 21-13, 21-12తో బైరన్ హోల్సెక్ (కెనడా)పై, హర్షీల్ 21-11, 21-14తో అలిస్టర్ కేసీ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు. -
క్వార్టర్స్‌లో గురుసాయిదత్
అల్మెరె (నెదర్లాండ్స్): కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత ఆర్‌ఎంవీ గురుసాయిదత్, డిఫెండింగ్ చాంపియన్ అజయ్ జయరామ్‌లు.. డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదోసీడ్ గురుసాయిదత్ 21-12, 21-11తో దిమిత్రో జవదాస్కి (ఉక్రెయిన్)పై; మూడోసీడ్ జయరామ్ 21-14, 21-13తో కాస్పర్ లెహికోనెన్ (ఫిన్లాండ్)పై నెగ్గారు. నాలుగోసీడ్ సాయి ప్రణీత్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పి.సి.తులసి 19-21, 23-21, 19-21తో చోలీ మాగి (ఐర్లాండ్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 14-21, 18-21తో మార్టిన్ క్యాంప్‌బెల్-ప్యాట్రిక్ మకావు (స్కాట్లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు. -
గురుసాయిదత్ శుభారంభం
అల్మెరె (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గురుసాయిదత్, సాయిప్రణీత్లతోపాటు డిఫెండిం గ్ చాంపియన్ అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్ గురుసాయిదత్ 21-8, 21-9తో మాక్సిమి మోరీల్స్ (బెల్జియం)పై గెలుపొందాడు. నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21-15, 21-11తో స్టీఫెన్ రస్‌ముసేన్ (డెన్మార్క్)పై... జయరామ్ 19-21, 21-17, 21-18తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. అయితే భారత్‌కే చెందిన ఆనంద్ పవార్ 10-21, 15-21తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ (భారత్) ద్వయం 16-21, 15-21తో జాకో అరెండ్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.