క్వార్టర్స్‌లో గురుసాయిదత్ | Gurusayidat quarter | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో గురుసాయిదత్

Published Thu, Oct 8 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

Gurusayidat quarter

అల్మెరె (నెదర్లాండ్స్): కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత ఆర్‌ఎంవీ గురుసాయిదత్, డిఫెండింగ్ చాంపియన్ అజయ్ జయరామ్‌లు.. డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదోసీడ్ గురుసాయిదత్ 21-12, 21-11తో దిమిత్రో జవదాస్కి (ఉక్రెయిన్)పై; మూడోసీడ్ జయరామ్ 21-14, 21-13తో కాస్పర్ లెహికోనెన్ (ఫిన్లాండ్)పై నెగ్గారు. నాలుగోసీడ్ సాయి ప్రణీత్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పి.సి.తులసి 19-21, 23-21, 19-21తో చోలీ మాగి (ఐర్లాండ్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 14-21, 18-21తో మార్టిన్ క్యాంప్‌బెల్-ప్యాట్రిక్ మకావు (స్కాట్లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement