గురుసాయిదత్ శుభారంభం
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు గురుసాయిదత్, ప్రతుల్ జోషి, హర్షీల్ డాని శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ 21-7, 21-6తో రిడిగెర్ జెనెడ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు.
కేవలం 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గురుసాయిదత్‌కు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండో గేమ్ చివర్లో గురుసాయిదత్ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రతుల్ జోషి 21-13, 21-12తో బైరన్ హోల్‌సెక్ (కెనడా)పై, హర్షీల్ 21-11, 21-14తో అలిస్టర్ కేసీ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు.