గురుసాయిదత్ శుభారంభం | Getting started gurusayidat | Sakshi
Sakshi News home page

గురుసాయిదత్ శుభారంభం

Published Thu, Oct 8 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

Getting started gurusayidat

 అల్మెరె (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మిం టన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు గురుసాయిదత్, సాయిప్రణీత్‌లతోపాటు డిఫెండిం గ్ చాంపియన్ అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో తొమ్మిదో సీడ్ గురుసాయిదత్ 21-8, 21-9తో మాక్సిమి మోరీల్స్ (బెల్జియం)పై గెలుపొందాడు. నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21-15, 21-11తో స్టీఫెన్ రస్‌ముసేన్ (డెన్మార్క్)పై... జయరామ్ 19-21, 21-17, 21-18తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. అయితే భారత్‌కే చెందిన ఆనంద్ పవార్ 10-21, 15-21తో ఇస్కందర్ జుల్కర్‌నైన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ (భారత్) ద్వయం 16-21, 15-21తో జాకో అరెండ్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement