వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా
ఎస్పీ జి విజయకుమార్
మచిలీపట్నం : ఎస్పీగా జి.విజయకుమార్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు సంప్రదాయం ప్రకారం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయకుమార్ విలేకరులతో మాట్లాడారు. తనకు విజయవాడలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుశాఖాపరంగా ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని, సమర్థంగా విధులు నిర్వహిస్తానని చెప్పారు.
శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, నేరాల సంఖ్యను తగ్గించేం దుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తానన్నారు. జిల్లాలోని పాత్రికేయులు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించి జిల్లాలో పోలీసుల పని తీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తొలుత ఎస్పీకి ఏఎస్పీ వి.డి.వి.సాగర్, వోఎస్డీ వృషికేశ్రెడ్డి, జిల్లాలోని ఆయా డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు స్వాగతం పలికారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
చిలకలపూడి : కలెక్టర్ ఎం.రఘునందనరావును ఎస్పీ విజయకుమార్ సోమవారం ఆయన చాంబ ర్లో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.