gvs prasad
-
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ.. సాయి ధరమ్ తేజ్ నాన్నకు ఏంటీ సంబంధం?
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలో ఎవరినీ అడిగినా గుర్తుపట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ ఆయన బాటలోనే ప్రయాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొస్తున్న మరో యంగ్ హీరో, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈనెల 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే కావొచ్చు. కానీ సాయి ధరమ్ తేజ్ తండ్రి గురించి మీకు తెలుసా? అంతే కాదండోయ్ ఆయనొక నిర్మాత అని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తండ్రి జీవీఎస్ ప్రసాద్ ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా తీశారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ప్రేక్షకులందరికీ తెలిసు. కానీ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ నాన్న నిర్మాతగా ఉన్నారన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఇంతకీ ఆయన తీసిన సినిమా ఏదో తెలుసుకోవాలనుందా? పదండి అదేంటో చూసేద్దాం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఓ రేంజ్ ఉండేది. ఆయన సినిమాల్లో చేసే డ్యాన్స్‌ను అందరూ ఫిదా అయిపోయేవారే. అలా వెండితెరపై ఆయనొక ఎవర్ గ్రీన్ నటుడు. ఆయనతో సాయి ధరమ్ తేజ్ నాన్న జీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'రౌడీ అల్లుడు'. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు మెగాస్టార్. చిరు కెరీర్లో రౌడీ అల్లుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా 1991 అక్టోబర్ 18న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి కళ్యాణ్గా, ఆటో జానీగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత జీవీఎస్ ప్రసాద్ మరో సినిమా నిర్మించలేదు. మొత్తంగా ‘రౌడీ అల్లుడు’ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. -
బ్యాంకుల వైఖరి మారాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: బ్యాంకుల వైఖరి మారితేనే ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి కలుగుతుందని సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ బీవీ రామారావు అన్నారు. సూక్ష్మ, చిన్న వ్యాపారస్తుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజస్ స్కీం (సీజీటీఎంఎస్ఈ)ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏవిధమైన సెక్యూరిటీ థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఈ పథకం కింద రుణం పొందవచ్చునన్నారు. దీని గురించి తెలియకపోవడం, తెలిసినా బ్యాంకులు సుముఖత చూపకపోవడంతో మనరాష్ట్రంలో చాలామంది ఉపయోగించుకోవడం లేదన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల్లో వేలాదిమంది వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పారు. భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు కూడా ధనవంతులకే రుణాలు మంజూరు చేస్తోందన్నారు. వ్యవసాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత సూక్ష్మ, చిన్న వ్యాపారస్తులకు ఇవ్వవలసి ఉందన్నారు. ఇప్పటికైనా ఔత్సాహికులైన చిన్న, మధ్యతరహా వ్యాపారస్థులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి కో-ఆర్డినేటర్‌గా జి.వి.ఎస్.ప్రసాద్‌ను నియమించారని, వివరాలకు 98666 49369 నంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.సమావేశంలో జి.వి.ఎస్.ప్రసాద్, పప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.