Hair Oil Company
-
బామ్మ సీక్రెట్ రెసిపీ : హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో నెలకు రూ. 50 లక్షలు
అటు బామ్మ సీక్రెట్, ఇటు అమ్మను మించిన అమ్మ అత్తగారి సాయంతో సక్సెస్‌పుల్ బిజినెస్ విమెన్‌గా అవతరించింది ఓ కోడలు. హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ అత్తా కోడళ్ల జంట నెలకు రూ. 50లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఈ అద్భుతమైన వీరి వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. గురుగ్రామ్‌కు చెందిన అత్తా కోడళ్లు తమ బంధానికి కొత్త అర్థం చెప్పారు. విజయవంతమైన వ్యాపార మహిళలుగా రాణించడమే కాదు తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అసలు ఈ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే.. జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్య. ఐటీ ఉద్యోగి నిధికీ ఈ సమస్య బాగా ఉండేది. 2019 వరకు ఊటీ ఉద్యోగంలో ఉంది. 2010లో పెళ్లి. మూడేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొడుకుకు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టి, కుమారుడుపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదు. కానీ ఆర్థికంగా బలపడాలని, ఏదైనా చేయాలని మాత్రం అనుకుంటూ ఉండేది. ఒక రోజు తన జుట్టు సమస్యను కూడా అత్తగారు రజనీ దువాకు చెప్పుకుంది. ఆమెకు కూడా ఇదే సమస్య ఉండటంతో ఏదైనా చేయాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇక్కడే వీరి జీవితాల్లో సరికొత్త అధ్యాయం షురూ అయింది. చిన్నపుడు బామ్మ చేసే మసాజ్, ఆయిల్ గుర్తొచ్చాయి నిధికి. ఐడియా మెరిసింది. అత్తగారితో కలిసి రంగంలోకి దిగిపోయింది. చాలా మంది స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉందని గమనించారు. అలాగే, ఈ సమస్య నుండి బయటపడటానికి, ఆన్లైన్లో ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, చవకగా, ఇంతకంటే మంచి, సహజమైన ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకుంది. అంతే ఆమె తల్లి, బామ్మ చెప్పిన చిట్కాలతో మంచి రెసిపీని తయారు చేసింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. చుట్టు పక్కల వాళ్లు కూడా బావుంది అంటూ కితాబిచ్చారు. అంతే 2023, మార్చిలో 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్' పేరుతో హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారానికి నాంది పలికింది. అత్తగారి సంపూర్ణ మద్దతుతో పూర్తి సహజసిద్దమైన తలనూనె తయారీ మొదలు పెట్టింది. “నూనెలో ఉపయోగించే చాలా పదార్థాలు నా తోటలో మాత్రమే పెరుగుతాయి. అలోవెరా, మందార పువ్వులు, కరివేపాకు లాంటి ఇతర సహజ పదార్థాలతో, ఇంట్లోనే తయారు చేస్తాం. మా తోటలోనే పెద్ద కుండలో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం మొదలు పెట్టామని నిధి తెలిపింది. ప్రతి నెల దాదాపు 200 నుండి 300 ఆర్డర్లు వస్తాయని తెలిపింది. సోషల్ మీడియాతో షాపింగ్ ఆరంభంలో సోషల్ మీడియా గ్రూప్‌లో చుట్టుపక్కల మహిళలకు నూనె అమ్మడం ప్రారంభించింది. అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో వారిలో నమ్మకం ధైర్యంపెరిగింది. ఇదే ఉత్సాహంతో నిధి సోషల్ మీడియాలో మరింత ప్రచారాన్ని మొదలు పెట్టింది. చిన్న రీల్స్‌తో నూనెను ఎలా తయారు చేస్తుందో వివరించేది. క్రమంగా ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. నెటిజన్స్, ముఖ్యంగా మహిళల ఆదరణకు నోచుకున్నాయి. ఫలితంగా ఆర్డర్లు పెరిగాయి. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ విక్రయాలను మొదలు పెట్టారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, కండీషనర్, స్కాల్ప్ స్క్రబ్, హెయిర్ ఆయిల్ కాంబో ప్యాక్ లాంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఆయిల్ 67వేల మందికి చేరుకుంది, లక్షకు పైగా బాటిళ్లను విక్రయించి, నెలవారీ రూ. 50 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ అనే ఇనస్టాకు 71 వేలకు పైగా ఫాలోయర్లు ఉండడం విశేషం. View this post on Instagram A post shared by Nidhi’s Grandmaa Secret (@grandmaasecret) -
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా..?!
-
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?!
-
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?!
మీరీ వీడియోను చూడలేరు అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?! ప్రాణం కూడా! వాటిని వాళ్లు ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, కురులలోంచి ఒక్క వెంట్రుక రాలి పడినా విలవిల్లాడి పోతారు. వాటి పోషణకు రకరకాల షాంపూలు, కండీషనర్లు వాడతారు. అందుకే సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే పెద్ద పెద్ద కంపెనీలు మహిళల జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. తమ ఉత్పత్తులకు గిరాకీ కల్పించుకోవడం కోసం వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకుంటాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హెయిర్ ఆయిల్ కంపెనీ మహిళల మనసుకు మరింత చేరువయ్యింది. ఒక్క మహిళలకే కాదు, వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయేలా ఉంది ఆ కంపెనీ విడుదల చేసిన వ్యాపార ప్రకటన! గృహహింసకు ముడివడి ఉన్న ఆ వీడియో థీమ్ ప్రతి ఒక్క హృదయాన్నీ చెమ్మగిల్లేలా చేస్తోంది! ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. అమెకు అందమైన పొడవాటి జుట్టు ఉంటుంది. ఓ రోజు తను బ్యూటీపార్లర్‌కి వెళుతుంది. జుట్టుని షార్ట్‌గా కట్ చెయ్యమని హెయిర్ డ్రెసర్ని కోరుతుంది. కానీ అంత బలమైన, ఒత్తయిన జుట్టుని కట్ చెయ్యడానికి హెయిర్ డ్రెసర్కి మనసు రాదు. ‘‘అలాక్కాదు.. కొద్దిగా ట్రిమ్ చేస్తాను’’ అంటుంది. తనకు షార్ట్గానే కావాలని ఆ అమ్మాయి పట్టు పడుతుంది. దాంతో హెయిర్ డ్రెసర్ కొంచెం షార్ట్‌గా మాత్రమే జుట్టుని కట్ చేస్తుంది. అద్దంలో చూసుకుని, ఇంకా కట్ చెయ్యమంటుంది ఆ అమ్మాయి. హెయిర్ డ్రెసర్ ఆమె చెప్పినట్టే కట్ చేస్తుంది. ‘ఇంకా’ అంటుంది. అలా ఇంకా.. ఇంకా.. ఇంకా.. అని అంటూనే ఉంటుంది. సెలూన్లో ఉన్న మిగతా మహిళలు తలతిప్పి.. ‘ఇంత పొడవాటి, అందమైన జుట్టును ఎందుకు తగ్గించుకుంటోందో ఈ అమ్మాయి..’ అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చివరికి హెయిర్ డ్రెస్సర్ ఆ అమ్మాయికి కావలసినంత షార్ట్‌గా కట్ చేశాక ఒక్కసారిగా ఆమె కళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. బాగా షార్ట్ అయిపోయిన తన జుట్టును పట్టి చూసుకుంటూ, ఇప్పుడెవ్వరూ నన్ను జుట్టు పట్టుకుని కొట్టడానికి వీలుండదు’’ అంటుంది! ఆ మాటతో అక్కడున్న వాళ్లంతా కదిలిపోతారు. వీడియో చూస్తున్న మనం కూడా. మేడమ్ ఇప్పుడు వీ వంతు హెయిర్ డ్రెసర్: వావ్.. మీ జుట్టు ఎంత అందంగా ఉంది ఏం చేయమంటారు మేడమ్ యువతి: జుట్టును షార్ట్‌గా కట్‌చేయండి హెయిర్ డ్రెసర్: కానీ మీ జుట్టు అందంగా ఉంది కాస్త ట్రిమ్ చేస్తాను ఇప్పుడు సరిపోతుందా మేడమ్ యువతి: ఇంకొంచెం షార్ట్‌గా కట్ చేయండి హెయిర్ డ్రెసర్: ఇంకా షార్ట్గానా యువతి: అవును హెయిర్ డ్రెసర్: ఇప్పుడు సరిపోతుందా మేడమ్ యువతి: ఇంకొంచెం షార్ట్‌గా కట్ చేయండి హెయిర్ డ్రెసర్: మీ జుట్టు అలంకరించుకోవడానికి సమయం ఉండట్లేదేమో ? లేయర్ కట్ చేయమంటారా... ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది యువతి: ఇంకా షార్ట్‌గా కట్ చేయండి...ఇంకెవరూ నా జుట్టు ఇలా పట్టుకోకుండా.. కాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హెయిర్ ఆయిల్ కంపెనీ రూపొందించిన యాడ్ ఇది. మహిళలపై జరుగుతున్న గృహహింసను సమాజం దృష్టికి తెచ్చి, బాధితులకు మద్ధతుగా నిలిచేందుకు ఈ యాడ్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది. మహిళలపై జరుగుతున్న గృహహింస దాడులను సమాజానికి తెలియబరచడానికి, వారికి మద్ధతుగా నిలిచేందుకు హెయిర్ ఆయిల్ కంపెనీ ఈ యాడ్‌ను ఇలా కొత్తగా షూట్ చేయించింది. కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక సామాజిక బాధ్యతతో తయారైన ఈ యాడ్ ఇప్పుడు ఒక అనుమానాన్ని కూడా రేకెత్తిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్మన్ తన జుత్తును షార్ట్‌గా కత్తిరించుకున్న నెలలోనే.. తన భర్తతో తెగదెంపులు చేసుకుంటున్న విషయాన్ని ప్రపంచానికి బహిర్గతం చేశారు. నికోల్ చూపిన దారిలోనే మరో హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ పయనించారు! అంటే.. వీళ్లు కూడా గృహహింసకు గురయ్యే ఉంటారా అన్నది ఆ అనుమానం. ప్రాణప్రదంగా చూసుకునే జుట్టును.. ప్రాణాలను కాపాడుకోడానికి తగ్గించుకోక తప్పని పరిస్థితి రావడం మహిళ జీవితంలోని ఒక విషాదం కాక మరేమిటి?! – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్