Hamza
-
కరడుగట్టిన ఉగ్రవాదిగా ఏడు దశల్లో శిక్షణ
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్‌పై దాడులకు నిరంతరం పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. హఫీజ్‌ని అప్పగించాలంటూ భారత్ ఒకవైపు అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే అతను యదేచ్ఛగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హఫీజ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా కలసికట్టుగా భారత్‌పై దాడులు జరపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ ఉగ్రసంస్థలు బహిరంగంగానే ఆసక్తి ఉన్న వారు శిక్షణలో చేరవచ్చు అంటూ యువకులకి వల విసురుతున్నాయి. ఈ విషయాన్ని గత మార్చి 20న కుప్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జబియుల్లా అలియాస్ హమ్జా వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అతను కఠోరమైన వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచాడు. ఇంటరాగేషన్‌లో హమ్జా చెప్పిన విషయాలను క్రోడీకరించి ఎన్ఐఏ ఒక నివేదిక రూపొందించింది. ‘జమాత్ ఉద్ దవా బహిరంగంగానే జిహాదీల కోసం ఆహ్వానిస్తోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వారికి కఠోర శిక్షణ ఇస్తోంది. అలా శిక్షణ తీసుకుంటున్న వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు బయటపెడుతున్నారు. సయీద్ హఫీజ్, లష్కరేకి చెందిన జకీర్ ఉర్ రెహ్మన్ లఖ్వీలు బహిరంగంగానే యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటూ’ హమ్జా వెల్లడించాడు. అంతేకాదు వీరికి ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు దశల్లో శిక్షణ ఇస్తారు. మొత్తం రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల సమయంలో సయీద్ హఫీజ్ తనని తాను అమీర్ సాహెబ్ లేదంటే అమీర్–మస్గర్‌గా వ్యవహరిస్తాడు. ఉగ్రవాదంలో శిక్షణనిచ్చే ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ కోసం చేరిన వారు కూడా అతనిని అమీర్ సాహెబ్ అనే పిలవాలి. ఇక శిక్షణనిచ్చే వారిని మసూల్స్, కాక్రూన్స్ అని పిలుస్తారు. ఈ శిక్షకులు జోన్, జిల్లా, తెహ్సీల్, పట్టణ , సెక్టార్స్థాయిలో ఉంటారు. వివిధ మదరసాల నుంచి పనికొచ్చేవారికి మసూల్స్ ఎంపిక చేసి లాహోర్‌లోని శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నారని ఇంటరాగేషన్‌లో హమ్జా తెలిపాడు. ఎక్కడెక్కడ ఎలా ఈ శిక్షణ ఇస్తున్నారంటే.. 1. దౌరాబైత్ ఉల్ రిజ్వాన్, పంజాబ్ యుద్ధ శిక్షణ 2. తబూక్ క్యాంప్ గడి, హబిబుల్లా ఫారెస్ట్ సాయుధ శిక్షణ 3. ఆక్సా మసర్ కేంప్ షువై నాలా.. ముజఫరాబాద్ మ్యాప్ రీడింగ్, జీపీఎస్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ 4. కరాచీ ఫుడ్ సెంటర్, ముజఫరాబాద్ సరకుల్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం, నిల్వ, వినియోగంలో శిక్షణ 5. డైకెన్, ముజఫరాబాద్ గోడలు ఎక్కడంలో శిక్షణ 6. మస్కర్ ఖైబర్ అండర్ గ్రౌండ్ సెంటర్, ముజఫరాబాద్ ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ 7. ఖలీద్ బిన్ వాలిద్, జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం, ముజఫరాబాద్ ఆయుధాలు, దుస్తులు పంపిణీలో శిక్షణ శిక్షణా శిబిరాలకు సయీద్, లఖ్వీ హాజరయ్యేవారు : హమ్జా హమ్జా తండ్రి స్వయంగా మసూల్. అతనే తనకి ఉగ్రవాదం శిక్షణ ఇచ్చాడని హజ్జా వెల్లడించాడు. ఈ శిక్షణ శిబిరాల్లో తమకు ఎలాంటి అవసరం వచ్చినా పాక్ ఆర్మీ, ఐఎస్ఎస్ సిబ్బంది సాయం చేసేవారని చెప్పాడు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన సమయంలో సయీద్, లఖ్వీలుకూడా వచ్చేవారని చెప్పాడు. సయీద్ అందరినీ హత్తుకొని భారత్‌పై దాడులకు దిగండంటూ ప్రేరేపించాడని హజ్జా చెప్పుకొచ్చాడు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తండ్రి లాడెన్ ఉగ్రజాడల్లో..
-
తండ్రి ఉగ్రజాడల్లో..
► జిహాదీలను ఏకం చేస్తున్న ఒసామా వారసుడు ► ధ్రువీకరిస్తున్న అమెరికా నిఘా వర్గాలు, నిపుణులు పారిస్: అంతమైపోయిందనుకుంటున్న అల్‌కాయిదా మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోందా? ఒసామా అంతమయ్యాక అస్తిత్వంకోసం పోరాడుతున్నా పూర్తిస్థాయిలో దక్షిణాసియాపై పట్టుకోసం ప్రయత్నిస్తోందా? ఇన్నాళ్లూ నాయకత్వలేమి.. ఒసామాతో ఉన్న సన్నిహితులు కొందరు ఐసిస్ వైపు వెళ్లడంతో దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లైంది. గతవారం అమెరికాపై ఉగ్రదాడికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ ఫొటో అల్‌కాయిదా పునరుజ్జీవం దిశగా అడుగులేస్తోందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ చిత్రంలో ఓవైపు డబ్ల్యూటీసీ టవర్స్ కూలిపోతున్న దృశ్యం, మరోవైపు కుమారుడు హమ్జాతో కలసి ఒసామా కూర్చున్నారు. అప్పటి బాలుడైన హమ్జా ఇప్పుడు 28 ఏళ్ల యువకుడిగా తండ్రి స్థాపించిన ఉగ్రసంస్థను ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా గూఢచార సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఒసామా ఉన్న పాత చిత్రాన్ని చాలా రోజుల తర్వాత తెరపైకి తేవటం వెనక ఉద్దేశం అల్‌కాయిదా పునరాగమనం కోసమేనని అంతర్జాతీయ విశ్లేషకుల భావన. జిహాదీల ఐక్యతే లక్ష్యంగా... ఒసామా మరణం తర్వాత ఆయన సన్నిహితులు కొందరు అల్‌కాయిదాను వీడినా.. హమ్జాతో కలసి మరికొందరు బలహీనమైన సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జిహాదీలను ఏకం చేయటంలో హమ్జా కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఐసిస్ మిలటరీ బలహీనపడుతున్న నేపథ్యంలో అల్‌కాయిదాను బలోపేతం చేసే వ్యూహాలతో హమ్జా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘తన తండ్రి స్థాపించిన సంస్థను నడిపేందుకు హమ్జా పూర్తి సన్నద్ధతకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఒసామా వారసుడిగా జిహాదీల్లో ఐకమత్యం తీసుకురావటంలో ఆయనకు సానుకూల అవకాశాలున్నాయి. ఐసిస్ పతనమవుతున్న తరుణంలో అంతర్జాతీయ జిహాదీ ఉద్యమానికి హమ్జా నాయకత్వం వహించే అవకాశం ఉంది. తండ్రిని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాదులను ఆకర్షిస్తున్నాడు’ అని ఎఫ్‌బీఐ మాజీ ప్రత్యేక ఏజెంట్, అల్‌కాయిదా స్పెషలిస్టు అలీ సౌఫాన్ ఉగ్రవాద పోరాట కేంద్రం (సీటీసీ) ప్రచురించిన రిపోర్టులో పేర్కొన్నారు. అబోట్టాబాద్‌కు ప్రతీకారంగా ఒసామా మూడో భార్య కుమారుడైన హమ్జా.. మొత్తం 20 మంది సంతానంలో 15వ వాడు. చిన్నప్పటినుంచే తండ్రినే అనుసరించాడు. ఆయుధాల వినియోగం నేర్చుకున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి ముందు రోజు ఒసామా నుంచి దూరంగా ఈయన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత తండ్రి కలవలేదు. భార్యలు,సోదరులను తీసుకుని అఫ్గాన్ అక్కడినుంచి ఇరాన్‌కు లాడెన్ వెళ్లిపోయాడు. ఒసామా తయారుచేసిన గూఢచార వ్యవస్థతో నిరంతరం తండ్రితోపాటుగా జిహాదీలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. ఒసామాను ఎన్కౌంటర్ చేసిన పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్ ఇంట్లో కొన్ని లేఖలు దీన్ని బలపరుస్తున్నాయి. 2015లో విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో కాబూల్ నుంచి బాగ్దాద్ వరకు, గాజా నుంచి వాషింగ్టన్, లండన్, పారిస్, టెల్ అవివ్ వరకు జిహాదీలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చాడు. హమ్జా హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. జిహాదీల్లో ఈయనకు పెరుగుతున్న ఆదరణ వాస్తవమేనని గుర్తించి అంతర్జాతీయ ఉగ్రవాదుల బ్లాక్‌లిస్టులో పేరు చేర్చింది. పశ్చిమాసియాలో హమ్జా ప్రభావం పెరుగుతోందని తేల్చింది.