Hand artists
-
మిథిలానగరి మైథిలమ్మలు
మిథియాంచల్! పెద్దగా వినని పేరు. కొద్దిగా మార్చి మిథిల అంటే.. అది మనకు బాగా పరిచయమున్న పేరే. ఈ మిథియాంచల్‌లో ‘మైథిలమ్మలు’ అడుగడుగునా కనిపిస్తారు. అందరూ సీతమ్మకు చెల్లెమ్మలే. మిథియాంచల్ మహిళల చేతి కుంచె నుంచి సీతమ్మవారు, ఆమె పాణిగ్రహీత రాముని రూపం రంగుల్లో మధుబని కళగా జాలువారుతుంటాయి. రామాయణ ఘట్టాలు అలవోకగా కాన్వాసుపై పరచుకుంటాయి. కళకు ప్రాణం గౌరీ మిశ్రా ఎంత గొప్ప కళ అయినా.. ఆ కళకు రాజపోషణ ఉన్నంత కాలమే మన్నుతుంది. ఆ కళాకారులకు అన్నం దొరికినంత కాలం బతికి బట్టకడుతుంది. మిథియాంచల్‌లో చేతిలో కళ ఉన్న కళాకారులున్నారు, వారసత్వంగా వస్తున్న కళను బతికించుకోవాలనే తపన ఉన్న వాళ్లూ ఉన్నారు. అయితే తమ చేతిలో ఉన్న కళ గొప్పదనం తెలియని తనం కూడా వారిలో ఎక్కువే. అలాంటి పరిస్థితిలో మధుబని పెయింటింగ్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు గౌరీ మిశ్రా. ఆమె 1993లో ‘సేవ’ పేరుతో సంస్థను స్థాపించి మైథిలి మహిళలను ఒక గొడుగు కిందకు చేర్చారు. ‘‘మీ కళకు సమాజంలో గౌరవం ఉంది, ధైర్యంగా పని చేయండి’’ అని ఆ గ్రామీణ మహిళా హస్తకళాకారులకు ఇరవై ఏళ్ల పాటు భరోసా ఇచ్చారు. గౌరీ మిశ్రాకు వార్ధక్యం వచ్చేసింది. ఆ మధుబని మైథిలులకు అండగా నిలిచే వాళ్లు లేరు. వారికి మార్కెట్ నైపుణ్యాలు తెలియచేసి ఆ ఆర్ట్‌ను మోడరన్ సొసైటీకి దగ్గర చేసే ఓ మనిషి కావాలి. ఆ మనిషి మహిళ అయితే మంచిదనుకున్నారు గౌరీ మిశ్రా. మనవరాలికి వారసత్వం 2010 సంవత్సరం. ఓ రోజు మనవరాలు ఐహితశ్రీ శాండిల్యను మిథియాంచల్‌కు తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఐహిత కురుక్షేత్ర ఎన్ఐటిలో చదివింది. అప్పటికి ఐబిఎమ్లో ఉద్యోగం చేస్తోంది. తన మనసులో మాట ఏమీ చెప్పకుండా తనకు తోడుగా రమ్మని తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఆ అమ్మాయికి మధుబని కళ లోతుల్ని చూపించారు. కళాకారుల చేతిలోని గొప్పతనం గురించి చెప్పారు. మధుబని చిత్రలేఖనంలో బొమ్మ గీయడం, రంగులు వేయడం అంతా కుంచెతోనే. స్కేలు, పెన్సిల్ వంటివి వాడరు. వలయాకారాన్ని గీయడానికి కనీసం చేతి గాజునైనా ఆసరాగా తీసుకుంటారేమోనని చూసింది ఐహిత. అలాంటిది కూడా లేదు! కుంచెతోనే వలయాకారాన్ని గీసేస్తున్నారు. దాని వెనుక ఎన్నేళ్ల సాధన దాగి ఉందోనని ఆశ్చర్యపోవడం ఐహిత వంతయింది. ఇరవై ఏళ్లు శ్రమించి పదిహేను వేల మందిని ఒక చోటుకు తెచ్చి, ఉపాధికి నమ్మకం కల్పించిన విషయాన్ని మనవరాలికి గుర్తు చేశారు గౌరీమిశ్రా. తన తర్వాత వాళ్లకు ఒక ఆలంబన కోసం ఎదురు చూస్తున్నానని కూడా ఆ సందర్భంలోనే చెప్పారు. ఆ వచ్చే వ్యక్తి.. మధుబని కళ గొప్పతనాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. మహిళల నైపుణ్యానికి పదును పెడుతూ, మార్కెట్ కోరుకునే డిజైన్లను ఈ ప్రక్రియలో మేళవించగలిగిన ఆసక్తి కూడా ఉన్న వ్యక్తి అయితేనే ఈ సామ్రాజ్యం నిలుస్తుందని చెప్పారు. తాను రంగంలోకి దిగినప్పటి పరిస్థితిని, ఆ తర్వాత వచ్చిన మార్పులను కూడా వివరించారు. కాలం వెనుక మధుబని మధుబని ఆర్ట్ గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లో తొలి ఎన్‌జివోను స్థాపించారు గౌరీమిశ్రా. దళారులను తప్పించి ప్రభుత్వ సంస్థలతో కలిసి హస్తకళాకారుల చేత ఎగ్జిబిషన్లలో స్టాళ్లు పెట్టించారు. అనేక మంది ఈ కళను నేర్చుకోవడానికి వేదిక కల్పించారు. ఆ కళకు తగినంత ఆదరణ వచ్చిన తర్వాత, మార్కెట్లో గిరాకీ పెరగడంతోపాటు నకిలీ కళాకృతుల తయారీ కూడా మొదలైంది. చేత్తో వేసే మధుబని డిజైన్ని డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రింట్ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. కళను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలంటే, టెక్నాలజీ తెలిసిన కొత్త తరంతోనే సాధ్యమని కూడా గౌరీ మిశ్రా తన మనవరాలికి చెప్పారు. ‘అస్మిత’తో కొత్త కళ! 2012లో ఐహిత ఐబిఎమ్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది. ‘మధుబని అస్మిత’ పేరుతో మైథిలి మహిళలకు అండగా నిలుస్తానని నానమ్మతో చెప్పింది. ఈ ఐదేళ్లలో ఐహిత మధుబని కళను విదేశాలకు పరిచయం చేసింది. మ్యూజియం పార్ట్నర్షిప్లో భాగంగా న్యూయార్క్‌లోని రుబిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ముంబయిలోని జీవీకే జయహే మ్యూజియం స్టోర్, బెంగళూరు ఫోక్‌ఆర్ట్ గ్యాలరీలలో ఈ మైథిలీ కళను ప్రదర్శించింది. ఇప్పుడు నెలలో పది రోజులు ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌లలో ప్రదర్శనల కోసం పర్యటిస్తోంది. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఈ వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తోంది. అలాగే స్టాల్లో అడిగిన వారికి, అడగని వారికి కూడా అసలైన మధుబని హస్తకళాఖండానికి, నకిలీ ప్రింట్‌కి తేడాను వివరించగలుగుతోంది.మధుబని మన సంస్కృతిలో భాగం. సంస్కృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనడానికి ఈ మైథిలమ్మలే ఉదాహరణ అంటోంది ఐహిత. మైథిలమ్మలు బిహార్ రాష్ట్రంలో ఉత్తర భాగాన ఓ మారుమూల ప్రదేశం మిథియాంచల్. ఇక్కడి మహిళలను మైథిలి అంటారు. మనకు తెలిసిన మైథిలి సీతమ్మ ఒక్కటే. ఇక్కడి మైథిలమ్మలంతా తప్పనిసరిగా సీతారాముల కల్యాణం ఘట్టాన్ని చిత్రించడం నేర్చుకుంటారు. ఈ చిత్రలేఖన ప్రక్రియను మధుబని అని పిలుస్తారు. -
చేతిలో కళ ఉన్నా.. బతుకులో ‘కళ’ సున్నా!
సాక్షి, జనగామ : తమ అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో అందరి మన్ననలందుకొన్న పెంబర్తి కళాకారులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన నగిషీలను తయారు చేస్తున్న కళాకారులకు ప్రభుత్వ ఆదరణ కరువవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారుల ఆర్డర్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేతినిండా పనిలేకపోవడంతో పొట్ట నింపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హస్తకళల ఐకాన్‌గా పేరుగాంచిన జనగామ జిల్లా పెంబర్తి కళాకారుల కష్టాలపై ‘సాక్షి’ కథనం.. తగ్గిపోతున్న కళాకారులు.. నిజాం కాలం నుంచి జనగామలోని పెంబర్తి గ్రామం హస్తకళా నైపుణ్యానికి పెట్టింది పేరుగా ఉంది. గతంలో పెంబర్తిలో 80 కుటుంబాలు హస్తకళపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రతి ఇంట్లో హస్తకళా నగిషీలను తయారుచేసి ఇచ్చేవారు. కాలక్రమంలో రెడీమేడ్‌గా లభించే నకిలీ నగిషీల అమ్మకం పెరిగింది. కళాకారులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గి, ఆదరణ లేకుండా పోయింది. దీంతో కొన్ని కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో 25 కుటుంబాలు మాత్రమే హస్తకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. పెంబర్తి బ్రాండ్‌తో సొమ్ము.. హస్తకళలకు బహిరంగ మార్కెట్లో ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ వ్యా పారులు షోరూంలు ఏర్పాటు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నగిషీలు కావాలని వచ్చే వారి నుంచి మధ్యవర్తులు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు తీసుకుంటున్నారు. వారు గ్రామంలో ఉన్న కళాకారులకు కూలీల చొప్పున చెల్లిస్తున్నారు. ఒక్కో కళాకారుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు మించి రావడం లేదంటే ఏ విధంగా దోచుకుంటున్నారో తెలుసుకోవచ్చు. అలాగే, పెంబర్తి కళాకారులు నాలుగు పదుల వయస్సుకే ముసలితనానికి గురవుతున్నారు. మెటల్ వాడకంలో వెలువడే రసాయనాలతో కళాకారులు రోగాల బారిన పడుతున్నారు. అట్టెం (లక్క) కరిగించడం, నైట్రిక్ యాసిడ్ రసాయనాలతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, దృష్టి లోపంతోపాటు, వెన్నునొప్పికి కారణమవుతోంది. ప్రభుత్వం గీత, చేనేత, బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద నెలకు రూ.1000 చొప్పున పింఛన్లు అందిస్తోంది. కానీ, పెంబర్తి కళాకారులకు ఆ సౌకర్యం లేక పోవడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పూట గడవని పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ భారమై.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కళాకారుడి పేరు రాగి వెంకటేశ్వర్లు. ఈయనది పెంబర్తి గ్రామం. 32 ఏళ్ల నుంచి గ్రామంలో హస్తకళల తయారీ పనులు చేస్తున్నారు. ఇతడిపై భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. హస్తకళతో నెలకు రూ.10 వేలు మాత్రమే సంపాదించగలడు. గిరాకీ రాకుంటే అవీ రావనీ, పూటపూటకూ కష్టమేనని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూత అందిస్తేనే తమ జీవితాలు బాగుపడుతాయంటున్నాడు. కూలి పనికి వెళ్లలేకనే... ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కూరోజు అన్నపూర్ణ. పెంబర్తి గ్రామం. తన తండ్రి వారసత్వంగా నేర్చుకున్న హస్తకళతో భర్త సంపతాచారితో కలసి 30 ఏళ్ల నుంచి నగిషీలు తయారు చేస్తుంది. పెట్టుబడికి డబ్బులు లేక కూలీ పని మాత్రమే చేస్తున్నారు. ఇద్దరూ కష్టపడినా నెలకు రూ.10 వేలకు మించి రావడం లేదు. తాము బయటి పనులకు వెళ్లలేకే ఈ పని చేస్తున్నామని అన్నపూర్ణ చెబుతోంది. కళ్లు, ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ షోరూంను ఏర్పాటు చేయాలి 35 ఏళ్ల నుంచి నగిషీలను తయారు చేస్తున్నా. ఆర్డర్లపైనే ఆధారపడి పనులు చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తుల కారణంగా గిరాకీలు రావడం లేదు. కళాకారులు తయారు చేసే నగిషీలను విక్రయించడానికి పెంబర్తిలో ప్రభుత్వమే షోరూం ఏర్పాటుచేయాలి. 50 ఏళ్లకే పింఛన్పాటు హెల్త్ కార్డులిస్తే మా కుటుంబాలు బాగుపడతాయి. – ఐల సదానందాచారి, కళాకారుడు -
చందేరీ అందాలు
చందేరీ చేనేత వస్త్రాలు భాగ్యనగరిలో కనువిందు చేస్తున్నాయి. అక్కడి హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఆభరణాలు ఇక్కడి మగువల మనసు దోచుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా చందేరీ పట్టణానికి చెందిన ‘కల్యాణ్ బున్కర్ హ్యాండ్లూమ్’ సంస్థ బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో చందేరీ వస్త్రాలు, ఆభరణాల ప్రదర్శనను మంగళవారం ప్రారంభించింది. ‘చందేరీ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు, హస్త కళాకారులు తయారు చేసిన నగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు చందేరీ పేరుతో నకిలీ వస్త్రాలను, ఆభరణాలను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు, చందేరీ వస్త్రాలు, నగలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాం’ అని సంస్థ నిర్వాహకుడు షోయబ్ ఖాన్ చెప్పారు. ఈ ప్రదర్శనలో హ్యాండ్‌మేడ్ బీడెడ్ జ్యూవెలరీ, చేనేత వస్త్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చందేరీ చీరలు రూ.3 వేల నుంచి రూ.30 వేల వరకు, ఆభరణాలు రూ.300 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈనెల 17 వరకు కొనసాగుతుంది. - సాక్షి, సిటీప్లస్ -
హస్తకళాసౌరభం
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంద వుంది హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు అబ్బురపరుస్తున్నారుు. విభిన్నమైన చేనేతలు కనువిందు చేస్తున్నారుు. పర్యావరణానికి హాని చేయుని జూట్ బ్యాగ్‌లు ఆకర్షణీయుంగా ఉన్నారుు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ బంజారాహిల్స్ ఆసియూనా ఫంక్షన్హాల్లో గురువారం ప్రారంభించిన ‘లేపాక్షి హ్యాండ్లూమ్ కాటన్ అండ్ సిల్క్ మేళా’లో ఇలాంటివెన్నో వెరైటీలు. కంటి చూపు సమస్యలతో బాధపడేవారి కోసం తయారు చేసిన పిన్‌హోల్ గ్లాసెస్ ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఉదయుం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. బంజారాహిల్స్