hand broken
-
సార్.. వస్తున్నారని ఆతృత.. జారిపడిన విద్యార్థి
సాక్షి, మూసాపేట: మూసాపేట బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి (ఇంగ్లిష్ మీడియం) చదువుతున్న విశ్వనాథ్ ఎడమ చేయి బుధవారం పాఠశాలలో విరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరగతి గది బయట విద్యార్థులు మాట్లాడుతుండగా ఓ విద్యార్థి సార్ వస్తున్నాడు అని చెప్పడంతో తోటి విద్యార్థులు అందరూ ఒక్కసారిగా తరగతి గదిలోకి వెళ్ళారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే విద్యార్థి బెంచి తగిలి కింద పడటంతో అతనిపై మిగతా విద్యార్థులు పడగా విశ్వనాథ్ చేయి విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. టీచర్ తరగతి గదికి వచ్చే గ్యాప్లో ఈ సంఘటన జరిగిందని హెచ్ఎం రాజ్ పాల్ సింగ్ తెలిపారు. సకాలంలో తరగతికి ఉపాధ్యాయులు హాజరు కాలేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
క్యూలైన్లో వృద్ధురాలి చేయి విరిగింది..
మెదక్: నగదు కోసం రోజులు తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సిరావడంతో ఖాతాదారుల్లో ఓపిక నశిస్తోంది. క్యూలో తోపులాటలు జరుగుతున్నాయి. స్థానిక ఎస్బీహెచ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం తోపులాట చోటుచేసుకుంది. మండలంలోని బడంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్ అహ్మద్బి పింఛను డబ్బుల కోసం తన కోడలితో కలిసి బ్యాంకు వద్దకు వచ్చింది. ఉదయానికే భారీ లైను ఉండడంతో ఆమె కూడా లైన్లో నిలబడింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా జనం తోసుకోవడంతో అహ్మద్బి కింద పడిపోయింది. క్యూలో నిలుచుకున్న మరికొందరు ఆమెపై పడిపోవడంతో బ్యాంకు తలుపు అద్దాలు తగిలి ఒత్తిడికి చేయి విరిగిపోయింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఆ వృద్ధురాలిని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించి సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు.