hanumantha shinde
-
టీఆర్ఎస్ అభ్యర్థికే నా ఓటు: షిండే
వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హన్మంత షిండే స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు వస్తున్న వార్త కథనాలలో వాస్తవం లేదని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారిని నైతిక విలువలు ఉన్నాయిని, ఈ నేపథ్యంలో తాను టీడీపీ ఎవరిని రాజ్యసభ బరిలో నిలబెడితే వారికి కళ్లు మూసుకుని ఓటు వేస్తానంటూ హన్మంత షిండే వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. 2009లో నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా షిండే ఎన్నికయ్యారు. అయితే తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై షిండే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే హన్మంత షిండే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. -
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు:షిండే
రానున్న ఎన్నికలలో భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో మాత్రం తాను లేనని తెలిపారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇస్తానని ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంఎల్ఏ హన్మంత షిండే వెల్లడించారు. టీఆర్ఎస్లో చేరినప్పటికి నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజ్యసభలో ఆ పార్టీ పదవి ఖాళీ అయింది. ఫిబ్రవరి 7న రాజ్యసభకు జరగనున్న ఎన్నికలలో ఒకరు లేదా ఇద్దరు టీడీపీ సభ్యులు ఎన్నికైయ్యే అవకాశం ఉంది.