రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు:షిండే | I will support to TDP candidate due to rajya sabha elections says TRS MLA hanumantha shinde | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు:షిండే

Published Fri, Jan 24 2014 11:17 AM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM

I will support to TDP candidate due to rajya sabha elections says TRS MLA hanumantha shinde

రానున్న ఎన్నికలలో భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో మాత్రం తాను లేనని తెలిపారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇస్తానని ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంఎల్ఏ హన్మంత షిండే వెల్లడించారు. టీఆర్ఎస్లో చేరినప్పటికి నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజ్యసభలో ఆ పార్టీ పదవి ఖాళీ అయింది. ఫిబ్రవరి 7న రాజ్యసభకు జరగనున్న ఎన్నికలలో ఒకరు లేదా ఇద్దరు టీడీపీ సభ్యులు ఎన్నికైయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement