టీఆర్ఎస్ అభ్యర్థికే నా ఓటు: షిండే | i will support to trs candidate due to rajya sabha elections, says hanumantha shinde | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ అభ్యర్థికే నా ఓటు: షిండే

Published Sat, Jan 25 2014 10:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

i will support to trs candidate due to rajya sabha elections, says hanumantha shinde

వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హన్మంత షిండే స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు వస్తున్న వార్త కథనాలలో వాస్తవం లేదని అన్నారు.

 

శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారిని నైతిక విలువలు ఉన్నాయిని, ఈ నేపథ్యంలో తాను టీడీపీ ఎవరిని రాజ్యసభ బరిలో నిలబెడితే వారికి కళ్లు మూసుకుని ఓటు వేస్తానంటూ హన్మంత షిండే వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

 

2009లో నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా షిండే ఎన్నికయ్యారు. అయితే తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై షిండే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే హన్మంత షిండే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement