Hanumantha vehicle
-
భక్తాగ్రేసుడిపై శ్రీరామచంద్రమూర్తి
సాక్షి, తిరుమల: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శనివారం హనుమంత వాహనం ఊరేగింపు వైభవంగా సాగింది. రాత్రి ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుడి రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం రాత్రి 10 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వసంతోత్సవాన్ని రద్దు చేశారు. -
హనుమంత వాహనంపై శ్రీరాముడి రాజసం
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. వాహన సేవ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గజ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామి వారు గజరాజు వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న శ్రీరామ పట్టాభిషేకం హరికథ పారాయణం కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం కడప సవేరా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామపట్టాభిషేకం హరికథా పారాయణం భక్తులకు ఆకట్టుకుంది. రామచంద్ర పుష్కరిణి వేదికపై ఎల్.శ్రీనివాసరావు గానం చేసిన శ్రీరామజననం హరికథా గానం అలరించింది. -
హనుమంతునిపై కల్యాణ వెంకన్న
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించారు. వాహన మండపంలో స్వామిని అభిషేకించి పట్టువస్త్రాలు, వివిధ స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అలంకార భూషితుడైన స్వామిని హనుమంత వాహనంపై కొలువుంచారు. అనంతరం స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా కళ్యాణ వెంకన్న గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత స్వామికి ఊంజల్ సేవ శోభాయమానంగా నిర్వహించారు. వేడుకగా వసంతోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేతుడైన కల్యాణ వెంకన్నకు వసంతోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పాలు, పెరుగు, నారికేళ జలం, తేనె, నెయ్యి, చందనం వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా స్వామికి వసంతోత్సవ సేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటప్ప, ఆలయ ఈవో సుబ్బరామిరెడ్డి, వాహనాల ఇన్స్పెక్టర్ బాబురెడ్డి, ప్రకాష్, ఆలయాధికారి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.