Hariprasad Reddy
-
రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్’ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం
సాక్షి, అనంతపురం: నగరంలోని స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుల తీరు రోగులను ఆవేదనకు గురి చేస్తోంది. బాధితులు తెలిపిన మేరకు... మల విసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్న జమ్మలమడుగుకు చెందిన ప్రకాష్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురంలోని తన సోదరుడి కుమారుడు హరిప్రసాదరెడ్డితో కలసి ఓ ప్రైవేట్ ఆసపత్రికి వెళ్లి చూపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరికీ ఎంఆర్ఐ పిస్టులాగ్రామ్ లిమిట్ కట్స్ వైద్య పరీక్ష చేయించుకుని రావాలంటూ స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు డాక్టర్ ప్రణీత్‌రెడ్డి రెఫర్ చేశారు. దీంతో వారు స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్లో పేషెంట్ ఐడీ నెంః 230116–026(హరిప్రసాద్‌రెడ్డి), 230116–025(ప్రకాష్‌రెడ్డి)తో పరీక్ష చేయించుకున్నారు. ఇందుకుగాను ఇద్దరికీ కలిపి రూ.14 వేలు బిల్లు అయింది. అనంతరం రిపోర్టు తీసుకెళ్లి వైద్యుడికి చూపిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్లో ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున బిల్లు అయిందంటూ వివరించారు. దీంతో డాక్టర్ అసహనానికి గురవుతూ తాను రాసిచ్చిన పరీక్షలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.3,500 మాత్రమే అవుతుందని, రూ.7 వేలు చొప్పున ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి బాధితులు ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పంపారు. డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ ఈ సందర్భంగా బాధిత రోగులు వాపోయారు. దీనిపై స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుల్లో ఒకరైన దాదాగాంధీ మాట్లాడుతూ.. డాక్టర్ సూచన మేరకు తాము వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హరిప్రసాద్ రెడ్డికి వైద్యుడు రాసిచ్చిన టెస్టు చీటి -
నార్త్ అమెరికాలో ఏపీ ప్రిన్సిపల్ లయజన్‌గా హరిప్రసాద్‌రెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ఉత్తర అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చేలా కృషి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్సిపల్ లయజన్‌గా లింగాల హరిప్రసాద్‌రెడ్డిని నియమించింది. ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఏపీలో స్థానికులకు ఉపాధి కల్పించే బాధ్యతలను హరిప్రసాద్‌రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు మధ్య హరిప్రసాద్‌రెడ్డి వారధిలా కృషి చేస్తారని తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన లింగాల హరిప్రసాద్‌రెడ్డి చాలా కాలం కింద అమెరికా వెళ్లి డెట్రాయిట్లో స్థిరపడ్డారు. 2014 నుంచి అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభ్యులుగా ఉన్న హరిప్రసాద్ రెడ్డి వేర్వేరు కంపెనీల్లో పలు హోదాల్లో పని చేశారు. గల్ఫ్ దేశం ఒమన్‌తో పాటు ఆఫ్రికాలోని పలు మైనింగ్ కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే హరిప్రసాద్‌రెడ్డికి పలు కంపెనీలతో మంచి సంబంధాలున్నాయి. ఆయన అనుభవం, ప్రజా సంబంధాల దృష్ట్యా హరిప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రిన్సిపల్ లయజన్ అధికారిగా నియమించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతల పట్ల లింగాల హరిప్రసాద్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. -
న్యూస్ చానల్ పెట్టిన నయీం!
గ్యాంగ్‌స్టర్ నయీం కార్యకలాపాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. హరిప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని సీఈవోగా నియమించి ఐ-10 న్యూస్ పేరిట నయీం చానల్ పెట్టినట్లు తాజాగా వెల్లడైంది. హరిప్రసాద్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ మేరకు వెల్లడించారు. హరిప్రసాద్ రెడ్డికి మావోయిస్టు వ్యతిరేక కథనాలు ప్రచారం చేయాలని నయీం ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో నయీంకు వ్యతిరేకంగా హరిప్రసాద్ రెడ్డి వార్తలు రాశాడని, దీంతో నయీం అనుచరుడు పాశం శ్రీను.. హరిప్రసాద్ రెడ్డిని నయీంతో పరిచయం చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పటి నుంచి హరిప్రసాద్ రెడ్డికి నయీంతో సంబంధాలు కొనసాగించాడని పేర్కొన్నారు. న్యూస్ చానల్ పెట్టడానికి మొదట 13.50 లక్షలు నయీం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతర ఓ మంత్రి బర్త్ డే సందర్భంగా పాట తయారుచేయించి దానికి విజువల్స్ కోసం నయీం 1.50 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. నయీం మరణానంతరం నయీం వ్యవహారాల్లో ఉపయోగించిన సెల్ ఫోన్ ను చాదర్ ఘట్ వద్ద మూసీలో పడేసినట్లు హరిప్రసాద్ రెడ్డి పోలీసులతో వెల్లడించాడు. -
జాబు ఎప్పుడిస్తావ్?
వైఎస్ఆర్సీపీ విదార్థి విభాగం జిల్లా అధ్యక్షుడి డిమాండ్ తిరుపతి తుడా: సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక వారికి ఇచ్చిన హామీలను విస్మరించారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తూ ఎస్వీయూ ప్రకాశం భవనం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం కోసం నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి ఇప్పుడు ఉన్నజాబుల్ని ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అందలేదన్నారు. హామీలను నెరవేర్చకుంటే విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్‌కుమార్, మురళీధర్, సుధీర్‌రెడ్డి, రవీంద్రనాయక్, చైతన్య, కిషోర్, నాగరాజునాయక్, నవీన్‌కుమార్‌గౌడ్, బషీర్, సురేష్ పాల్గొన్నారు.