Harman Singh
-
మతం నుంచి మానవత్వం వైపు...
మానవత్వాన్ని మించిన మతం లేదు. అయితే, మత పిచ్చితో, మత విద్వేషాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న మారణహోమాలు కోకొల్లలు. అలాంటి మతం హద్దులను చెరిపేసి.. మతం కంటే మానవత్వం గొప్పదనే సత్యాన్ని మరోసారి నిరూపించాడు ఈ భారతీయ యువకుడు. న్యూజిలాండ్‌లో బిజినెస్ కోర్సు చదువుతున్న ఇతని పేరు హర్మాన్ సింగ్. మే 15వ తేదీన ఆక్లాండ్‌లో పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న హర్మాన్ సింగ్ పరుగెత్తుకొచ్చాడు. తలకు గాయమై తీవ్రంగా రక్తమోడుతున్న పిల్లాడిని చూసి మనసు చలించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా తలపాగా తీసి పిల్లాడి తల చుట్టూ కట్టి ప్రాణాపాయం నుంచి కాపాడి ఆస్పత్రిలో చేర్పించాడు. మతాచారం ప్రకారం సిక్కులు బహిరంగంగా తలపాగా తీయడం నిషేధం. ఆన్లైన్లో విస్తృత ప్రచారం పొందిన ఈ వీడియో చూసి లక్షలాది మంది ప్రశంసల జల్లు కురిపించారు. మానవత్వం కంటే మరేదీ గొప్పది కాదని, అందుకే అలా చేశానని ‘వన్న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సాదాసీదా జీవితం గడుపుతున్న హర్మాన్ మానవత్వాన్ని మెచ్చుకున్న ఓ పెద్దాయన ఇతనికి ట్రక్కు నిండా ఫర్నీచర్‌ను బహుమతిగా పంపాడు. -
మతం.. మానవత్వం.. ఫర్నిచర్
ఆక్లాండ్ మతం కన్నా మానవత్వం మిన్న అని నిరూపించాడో ఓ సిక్కు యువకుడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాలుడిని కాపాడేందుకు, మత నిబంధనను కూడా పక్కన బెట్టిన ఆ యువకుడి తీరు ప్రశంసలందుకుంది. అతడి చొరవను మెచ్చుకున్న స్థానిక టీవీ చానల్ ఒకటి.. ఓ ఫర్నిచర్ షాపు సహకారంతో.. అతడి అపార్టుమెంటులో కావల్సిన మొత్తం ఫర్నిచర్ అంతటినీ ఉచితంగా అందించింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం.. 22 ఏళ్ల హర్మన్ సింగ్ తన అపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో రోడ్డు మీద కీచుమనే శబ్దంతో సడన్ బ్రేక్.. శబ్దం. మళ్లీ రయ్ మని దూసుకుపోయిన సౌండ్.. చిన్న పిల్లల అరుపులు, ఏడుపులు వినిపించాయి. అంతే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నాడు. అక్కతో కలిసి స్కూలుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో విపరీతమైన రక్తస్రావంతో బాలుడు ప్రమాదకర స్థితిలో పడి ఉన్నాడు. ముందు ఆ రక్తస్రావాన్ని ఆపాలి. ఎలా.. ఇంకేమీ ఆలోచించలేదు.. తన తలపై ఉన్న తలపాగా తీసి బాబుకు కట్టుకట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. ''నేను మతం గురించి గానీ, మరే విషయం గురించి గానీ ఏమీ ఆలోచించలేదు.. ఎలాగైనా కారుతున్న రక్తాన్ని ఆపాలి. అంతే.. అందుకే ఆలా చేశాను'' అన్నాడు హర్మన్ సింగ్. తనకు చాలా ఆనందంగా ఉందని, ఇపుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. మానవత్వానికి పెద్దపీట వేసినందుకు చాలా మంది సిక్కులు కూడా అతణ్ని అభినందనల్లో ముంచెత్తారు. -
మతాచారం కంటే మానవత్వమే మిన్నగా..
ఆక్లాండ్: మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి ఒక బాలుడి ప్రాణాలు కాపాడిన 22 ఏళ్ల హర్మన్ సింగ్ హీరో అయ్యాడు. అతని మత ఆచారాన్ని మించిన మానవత్వానికి అందరూ జై జైలు కొడుతున్నారు. హర్మన్ సింగ్ న్యూజిలాండ్ లో అక్లాండ్ లో నివాసం ఉంటున్నాడు.. అదే ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు తన సోదరితో స్కూలుకి బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక కారు ఆ బాలున్ని ఢీకొంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్న హర్మన్ సింగ్ వెంటనే అక్కడకి వెళ్లాడు. బాలుడికి తలనుంచి రక్తస్రావం అవ్వడం గమనించిన సింగ్ ఇంకో ఆలోచన లేకుండానే తన తల పాగాని తీసి బాలుడికి గాయమైన ప్రాంతంలో గట్టిగా కట్టాడు. తీవ్ర గాయాలతో అసుపత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి మొదట క్లిష్టంగా ఉన్న ప్రస్తుతం నిలకడగానే ఉంది. 'సిక్కు మత ఆచారం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తల పాగాని తీయడం క్షమించరాని నేరం. నాకు తలపాగా మీద అపారమైన భక్తి ఉంది. కానీ ఆ సమయంలో మత ఆచారం గురించి ఆలోచించలేదు. ఆ ప్రమాదంలో గాయలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలున్ని రక్షించడమే నా కర్తవ్యంగా భావించాను' అని సింగ్ అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇదంతా గమనించిన గగన్ దిల్లాన్ అనే వ్యక్తి ఫోటో తీసి ఫేస్ బుక్‌లో పోస్టు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. పోస్టు చేసిన తక్కువ వ్యవధిలోనే హర్మన్ సింగ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి.