harsh coments
-
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
చెత్త రాయబారి మీరే....
న్యూఢిల్లీః అమెరికాలో పాక్ రాయబారి అజీజ్ అహ్మద్ చౌదరిపై భారత్‌లో పాక్ రాయబారిగా గతంలో వ్యవహరించిన అబ్దుల్ బాసిత్ నిప్పులు చెరిగారు. అజీజ్ వంటి పనికిమాలిన విదేశీ కార్యదర్శిని ఇంతవరకూ చూడలేదని, ఆయనకు గుండె సరైన స్థానంలో లేదని బాసిత్ మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో కూడిన లేఖను ఏకంగా అజీజ్ చౌదరికే పంపారు. ఈ ఏడాది జులై 5న రాసిన లేఖ ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక పత్రిక డాన్ ఈ విషయాన్ని నిర్థారించింది ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పాక్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన అజీజ్ అనంతరం అమెరికాలో పాక్ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాలో ఇప్పటివరకూ పనిచేసిన రాయబారుల్లో మీరే చెత్త రాయబారిగా మిగులుతారన్నదే నా ఆందోళన అంటూ ఈ లేఖలో బాసిత్ పేర్కొనడం గమనార్హం. దౌత్య వృత్తి మీకు సరిపడదంటూ అజీజ్‌కు బాసిత్ సలహా ఇవ్వడం లేఖలో మరో ట్విస్ట్. అజీజ్ వైఫల్యాలను ప్రస్తావించిన బాసిత్....2015లో రష్యాలో భారత ప్రధాని మోడీతో కలిసి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంయుక్త ప్రకటన ఇవ్వడం, ఐరాస మానవ హక్కుల మండలిలో తిరిగి ఎన్నికవ్వడంలో పాక్ వైఫల్యం అజీజ్ లోపాలుగా పేర్కొన్నారు.