చెత్త రాయబారి మీరే....
న్యూఢిల్లీః అమెరికాలో పాక్ రాయబారి అజీజ్ అహ్మద్ చౌదరిపై భారత్‌లో పాక్ రాయబారిగా గతంలో వ్యవహరించిన అబ్దుల్ బాసిత్ నిప్పులు చెరిగారు. అజీజ్ వంటి పనికిమాలిన విదేశీ కార్యదర్శిని ఇంతవరకూ చూడలేదని, ఆయనకు గుండె సరైన స్థానంలో లేదని బాసిత్ మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో కూడిన లేఖను ఏకంగా అజీజ్ చౌదరికే పంపారు. ఈ ఏడాది జులై 5న రాసిన లేఖ ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక పత్రిక డాన్ ఈ విషయాన్ని నిర్థారించింది ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పాక్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన అజీజ్ అనంతరం అమెరికాలో పాక్ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాలో ఇప్పటివరకూ పనిచేసిన రాయబారుల్లో మీరే చెత్త రాయబారిగా మిగులుతారన్నదే నా ఆందోళన అంటూ ఈ లేఖలో బాసిత్ పేర్కొనడం గమనార్హం.
దౌత్య వృత్తి మీకు సరిపడదంటూ అజీజ్‌కు బాసిత్ సలహా ఇవ్వడం లేఖలో మరో ట్విస్ట్. అజీజ్ వైఫల్యాలను ప్రస్తావించిన బాసిత్....2015లో రష్యాలో భారత ప్రధాని మోడీతో కలిసి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంయుక్త ప్రకటన ఇవ్వడం, ఐరాస మానవ హక్కుల మండలిలో తిరిగి ఎన్నికవ్వడంలో పాక్ వైఫల్యం అజీజ్ లోపాలుగా పేర్కొన్నారు.