Harshad Mehta
-
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు!
రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేసేవారు. స్టాక్‌మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండటం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు. తొలి పెట్టుబడి బంపర్ హిట్..! 1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సెసా గోవా, టైటాన్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేశ్ అడుగుపెట్టినప్పుడు సెన్సెక్స్ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాకేశ్ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు రూ. 46,000 కోట్ల స్థాయికి చేరింది. 2017లో టైటాన్ షేరు జోరు మీద ఉన్నప్పుడు 1 రోజులోనే ఏకంగా రూ. 900 కోట్లు ఆర్జించారు. రాకేశ్ కొన్న కంపెనీ షేరు పెరుగుతుంది.. అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంటుతో అసంఖ్యాకంగా ఇన్వెస్టర్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. వైఫల్యాలూ ఉన్నాయి.. రాకేశ్‌కు నష్టాలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇన్ఫ్రా విభాగంలో పెట్టుబడులు ఆయనకు కలిసిరాలేదు. రియల్టీ భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతో 2013లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌లో రూ. 34 కోట్లు పెట్టి 25 లక్షల షేర్లు కొన్నారు. 2018లో కంపెనీ దెబ్బతిన్నప్పటికీ మరికాస్త కొన్నారు. కానీ చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. మంధన రిటైల్లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. 2016లో సంస్థ షేరు రూ. 247గా ఉన్నప్పుడు 12.7% వాటా కొన్నారు. 2021లో రూ. 16కి అమ్మేశారు. అలాగే డీబీ రియల్టీలోనూ, ప్రైవేట్ ఈక్విటీ కింద చేసిన పెట్టుబడుల్లో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లూ నష్టాలు తెచ్చిపెట్టాయి. వివాదాలూ ఉన్నాయి.. బిగ్ బుల్గా పేరొందినప్పటికీ ఆయన బేర్ పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్ సందర్భంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం కొంత ఉండే మార్కెట్లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారికి భిన్నంగా రాకేశ్‌కి కాస్త క్లీన్ ఇమేజే ఉంది. అయినప్పటికీ ఆయనపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆప్టెక్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును 2021లో ఆయనతో పాటు మరికొందరు రూ. 37 కోట్లతో సెటిల్ చేసుకున్నారు. అలాగే సోనీ పిక్చర్స్‌లో విలీనం కావాలని జీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. జీ ఎంటర్‌ప్రైజెస్‌లో రాకేశ్ ఇన్వెస్ట్ చేయడం, స్వల్ప వ్యవధిలోనే రూ. 70 కోట్లు లాభాలు పొందడం, ఆయన వ్యవహారాలపై సందేహాలు రేకెత్తించాయి. కంపెనీల పోర్ట్‌ఫోలియో.. రాకేశ్‌కు 40 పైచిలుకు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్‌లో భాగమైన టైటాన్ వీటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది. వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. టైటాన్లో ఆయనకున్న 5.05% వాటాల విలువే రూ. 11,000 కోట్ల మేర ఉంటుంది. స్టార్ హెల్త్, ర్యాలీస్, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా మోటర్స్ మొదలైన సంస్థలలోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు. హంగామా మీడియా, ఆప్టెక్ సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైన వాటిల్లో డైరెక్టరుగా ఉన్నారు. భార్య రేఖ, తన పేరు కలిసి వచ్చేలా రేర్ (RARE) ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి, కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో రాకేశ్, ఆయన భార్య రేఖకు 40% వాటాలు ఉన్నాయి. -
'1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా?
1988 నుంచి 1991వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్స్. అప్పటికే 100ఏళ్ల చరిత్ర ఉన్న బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో ఎప్పుడూ చూడని కొత్త పోకడ మొదలైంది. ఏరోజుకారోజు ఇన్వెస్ట్ చేయడం. లాభాలు గడించింది. ఇన్వెస్ట్ చేయడం మళ్లీ లాభాల కోసం వెయిట్ చేయడం. ఇలా బుల్ రన్‌తో సెన్సెక్స్ రోజుకో రికార్డ్ సృష్టించింది. కానీ 1992 ఏప్రిల్ 23 బాంబే స్టాక్ మార్కెట్లో భారీ స్కాం జరిగిందంటూ ఇన్వేస్టిగేటీవ్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ బాంబు వేసింది. ఆమె రాసిన ఆర్టికల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) ఇక సుచేతా దలాల్ ఎవరు? ఆమె హర్షద్ మెహతాను ఎందుకు టార్గెట్ చేసింది. ఆ స్కాం ఎలా చేశారు? బేర్ కార్టెల్ ఎవరు? ఇవన్నీ అటుంచితే. ఆ స్కాం గురించి 'స్కాం 1992' పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. అందులో హర్షద్ మెహతా హవా జరిగే సమయంలో ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఎలాంటి ఒడిదుడుకు లోనయ్యారనే అంశం బాగా హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలోని రియల్ లైఫ్ క్యారక్టర్స్ ఎవరివో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదీ చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2021 నాటి వీడియో వైరల్ ♦ ప్రతిక్ గాంధీ - హర్షద్ మెహతా ♦ హర్షద్ మెహతా తమ్ముడు అశ్విన్ మెహత కేరక్టర్లో హేమంత్ కేర్ యాక్ట్ చేశారు ♦ హర్షద్ మెహతా భార్య జ్యోతి మెహతా పాత్రలో అంజలీ బారోత్ యాక్ట్ చేశారు ♦ సుచేతా దలాల్ పాత్రలో శ్రేయ దన్వంతరీ యాక్ట్ చేశారు ♦ డెబాషిస్ పాత్రలో ఫైసల్ రషీద్ యాక్ట్ చేశారు. ♦ మనుముంద్రా కేరక్టర్లో సతీష్ కౌషిక్ యాక్ట్ చేశారు ♦ రాధా కిషన్ దమానీ పాత్రలో పరేష్ గంట్రా యాక్ట్ చేశారు ♦ రాకేష్ ఝున్ ఝున్ వాలా పాత్రలో కెవిన్ డేవ్ నటించారు ♦ రాం జఠ్మలానీ పాత్రలో మిథులేష్ చతుర్వేదీ యాక్ట్ చేశారు. -
డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి
దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎవరి అడిగితే ముఖేశ్ అంబాని అని ఠక్కున చెప్పేస్తాం. మరి రెండో వ్యక్తి ఎవరని అడిగితే టాటా,బిర్లా, మహీంద్రా, అజీం, శివనాడర్, బజాజ్ ఇలా పేర్లు వెతుకుతాం. కానీ వీళ్లెవరు కాదు .ఈ రెండో సంపన్నుడి పేరు రాధకిషన్ దమాని. ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఈ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్ సెన్స్‌ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. D Mart Founder Radhakishan Damani: రాధా కిషన్ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్‌లోని బికనేర్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్ దమానీ ముంబై స్టాక్ ఎక్సేంజీలో బ్రోకర్‌గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్‌కి గోపి కిషన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ.... ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు. ఆ ఘటనతో... ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్‌లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్‌పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్‌కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు దమానీ కదలడు మెదలడు స్టాక్ మార్కెట్ అంటేనే గందరగోళం.. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్ అనే బ్యాడ్జ్ అతని షర్ట్‌పై ఉంటే అదే పేరుతో జీఎస్ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్ పల్స్‌ని మాత్రం బాగా గమనించే వాడు. హర్షద్ మెహతాకు పోటీగా రాధ కిషన్ దమానీ స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్‌ను పైకి లేపడంలో హర్షద్‌కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్లో నిలిచింది ట్రిపుల్ ఆర్‌లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్‌కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే. అదే జరిగి ఉంటే ఓ కంపెనీ టైర్స్ షేర్ల విషయంలో హర్షద్ మెహెతా, ట్రిపుల్ ఆర్ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్ బుల్ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్ ఆర్ బేర్ వైపు నిల్చుంది. హర్షద్ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్ ఆర్ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్ ఎత్తులు వేసే రాధా కిషన్ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది. పట్టిందల్లా బంగారమే 1992 నుంచి 1998 వరకు రాధి కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్టీ, హెచ్డీఎఫ్సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్ మార్కెట్‌ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్‌టర్మ్‌లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అప్నా బజార్ తక్కువ ధరకే వస్తువులను భారతీయులు కొనుగోలు చేయాలనుకుంటారని, అందుక తగ్గట్టుగా తక్కువ ధరకే కిరాణా సామన్లు అందించే స్టోర్లుగా అప్నా బజార్ పేరుతో కోపరేటివ్ సూపర్ మార్కెట్ వ్యవస్థను 1998లో నెలకొల్పారు. అయితే ఇటు స్టాక్ మార్కెట్, అటు సూపర్ మార్కెట్ల మధ్య సమతూకం లేక అప్నా బజార్ నష్టాల పాలైంది. స్టాక్‌మార్కెట్‌కి గుడ్‌బై తొలి సారి బాల్‌బేరింగ్ వ్యాపారంలో వచ్చిన నష్టం దమానీని వేధిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అప్నా బజార్లో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో దమానీలో పట్టుదల పెరిగింది. కోట్ల రూపాయల సంపద అందించిన స్టాక్ మార్కెట్‌కి 2000లో గుడ్‌బై చెప్పాడు. డీ మార్ట్ ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్ హైపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్ విజయ పరంపర మొదలైంది. ధనవంతుల జాబితాలో డీ మార్ట్ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. ఇండియాలో ముకేశ్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. విలువలే ఆధారంగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తెల్ల అంగీ తెల్ల ప్యాంటు మాత్రమే ఆయన ధరిస్తారు.దీంతో ఆయన్ని మిస్టర్ వైట్ అండ్ వైట్‌గా పిలుచుకుంటారు. 80వ దశకంలో స్టాక్ మార్కెట్లో హర్షద్‌మెహతా ఎత్తులకు మిగిలిన ఇన్వెస్టర్లు చిత్తైపోతుంటే తెగువతో నిలిచారు దమానీ. ఆ పోరులో సర్వం కోల్పేయే వరకు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. అందువల్లే స్కాములు చేసిన హర్షద్ ఎలా పైకి ఎదిగాడో అలాగే నేలకరిస్తే.. నెమ్మదస్తుడిగా పేరున్న దమానీ టాటా బిర్లాలనే వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పటికీ అదే తీరు ముంబై స్టాక్ మార్కెట్లో బ్రోకర్‌గా అగుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, బయట పార్టీలకు వెళ్లడం, ఆఖరికి మార్కెట్ మీద సైతం కామెంట్ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయం అందించిన తనే పేరు రాయించడు, కనీసం మాట వరసకి కూడా చెప్పొదంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్ చేస్తారు. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్ ఫోటోలు సైతం మీడియాకి లభించలేదంటే ఎంత లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి : BigBull: పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
ది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్
హర్షద్ మెహతా మరణించి ఏ లోకాన ఉన్నాడో బాలీవుడ్‌కు నాలుగు డబ్బులు సంపాదించి పెడుతున్నాడు. ఆయన జీవించి ఉండగా చాలామందిని ముంచాడు. కానీ మరణించాక బాలీవుడ్‌కు తానొక కథా వస్తువై డబ్బు ఇస్తున్నాడు. అతని బయోపిక్ ‘ది బిగ్బుల్’ టీజర్ విడుదలైంది. షేర్ల కుంభకోణంతో దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతాను ఇన్నాళ్ల తర్వాత బాలీవుడ్ వెంటవెంటనే తెర మీద చూపింది. ఇప్పటికే అతని మీద ‘సోని లివ్’లో ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ వచ్చి భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు సినిమా వంతు. ఇందులో హర్షద్‌గా అభిషేక్ బచ్చన్ నటిస్తే నిర్మాత అజయ్ దేవ్‌గణ్. కుకీ గులాటీ దీని దర్శకుడు. తాజా దీని టీజర్ విడుదలైంది. దాంతో పాటు విడుదల తేదీగా ఏప్రిల్ 8ని ప్రకటించారు. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. డైరెక్ట్‌గా సినిమాలు ప్రస్తుతం రిలీజ్ అవుతూ ఉన్నా అజయ్ దీనిని ఓటీటి ద్వారానే రిలీజ్ చేస్తున్నాడు. ‘చిన్నవాళ్లను పెద్ద కలలు కనడానికి ప్రపంచం అడ్డుపడుతుంటుంది. అందువల్ల చిన్నవాళ్లు తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటారు’ అని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానంతో ఈ టీజర్ రిలీజైంది. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా క్యాప్షెన్ పెట్టారు. అభిషేక్ బచ్చన్‌కు సరైన హిట్ లేక చాలా కాలం అవుతోంది. ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. పెద్దగా కమర్షియల్ హంగామాకు వీలులేని ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. Introducing The Big Bull... The mother of all scams!!! Trailer out on 19th March. #TheBigBull releasing on 8th April only on @DisneyplusHSVIP, stay tuned! 📈#DisneyPlusHostarMultiplex @Ileana_Official @nikifyinglife @s0humshah @kookievgulati @ajaydevgn pic.twitter.com/U4v3S6odZj — Abhishek Bachchan (@juniorbachchan) March 16, 2021 -
హీరో కాదు!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో సినిమాకు సైన్ చేశారు. అయితే హీరోగా కాదు. నిర్మాతగా. ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని తెలిసిందే. తాజాగా స్టాక్ మార్కెట్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ టాక్. స్టాక్ మార్కెట్లో హర్షద్‌కి బిగ్ బుల్ అనే నిక్ నేమ్ కూడా ఉందట. ఈ సినిమాను అజయ్ దేవగన్, బాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రకుమార్ కలిసి నిర్మిస్తారట. అయితే ఇందులో అజయ్ హీరోగా నటించరు. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట టీమ్. ఈ సినిమాకి కుకీ గులాటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంతకుముందు ‘విక్కీ డోనర్, పీకు, అక్టోబర్’ చిత్రాలకు కో–రైటర్‌గా పనిచేశారాయన. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ధమాల్ ప్రాంచైజీలో మూడో భాగం ‘టోటల్ ధమాల్’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఈ ‘గుజరాత్ నమూనా’ను ఇక సాగనీయొద్దు
అవలోకనం ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్ధరహితం. అందువల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే. గత కొన్ని సంవత్సరాల్లో వేలాది కోట్ల ప్రజా ధనాన్ని సులభంగా కైంకర్యం చేసిన హర్షద్ మెహతా, హితేన్ దలాల్, జతిన్ మెహతా, కేతన్ పరేఖ్ తదితర యువ గుజరాతీల జాబితాలో నీరవ్ మోదీ కూడా చేరారు. వారు దోచుకెళ్లిన డబ్బును ప్రజాధనం అని నేను ఎందుకంటున్నానంటే పబ్లిక్ రంగ బ్యాంకుల నుంచి వీరందరూ మాయం చేసిన డబ్బంతా పౌరులది కనుకనే. ప్రభుత్వానికి ఒక్కో షేరు రూ. 163కు అమ్మడం ద్వారా రూ. 5,500 కోట్లు సమీకరిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) మొన్న ప్రకటించింది. కానీ ఆ షేరు ధర నీరవ్ మోదీ వ్యవహారం తర్వాత రూ. 113కు పడిపోయిందని గుర్తుంచుకోవాలి. అంటే ఒక అసమర్థ బ్యాంకులో పెట్టుబడి కోసం మళ్లీ మనమంతా ఒక్కో షేరుకు అదనంగా రూ. 50 చెల్లించవలసి వస్తున్నదన్న మాట. ఇలా బ్యాంకుల్లోకి డబ్బు తరలించి నప్పుడల్లా ఇక అంతా సవ్యంగా ఉంటుందని పాలకులు మనకు చెబుతుంటారు. అయితే ఇదంతా బోగస్. ఇంతక్రితం భారీయెత్తున బ్యాంకులకు డబ్బులిచ్చిన ప్రతి సారీ ఏం జరిగిందో ఇప్పుడూ అదే పునరావృతమవుతుంది. మనకు తెలిసిన స్టాక్ మార్కెట్ స్కాం నిజానికి నీరవ్ మోదీ, జతిన్ మెహతాలు చేసిన బ్యాంకు కుంభకోణాల వంటిదే. జర్నలిస్టులు దేబాశిస్ బసు, సుచేతా దలాల్ కలిసి ‘ద స్కాం: ఫ్రమ్ హర్షద్ మెహతా టు కేతన్ పరేఖ్’ అనే గ్రంథం రాశారు. ఆ తర్వాత దాన్ని మరింత విస్తృతపరిచి ‘ఆల్సో ఇన్‌క్లూడ్స్ జేపీసీ ఫియాస్కో అండ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు స్కాం’ అని చేర్చి పునర్ముద్రించారు. ఈ దౌర్భాగ్య దేశంలో కుంభకోణాలకు కొదవలేదు గనుక ఆ పుస్తకాన్ని వారు నిరం తరం సవరించుకుంటూ పోకతప్పదన్నదే నా ఆందోళనంతా. హర్షద్ మెహతా కుంభకోణంపై ఆ పుస్తకంలో రాసిన ఒక పేరాను ఉటంకిస్తాను. ‘చాలా సులభంగా మన దృష్టికోణం తప్పిపోయేంత అతి పెద్ద కుంభకోణమిది. ఇది ఆరోగ్య బడ్జెట్ కంటే, విద్యకయ్యే బడ్జెట్‌కంటే చాలా పెద్దది. ఈ స్కాం లక్షలాది రూపాయలను చిల్లర డబ్బుగా మార్చేస్తుంది. ఆర్నెల్లలో ఎంతో అర్ధరహితంగా, భగ్గున పెరిగిన షేర్ల ధరలు ఉన్నట్టుండి కుప్పకూలుతుండగా బోఫోర్స్ స్కాంకు 50 రెట్లు అధిక మైన కుంభకోణం ఒకటి మధ్యతరగతిని సుడిగాలిలా చుట్టుముట్టింది’. హర్షద్ మెహతా స్టేట్ బ్యాంక్ కోసం సెక్యూరిటీలు కొన్నాడు. కానీ వాటిని ఆ బ్యాంకుకు అందజేయలేదు. ఆ సెక్యూరిటీలతో స్పెక్యులేషన్ వ్యాపారానికి దిగాడు. దీన్ని గురించి బసు, దలాల్ ఇలా అంటారు: ‘ఈ స్కీంలో అతనికి పేరు మోసిన ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ బ్యాంకు, రిజర్వ్‌బ్యాంకు అధీనంలోని నేషనల్ హౌసింగ్ బ్యాంకు తోడ్పడ్డాయి. ఈ రెండూ ఇష్టానుసారం హర్షద్ ఖాతాకు చెక్కుల్ని జమచేశాయి. రిజర్వ్‌బ్యాంకుతో స్టేట్ బ్యాంకుకు ఉండే ఖాతాను హర్షద్ తానే సొంతంగా నిర్వహించే స్థాయికి చేరాడు. కృత్రిమ కొనుగోళ్లను, అమ్మకాలను ఆ ఖాతా ద్వారా నడిపించి...అవి జరిగినట్టు చూపించినప్పుడల్లా వాటి తాలూకు డబ్బును తన సొంత ఖాతాకు క్రెడిట్ చేసుకోవడమో, డెబిట్ చేసుకోవడమో కొనసాగించేవాడు’. ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్ధరహితం. అందు వల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే. నేర న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండితీరాలి. రాజ్యం కూడా అన్ని సందర్భాల్లో ఎలాంటి మిన హా యింపూ లేకుండా నిందితులపై చర్యకు సిద్ధపడాలి. ఇది చాలా చాలా కష్టంతో కూడుకున్నదే అయినా ఇంతకు మించిన చికిత్స లేదు. ఈమధ్య బయటపడిన బడా కేసుల్లో ప్రభుత్వం దీన్ని అనుసరిస్తోందా? జరుగుతున్నదేమిటన్నది పాఠ కులే నిర్ణయించుకోవాలి. నరేంద్ర మోదీ నీరవ్ మోదీ వ్యవహారం గురించి ఇంకా మాట్లాడలేదు. అతని పేరుగానీ, పీఎన్బీ పేరుగానీ ఎత్తకుండా శుక్రవారం ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక సంస్థలు తమ పని తాము చేయడానికి అనుగుణమైన నిబంధనలనూ, విధానాలనూ రూపొందించేవారు... ముఖ్యంగా తనిఖీ, పర్య వేక్షక బాధ్యతలు తీసుకున్నవారు తమ పని తాము శ్రద్ధగా చేయాలి’ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారిపై చర్య తీసుకుంటూనే ఉంటామని కూడా ఆయన చెప్పారు. ఇంతకు ముందు పాలకులు కూడా తమ హయాంలో కుంభ కోణాలు బయటపడక ముందు ఇలాగే చెప్పారు. ఆకర్షణీయంగా మాట్లాడి బ్యాంకుల్ని మాయ చేయగలుగుతున్న బడా బాబుల నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గమేదీ లేదనిపిస్తోంది. హర్షద్ మెహతా తన మదుపు తాత్వికతకు ‘పునఃస్థాపక వ్యయ సిద్ధాంతం’(రీప్లేస్మెంట్ కాస్ట్ థియరీ) అని పేరెట్టాడు. సుస్థి రమైన ఒక కంపెనీ షేర్లను వాటి ప్రస్తుత రాబడుల ప్రాతిపదికన కాక, వాటిని పునఃస్థాపించడానికి లేదా భర్తీ చేయడానికి అవసరమయ్యే వ్యయంతో విలువ కట్టడం ఈ భావన సారాంశం. మూడు పదుల వయసులోనే హర్షద్ మెహతా ‘బిగ్ బుల్’గా ప్రసిద్ధుడయ్యాడు. సింహంగా, మేధావిగా చలామణి అయ్యాడు. నీరవ్ మోదీ ఏడేళ్లక్రితమే పంజాబ్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టడం మొదలెట్టాడు. కుంభకోణం బయల్పడటానికి కొన్ని రోజుల ముందే అతడూ, అతని కుటుంబ సభ్యులూ దేశం విడిచి పారిపోవడం యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వంలో కీలకమైన వారెవరో ఈ కుంభకోణం బయటపడబోతున్నదని అతడికి కచ్చితంగా ఉప్పం దించి ఉంటారు. నేను ప్రస్తావించిన ప్రసంగంలో మోదీ... తనిఖీ, పర్యవేక్షక బాధ్యతలు తీసు కున్నవారు శ్రద్ధాసక్తులతో తమ పని చేయాలని కోరడంతోపాటు ఆర్థిక అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని కూడా చెప్పారు. ప్రజాధ నాన్ని అక్రమ విధానాల్లో పోగేసుకోవడాన్ని వ్యవస్థ అంగీకరించబోదన్నారు. కొత్త ఆర్థిక వ్యవస్థ, కొత్త నిబంధనకు సంబంధించిన మౌలిక మంత్రం ఇదేనని తెలిపారు. గత అనుభవాలనుబట్టి ఈ మాటల్ని నమ్మాలా లేదా అన్న సంగతలా ఉంచి ఈ దేశానికి ప్రజాధనం కొల్లగొట్టే వారి బెడద ఉండకూడదని అందరూ ఆశిస్తారు. హర్షద్ మెహతా, హితేన్ దలాల్, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీల పరంపరకు ముగింపు ఉంటేనే ఉపశమనం కలుగుతుంది. కనీసం ఈ విషయంలో ‘గుజరాత్ నమూనా’ పునరావృతం కాకుండా ప్రధాని ఆపగలిగితే మనమంతా ధన్యులమవుతాం. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com